ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశాడు.[1][2]
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 మార్చి 30 | |||
ముందు | కలగర సాయి లక్ష్మణరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - 2019 | |||
ముందు | నాదెండ్ల మనోహర్ | ||
తరువాత | అన్నాబత్తుని శివకుమార్ | ||
నియోజకవర్గం | తెనాలి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 – 2004 | |||
ముందు | ఆలపాటి ధర్మారావు | ||
తరువాత | రాజ్ సతీష్ పాల్ | ||
నియోజకవర్గం | వేమూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 04 ఫిబ్రవరి 1960 గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | శివ రామకృష్ణ | ||
జీవిత భాగస్వామి | మాధవి | ||
సంతానం | అనూహ్య & అమూల్య |
రాజకీయ జీవితం
మార్చుఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా, 1999లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 22 అక్టోబర్ 1999 నుండి 26 నవంబర్ 2001 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు.
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ తరువాత జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి 2009, 2014, 2019లో పోటీ చేసి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[3] ఆయన 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి టిడిపి తరఫున పోటీ చేయాలని భావించగా జనసేన టిడిపి పొత్తుతో భాగంగా జనసేన నుండి నాదెండ్ల మనోహర్ కి టిక్కెట్ కేటాయించారు.
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 2025లో శాసనమండలికి జరిగిన ఎన్నికలలో గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గాల నుండి తెలుగుదేశం తరపున ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేసి [4] 82,320 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
మార్చు- ↑ Sakshi (4 August 2023). "పవన్ కల్యాణ్ క్లారిటీ.. ఆలపాటి రాజా ప్రస్థానం ముగిసినట్లేనా?". Archived from the original on 6 January 2024. Retrieved 6 January 2024.
- ↑ Sakshi (2019). "Vemuru Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
- ↑ Eenadu (20 October 2024). "రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెదేపా". Retrieved 20 October 2024.
- ↑ "కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆలపాటి, పేరాబత్తుల". Eenadu. 2 February 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "ఆలపాటి రాజా విజయభేరి". Eenadu. 4 March 2025. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "వైసీపీకి కోలుకోలేని దెబ్బ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం." Andhrajyothy. 4 March 2025. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.