అన్న తమ్ముడు (1958 సినిమా)

1958 తెలుగు సినిమా
(అన్నా తమ్ముడు (1958 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

అన్న తమ్ముడు శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ పతాకంపై సి.ఎస్.రావు దర్శకత్వంలో 1958, ఫిబ్రవరి 15న విడుదలైన తెలుగు సినిమా.

అన్న తమ్ముడు (1958 సినిమా)
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.యస్.రావు
నిర్మాణం కడారు నాగభూషణం
తారాగణం నందమూరి తారక రామారావు,
రాజసులోచన,
కన్నాంబ
సంగీతం అశ్వత్థామ
నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు
  • ఎన్.టి.రామారావు
  • షావుకారు జానకి
  • మాలతి
  • రాజసులోచన
  • జగ్గయ్య
  • రేలంగి
  • ముక్కామల
  • గిరిజ
  • కె.వి.ఎస్.శర్మ
  • నల్ల రామ్మూర్తి
  • ఆర్.నాగేశ్వరరావు
  • చదలవాడ కుటుంబరావు
  • ఎ.వి.సుబ్బారావు
  • మిక్కిలినేని
  • రావి కొండలరావు
  • బొడ్డపాటి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: సి.ఎస్.రావు
  • సంగీతం: అశ్వత్థామ
  • నిర్మాత: కడారు వెంకటేశ్వరరావు

ఇది ఒక కుటుంబానికి చెందిన రెండు తరాల కథ. పూర్వార్థంలో ఇద్దరన్నదమ్ముల కథను చిత్రించారు. అన్న బుద్ధిమంతుడుగా సన్మార్గంలో పయనించి న్యాయాధిపతిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. తమ్ముడు దుర్మార్గుడు.తన వంతు ఆస్తిని కాజేసి ఆ తర్వాత అన్నకు విషంపెట్టి చంపి అతని ఆస్తిని కాజేస్తాడు. అన్న భార్యను, పిల్లలను కూడా మట్టుపెట్టాలని చూస్తాడు. కానీ అతని ప్రయత్నం ఫలించదు. జడ్జిగారి పెద్ద కొడుకు పేదవాళ్ళ మధ్య పెరిగి పేదవాడిగా ఉంటాడు. చిన్నకొడుకు అనాథ శరణాలయంలో పెరిగి చదువుకుని వృద్ధికి వస్తాడు. చివరకు ఇద్దరూ న్యాయస్థానంలో కలుసుకుంటారు. అక్కడ అన్న హత్యానేరంలో ముద్దాయిగా నిలబడతాడు. తమ్ముడు తీర్పు చెప్పవలసిన న్యాయాధికారిగా కూర్చుంటాడు. ఒక అబలను ఒక దుర్మార్గుడి బారినుండి కాపాడడానికి, తన ప్రాణం కాపాడుకోవడానికి ముద్దాయి హత్యచేసినా, న్యాయశాస్త్ర రీత్యా అది నేరం అని నమ్మి తమ్ముడు అన్నకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తాడు.[1]

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు అశ్వత్థామ సంగీతాన్ని చేకూర్చాడు.[2]

క్ర.సం పాట గాయనీగాయకులు రచయిత
1 అనుకున్నదంతా జరిగిందిలే మన జీవితాలే ఎస్.జానకి సముద్రాల జూనియర్
2 అయ్యో పాపం తల్లిబిడ్డలకు ఆలికి ఎడబాటా మాధవపెద్ది దైతా గోపాలం
3 ఒక్క రక్తమే పంచుకుంటి నని..అయ్యో పాపం తల్లిబిడ్డ ( బిట్ ) మాధవపెద్ది దైతా గోపాలం
4 క్రూర జన్మకె అన్యాయముగా ...అయ్యో పాపం తల్లిబిడ్డ ( బిట్ ) మాధవపెద్ది దైతా గోపాలం
5 చిన్నారి చేతుల చిరుగాజు మ్రోతల చెలరేగు పి.బి.శ్రీనివాస్,
కె.రాణి
దైతా గోపాలం
6 చెంచులక్ష్మి ( నాటకం ) టి.ఆర్.తిలకం,
నల్ల రామ్మూర్తి,
మాధవపెద్ది బృందం
దైతా గోపాలం
7 తనయుడనుచు ఆ తల్లి..అయ్యో పాపం తల్లిబిడ్డలకు ( బిట్ ) మాధవపెద్ది దైతా గోపాలం
8 త్వరపడవోయి త్వరపడవోయి నా రాజా పరువపు వయసిది పి.సుశీల దైతా గోపాలం
9 మ్రోగింపవే హృదయవీణ పలికింపవే మధుర ప్రేమ జిక్కి ఆచార్య బి.వి.ఎన్
10 రండిరండి పిల్లల్లారా ముందుకు - తీపిమిఠాయి తెలుగు ఘంటసాల కొసరాజు
11 రగులుతుంది రగులుతుంది ఎగురుతుంది మాధవపెద్ది,
జమునారాణి
కొసరాజు
12 వయసు మళ్ళిన వన్నెలాడి మనసు తుళ్ళి పిఠాపురం,
ఘంటసాల
రావూరి

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు (23 February 1958). "'అన్న-తమ్ముడు '". ఆంధ్రపత్రిక. Retrieved 26 January 2020.[permanent dead link]
  2. కొల్లూరి భాస్కరరావు. "అన్న-తమ్ముడు 1958". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 26 January 2020.