ఉండుకము
పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము
(అపెండిక్స్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము. ఇది ఉదరములో కుడివైపు క్రిందిమూలలో పెద్ద ప్రేగు మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.
ఉండుకము | |
---|---|
Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process"). | |
Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view). | |
లాటిన్ | appendix vermiformis |
గ్రే'స్ | subject #249 1178 |
అంగ వ్యవస్థ | జీర్ణ వ్యవస్థ |
Precursor | Midgut |
MeSH | Appendix |
Dorlands/Elsevier | a_54/12147735 |
వ్యాధులు
మార్చు- అపెండిసైటిస్ (Appendicitis) : అపెండిక్స్ లేదా ఉండుకము ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని అపెండిసైటిస్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
- అపెండిసైటిస్ కు గల కారణాలు
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.
point.jpg[permanent dead link] [1] intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png[permanent dead link]
మూలాలు
మార్చుLook up ఉండుకము in Wiktionary, the free dictionary.