అభిమానం (సినిమా)
1960 సినిమా
అభిమానం 1960 లో సి. ఎస్. రావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రల్లో నటించారు.
అభిమానం (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.యస్.రావు |
---|---|
నిర్మాణం | సుందర్ లాల్ నహతా |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, పసుపులేటి కన్నాంబ, చిత్తూరు నాగయ్య, రేలంగి వెంకట్రామయ్య |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల |
గీతరచన | శ్రీశ్రీ |
సంభాషణలు | సముద్రాల జూనియర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు - వేణు
- సావిత్రి - రాధ
- పసుపులేటి కన్నాంబ - లక్ష్మీకాంతం, వేణు తల్లి
- చిత్తూరు నాగయ్య - డాక్టర్, సావిత్రి తండ్రి
- రేలంగి వెంకట్రామయ్య - సన్యాసి రావు
- కృష్ణకుమారి - కమల, వేణు చెల్లి
- ఎస్. వరలక్ష్మి
- అల్లు రామలింగయ్య
- కె.వి.ఎస్.శర్మ
- నల్ల రామమూర్తి
- రమణాచలం
- కోటేశ్వరరావు
- టి.రాజేశ్వరి
- ఎన్.లక్ష్మీకుమారి
- సురభి రాణి
- జ్యోతి
- తెర్లి అప్పారావు
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: సముద్రాల జూనియర్
- నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
- మేకప్: పీతాంబరం
- స్టిల్స్: సత్యం
- ఛాయాగ్రహణం: కమల్ ఘోష్
- స్టుడియోలు: వాహినీ, నరసూ, నెప్ట్యూన్
- కూర్పు: ఎన్. ఎమ్. శంకర్, సి.హరిరావు
- సహాయ దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు
- పాటలు: సముద్రాల జూనియర్, శ్రీశ్రీ, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఆరుద్ర
- సంగీతం: ఘంటసాల
- కళ: అణ్ణామలై
- నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, టి.అశ్వథ్ నారాయణ
- దర్శకత్వం: సి.యస్.రావు
పాటలు
మార్చుక్ర.సం. | పాట | రచన | పాడినవారు |
---|---|---|---|
1 | తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా | శ్రీశ్రీ | జిక్కి |
2 | ఊయలలూగి నా హృదయం తీయని పాట పాడేనే | శ్రీశ్రీ | పి.సుశీల |
3 | ఆనందమే ఆనందమే అంతరంగాల నిండి మా కలలెల్ల పండె | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
4 | ఇన్నేళ్ళు పెరిగిన ఈ ఇల్లు విడనాడి వెడలి పోయేనంచు వేగి పోయేవా | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
5 | ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది | ఆరుద్ర | జిక్కి, ఘంటసాల బృందం |
6 | మదిని నిన్ను నెరనమ్మి కొలుతునే మాతా దయగను ధనలక్ష్మీ | సముద్రాల జూనియర్ | మాధవపెద్ది, జె.వి.రాఘవులు |
7 | సుందరీ అందచందాల సుగుణశీల | ఆరుద్ర | ఘంటసాల |
8 | రాజు వెడలె రవితేజము లలరగ రాజ సభకు నేడు | సముద్రాల జూనియర్ | ఘంటసాల బృందం |
9 | మధురానగరిలో చల్లనమ్మ పోదు దారివిడుము కృష్ణా | సముద్రాల జూనియర్ | పి.సుశీల, ఎ.పి.కోమల బృందం |
10 | దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురా | కొసరాజు | పి.సుశీల |
11 | వలపు తేనె పాట తొలి వయసు పూల బాట పరువాల చిన్నెలా సయ్యాట | సముద్రాల జూనియర్ | ఘంటసాల, జిక్కి |
12 | రామా రామా ఇది యేమి కన్నీటి గాథ | ఆరుద్ర | ఎస్.వరలక్ష్మి |
మూలాలు
మార్చు- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.