సుందర్ లాల్ నహతా

చలనచిత్ర నిర్మాత, పంపిణీదారు

సుందర్ లాల్ నహతా చలనచిత్ర పంపిణీదారు, నిర్మాత.[1]

సుందర్ లాల్ నహతా
జాతీయతభారతీయుడు
విద్యబి.కామ్‌
విద్యాసంస్థకలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తినిర్మాత, పంపిణీదారు
క్రియాశీల సంవత్సరాలు1941-
గుర్తించదగిన సేవలు
శాంతి నివాసం,
వీరాభిమన్యు
పిల్లలుశ్రీకాంత్ నహతా
బంధువులుజయప్రద (కోడలు)

వృత్తి

మార్చు

ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయంలో బి.కాం.పట్టా పుచ్చుకుని 1941లో మద్రాసులో "చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్" అనే సంస్థకు మేనేజర్‌గా చేరాడు. ఆ సంస్థ యజమాని, ఈస్ట్ ఇండియా ఫిల్మ్‌ కంపెనీ అధినేత చమ్రియా ఇతని వ్యవహార నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుని కొంత కాలానికే ఆ సంస్థలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. యుద్ధం భయంవల్ల 1943లో చమ్రియా సంస్థ మద్రాసు నుండి విజయవాడకు తరలించబడి 1953 వరకు విజయవాడలోనే నడుపబడింది. ఆ సమయంలో సుందర్‌లాల్ తన సంస్థను చూసుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సహాయకారిగా ఉన్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఆ సమయంలో ఆంధ్ర చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడిగా కూడా ఎన్నికైనాడు.

1950లో ఇతడు తారాచంద్ బర్జాత్యా తో కలిసి రాజశ్రీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి అనేక సినిమాలను నిర్మించాడు. తరువాత ఇతడు శ్రీ ప్రొడక్షన్స్, రాజలక్ష్మి ప్రొడక్షన్స్, విజయలక్ష్మి పిక్చర్స్ వంటి సంస్థలను ప్రారంభించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మించాడు. ఇతని చిత్రాలన్నీ అఖండమైన విజయాన్ని సాధించాయి.

ఇతడు ఇండొనేషియా దేశం జకార్తాలో జరిగిన రెండవ ఆసియా-ఆఫ్రికా చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున పాల్గొన్నాడు. 1968లో జర్మనీ ప్రభుత్వం ఆహ్వానంపై జర్మనీలో జరిగిన ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ఇతడు దక్షిణ భారత చలనచిత్ర మండలికి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు[1].

సినిమాల జాబితా

మార్చు

ఇతడు నిర్మించిన సినిమాల జాబితా:

తెలుగు

మార్చు

హిందీ

మార్చు

మలయాళం

మార్చు

కన్నడ

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 సంపాదకుడు (1 August 1968). "సుందర్ లాల్ నహతా నిర్మాత" (PDF). విజయచిత్ర. Archived from the original (PDF) on 14 జూలై 2020. Retrieved 10 July 2020.

బయటిలింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుందర్ లాల్ నహతా పేజీ