అభిషేకం (సినిమా)
అభిషేకం 1998 లో ఎస్. వి. కృష్ణారెడ్డి స్వీయదర్శకత్వంలో నటించిన తెలుగు సినిమా. ఇందులో ఎస్. వి. కృష్ణారెడ్డి ద్విపాత్రాభినయం చేయగా రచన, రాధిక కీలక పాత్రలు పోషించారు.
అభిషేకం (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.వి.కృష్ణారెడ్డి |
---|---|
తారాగణం | ఎస్.వి.కృష్ణారెడ్డి, రచన |
సంగీతం | ఎస్.వి.కృష్ణారెడ్డి[1] |
నిర్మాణ సంస్థ | మనీషా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చువిజయ్ అలియాస్ విజ్జి ధనవంతులైన దంపతులకు ఒకే కొడుకు. అతని తండ్రి అంతుచిక్కని రోగంతో చనిపోతాడు. తల్లి మనస్థిమితం కోల్పోతుంది. విజయ్ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళీ మామూలు మనిషిని చేస్తాడు. పెరిగి పెద్దవాడై సంగీత కళాకారుడవుతాడు. తన తల్లిపై ఉన్న ప్రేమను సంగీతంలో కూడా చూపెడుతుంటాడు. అతని సంగీత బృందంలో కొంతమంది మిత్రులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ అతని తల్లి ఆదరిస్తూ ఉంటుంది.
సింగపూర్ తెలుగు సంఘానికి అధ్యక్షుడైన జి. కె నాయుడు ఆహ్వానం మేరకు విజయ్ బృందం అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి వెళుతుంది. జి. కె. నాయుడు కూతురైన శిరీష విజయ్ తో ప్రేమలో పడుతుంది. విజయ్ కి చిన్నప్పటి నుంచి ఒక విచిత్రమైన కల వెంటాడుతూ ఉంటుంది. తన చుట్టూ ఆయుధాలు పట్టుకున్న మనుషులు తిరుగుతూ ఉన్నట్లు కల వస్తుంటుంది. ఆ కల వచ్చినప్పుడల్లా విజయ్ మానసికంగా హింసననుభవిస్తుంటాడు. ఒకసారి శిరీష్, విజయ్ పార్టీ నుంచి వస్తుండగా వారిని దొంగలు అటకాయిస్తారు. వారిని ఎదిరించడంలో విజయ్ కు గాయాలవుతాయి. విజయ్ కు చికిత్స చేసే డాక్టర్ అతని రక్తాన్ని పరిశీలించి అనుమానంతో భారత్ లో ఉన్న అతని కుటుంబ డాక్టర్ తో మాట్లాడుతాడు. అతను ఒక విచిత్రమైన వ్యాధితో బాధ పడుతున్నాడనీ ఇంక ఎంతోకాలం బ్రతకననీ తెలుసుకుంటాడు. అతని స్నేహితులందరూ అది తెలుసుకుని బాధ పడుతారు కానీ విజయ్ మాత్రం అది తేలిగ్గా తీసుకుంటాడు కానీ తన బాధంతా తల్లి గురించే అని చెబుతాడు. ఇదే విషయాన్ని శిరీషకు గానీ, ఆమె తండ్రికి గానీ తెలియనివ్వద్దంటాడు విజయ్. లేకపోతే ఆమెకు కూడా తన తల్లికి పట్టిన గతే పడుతుందని అతని బాధ.
ఒకసారి విజయ్ కి తన పోలికలతో ఉన్న సాంబయ్య బజారులో ఎదురు పడతాడు. సాంబయ్య సంసార బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని అతి కష్టమ్మీద బ్రతుకీడుస్తుంటాడు. అతని కుటుంబ సభ్యులు కూడా అతన్ని గొంతెమ్మ కోర్కెలతో వేధిస్తుంటారు. సాంబయ్య ఆఫీసుకెళ్ళగానే విజయ్ అతని రూపంలో వెళ్ళి వాళ్ళ ఇంట్లో సభ్యులకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. అందుకు ప్రతిఫలంగా తన స్థానంలో సాంబయ్యను వెళ్ళమంటాడు. సాంబయ్య, అతని కుటుంబ సభ్యులు మొదట్లో అంగీకరించపోయినా అతనికి తల్లి మీదున్న ప్రేమని తెలుసుకుని ఒప్పుకోవడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
మార్చు- విజయ్/సాంబయ్యగా ఎస్. వి. కృష్ణారెడ్డి
- రచన
- విజయ్ తల్లిగా రాధిక
- శ్రీహరి
- జి. కె. నాయుడిగా తనికెళ్ళ భరణి
- శివాజీరాజా
- సుధాకర్
- ఉత్తేజ్
- ఆలీ
- వేణుమాధవ్
- గౌతంరాజు
- డబ్బింగ్ జానకి
- రజిత
పాటల జాబితా
మార్చు- కబడ్డీ కబడ్డీ కబడ్డీ... జయం నీదే యారోరచన. భువన చంద్ర, గానం. మనో, ఫెబీ బృందం
- కన్నెపిల్ల కనిపిస్తే సింగ్ సాంగ్, రచన. చంద్రబోస్ , గానం. సోనూ నిగమ్ బృందం
- నాలో నిన్ను చూసుకోగా నాలో , రచన.సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం. ఉపద్రస్ట సునీత, ఉన్ని కృష్ణన్
- సింగపూర్ జంబో జెట్ , రచన: చంద్రబోస్, గానం . ఉన్ని కృష్ణన్
- సురభి సొగసులు చమజ్ చమక్ లు, రచన: చంద్రబోస్, గానం . ఉదిత్ నారాయణ్
- సొగసులు
- సదా నిమ్మవృక్షస్య మూలాదివాస,(పద్యం), గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు- ↑ "Abhishekam(1998), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-03-17.
2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.