అమర్ సింగ్ తిలావత్
అమర్ సింగ్ తిలావత్ (జననం 1953 జనవరి 29) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 1978 నుండి 1983 వరకు బోథ్ ఎస్టీ నియోజకవర్గం నుండి శాసన సభసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1] ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్పించిన ప్రముఖుడు. తెలంగాణ తొలి దశ ఉద్యమ విద్యార్థి నాయకుడు, మలి దశ ఉద్యమాలలో పాల్గొన్నాడు. అఖీల భారతీయ బంజారా సేవా సంఘం జాతీయ నాయకుడు.[2]
అమర్ సింగ్ తిలావత్ | |||
| |||
మాజీ శాసనసభ్యుడు,మాజీ పర్యాటక మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1978 - 1983 | |||
ముందు | యస్.ఎ దేవ్ షా | ||
---|---|---|---|
తరువాత | కాశీ రామ్ మర్సకోలా | ||
నియోజకవర్గం | బోథ్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 29 జనవరి 1953 గౌలిగూడ తాండా, నేరడిగొండ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | వేంకట్ రామ్,రంగీబాయి | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీబాయి తిలావత్ | ||
సంతానం | అజయ్ సింగ్,విజయ్ సింగ్ | ||
నివాసం | పెట్రోల్ బంక్ ఏరియా,సిర్పూర్ కాగజ్ నగర్,కె.బి.ఆసిఫాబాద్, తెలంగాణ,ఇండియా | ||
మతం | ఇండియన్ హిందూ |
జననం, విద్యాభ్యాసం
మార్చుఅమర్ సింగ్ తిలావత్ తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం, నారాయణ పూర్ గ్రామ సమీపంలోని గౌలిగూడ తాండాలో వేంకట్ రామ్, రంగీబాయి తిలావత్ దంపతులకు 1953 జనవరి 29న జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదు నుండి ఎం.ఏ;ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.
రాజకీయ ప్రస్థానం
మార్చుఅమర్ సింగ్ తిలావత్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978 లో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యార్థి జాదవ్ గణేష్ పై 22.333 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు[3]. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలక వర్గ సభ్యునిగా 1979 లో ఆదిలాబాద్ జిల్లా నుండి నియమించబడ్డాడు.1981 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవనం వెంకట్ రామ్ ప్రభుత్వంలో గవర్నమెంట్ విప్ గా నియమితులయ్యారు.1982 లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి గా పని చేశారు[4].1984,1989లో బోథ్ ఎస్టీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి అతి స్వల్ప ఓట్లతో ఓటమి చేందారు[5].అమర్ సింగ్ తిలావత్ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ని విడి భారతీయ జనతా పార్టీ లో చేరాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఅమర్ సింగ్ తిలావత్ 1978 మే 7న లక్ష్మీబాయిని వివాహమాడాడు, వారికీ ఇద్దరు కుమారులు అజయ్ సింగ్ తిలావత్, విజయ్ సింగ్ తిలావత్ ఉన్నారు.
నోటరి అడ్వకేట్
మార్చుఅమర్ సింగ్ తిలావత్ ఉస్మానియా విశ్వవిద్యాలయం సత్యమ్మ నరసింహారావు లా కాలేజీ నుండి ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకుని 1983 మార్చి 16 న న్యాయవాదిగా హైదరాబాదు హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు[6]. అనంతరం 1985 నుండి సిర్పూర్ కాగజ్‌నగర్ మున్సిప్ఫ్ మెజిస్ట్రీట్ కోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తూ, ఎనిమిది సంవత్సరాలు న్యాయవాద వృత్తి పూర్తి చేసి 1992లో నోటరి అడ్వకేట్ గా గుర్తింపు పొందాడు.[7] బంజారా,లంబాడీ గిరిజనుల న్యాయపరమైన సమస్యలను హైకోర్టులో ను ,సుప్రీంకోర్టులోను స్వతగా వాదిస్తున్నాడు[8].
బంజారా సేవా సంఘంలో కీలక పాత్ర
మార్చుఅమర్ సింగ్ తిలావత్ 1998లో పూజారి రంజిత్ నాయక్ అధ్వర్యంలో అల్ ఇండియా బంజారా సేవా సంఘంలో చేరారు.2018 లో ఆ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులైయ్యారు.అనంతరం అఖీల భారతీయ బంజారా సేవా సంఘానికి జాతీయ అధ్యక్షులు హోదాలో పని చేయుచున్నారు. ఆ సంఘం కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరింప చేస్తు లంబాడీ, బంజారా లపై జరుగుతున్న అన్యాయాన్ని,దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తు సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు[9].
మూలాలు
మార్చు- ↑ "Boath Elections Results 2018, Current MLA, Candidate List of Assembly Elections in Boath, Telangana". Elections in India. Retrieved 2024-08-14.
- ↑ Bharat, E. T. V. (2019-08-11). "बंजारा समाजाचा एस.टी. संवर्गात समावेश करा - अमरसिंग तिलावत". ETV Bharat News (in మరాఠీ). Retrieved 2024-08-14.
- ↑ "Boath Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2024-08-14.
- ↑ "माजी मंत्री अमरसिंह तिलावत की अध्यक्षता मे बैठक". 2020-08-05. Retrieved 2024-08-14.
- ↑ "🗳️ Amar Singh Tilawat, Boath Assembly Elections 1989 LIVE Results | Election Dates, Exit Polls, Leading Candidates & Parties | Latest News, Articles & Statistics | LatestLY.com". LatestLY (in ఇంగ్లీష్). Retrieved 2024-08-14.
- ↑ "Amar Singh Tilawat Map, Location, Directions, Route, Contact number, Email, Mobile, Address, Website". getlaw.in. Retrieved 2024-08-14.
- ↑ Correspondent, D. C. (2018-06-02). "Banjara body to fight for Lambadas in Supreme Court". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-14.
- ↑ Correspondent, D. C. (2018-06-02). "Banjara body to fight for Lambadas in Supreme Court". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-15.
- ↑ "అఖిల భారత బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి – Mana Corporator" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-15.