అమర్ సింగ్ (క్రికెటర్)

లద్ధాభాయ్ నాకుమ్ అమర్ సింగ్ (1910 డిసెంబరు 4 - 1940 మే 21) ఒక భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. [1] కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలరు, సమర్థవంతమైన దిగువ వరుస బ్యాట్స్‌మన్. అమర్ సింగ్ లద్ధా, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు భారతదేశం తరపున ఏడు టెస్టుల్లో ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీశాడు. అతను మొదటి భారతీయ ఫాస్ట్ బౌలరు, ఆల్ రౌండరు, టెస్ట్ క్యాప్ అందుకున్న మొదటి భారతీయుడు. అతను భారతదేశం ఆడిన మొట్టమొదటి టెస్ట్‌లో భారతదేశపు మొట్టమొదటి అర్ధ శతకం కూడా సాధించాడు.

అమర్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లద్ధాభాయ్ నాకుమ్ అమర్ సింగ్
పుట్టిన తేదీ(1910-12-04)1910 డిసెంబరు 4
రాజ్‌కోట్, గుజరాత్
మరణించిన తేదీ1940 మే 21(1940-05-21) (వయసు 29)
జామ్‌నగర్, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండరు
బంధువులుLadha Ramji (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 1)1932 జూన్ 25 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1936 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 7 92
చేసిన పరుగులు 292 3,344
బ్యాటింగు సగటు 22.46 24.23
100లు/50లు 0/1 5/18
అత్యధిక స్కోరు 51 140*
వేసిన బంతులు 2,182 23,689
వికెట్లు 28 506
బౌలింగు సగటు 30.64 18.35
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 42
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 14
అత్యుత్తమ బౌలింగు 7/86 8/23
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 77/–
మూలం: ESPN Cricinfo, 2020 మే 9
Amar Singh
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Ladhabhai Nakum Amar Singh
పుట్టిన తేదీ(1910-12-04)1910 డిసెంబరు 4
Rajkot, గుజరాత్, British India
మరణించిన తేదీ1940 మే 21(1940-05-21) (వయసు 29)
Jamnagar, Gujarat, British India
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండరు
బంధువులుLadha Ramji (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 1)1932 జూన్ 25 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1936 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 7 92
చేసిన పరుగులు 292 3,344
బ్యాటింగు సగటు 22.46 24.23
100లు/50లు 0/1 5/18
అత్యధిక స్కోరు 51 140*
వేసిన బంతులు 2,182 23,689
వికెట్లు 28 506
బౌలింగు సగటు 30.64 18.35
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 42
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 14
అత్యుత్తమ బౌలింగు 7/86 8/23
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 77/–
మూలం: ESPN Cricinfo, 2020 మే 9

కెరీర్

మార్చు

ఫస్ట్ క్లాస్ కెరీర్

మార్చు
 
1932లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత టెస్టు క్రికెట్ జట్టు. పోర్‌బందర్ మహారాజా కెప్టెన్‌గా ఉన్న జట్టు ఫోటోపై కుడి నుండి ఐదవ స్థానంలో అమర్ సింగ్ నిలబడి ఉన్నాడు.

అమర్ సింగ్ లద్ధా తొమ్మిదేళ్ల పాటు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు; 92 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో అతను 18.35 బౌలింగ్ సగటుతో 508 వికెట్లు తీశాడు. బ్యాట్స్‌మెన్‌గా కూడా ఐదు సెంచరీలు సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో అతను రంజీ ట్రోఫీలో ఆల్‌రౌండర్లకు ప్రమాణమైన 1000 పరుగులు, 100 వికెట్లను పూర్తి చేసిన మొదటి భారతీయుడు.

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

1933–34లో మద్రాస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 44.4 ఓవర్లలో 335 పరుగులు చేయగా, అమర్ సింగ్ లద్ధా 86 పరుగులకు 7 వికెట్లు తీసాడు. రెండవ ఇన్నింగ్సులో 48 పరుగులు చేశాడు. 1936లో లార్డ్స్‌లో అతను తన మొదటి తొమ్మిది ఓవర్లలో 4/10, మొత్తం 25.1 ఓవర్లలో 35 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన తదుపరి టెస్టులో అతను 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి కాపాడాడు. 1937-38లో లార్డ్ టెన్నిసన్ MCC జట్టుతో జరిగిన అనధికారిక ఐదు-టెస్టుల సిరీస్‌లో అతను 16.66 సగటుతో 36 వికెట్లు తీశాడు.

బర్న్‌లీ మద్దతుదారులకు ఆనందం కలిగిస్తూ అమర్ సింగ్, రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు చేశాడు. రిష్టన్‌పై 167 పరుగులు, టర్ఫ్ మూర్‌లో ఈస్ట్ లాంకషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులు చేశాడు. అమర్ సింగ్ బ్యాటింగ్, బౌలింగ్ సంఖ్యలతో పాటు సగటులలో కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం మీద, అతను 360 ఓవర్లలో 12.11 సగటుతో 101 వికెట్లు తీసుకున్నాడు; 23 ఇన్నింగ్స్‌లలో 39.38 సగటుతో 806 పరుగులు చేశాడు.

అమర్ సింగ్ లద్ధా, మహమ్మద్ నిస్సార్‌తో కలిసి భారతదేశపు ఫాస్ట్ బౌలర్ల ద్వయంగా ఉన్నాడు. వాలీ హమ్మండ్ "నేను చూసినంతలో ఇతను ప్రమాదకరమైన ఓపెనింగ్ బౌలరు" అని చెప్పాడు. [2]

క్లబ్ క్రికెట్‌లో అతను లాంకషైర్ లీగ్‌లో కోల్నే తరపున ఆడాడు. క్లబ్‌లో మొదటి విదేశీ ప్రొఫెషనల్‌గా అతను నెల్సన్ జట్టుకు చెందిన లియారీ కాన్‌స్టాంటైన్‌కు ప్రత్యర్థిగా కనిపించాడు. అతని రాకతో క్లబ్ ఆదాయం, సభ్యత్వం రెట్టింపు అయ్యాయి. [3]

ప్రముఖ క్రికెటర్ల ప్రశంసలు

మార్చు

ఇంగ్లీష్ క్రికెట్ లెజెండ్ వాలీ హమ్మండ్ ప్రకారం, అమర్ సింగ్ "నేను చూసినంతలో ఇతను ప్రమాదకరమైన ఓపెనింగ్ బౌలరు. పిచ్ మీద నుండి బంతి వస్తోంటే వినాశాన్ని తెస్తున్నట్లు కనబడింది" అన్నాడు. 1940లో ఒక అనధికారిక ప్రెస్ మీట్‌లో, లియోనార్డ్ హట్టన్ "ఈ రోజు ప్రపంచంలో అమర్ సింగ్ కంటే మెరుగైన బౌలర్ లేడు" అని చెప్పాడు. లెన్ హట్టన్ యార్క్‌షైర్‌తో తన సంవత్సరాలలో సింగ్‌తో ఆడిన అనుభవంతో ఇలా అన్నాడు. అమర్ సింగ్‌కు ఒక అన్నయ్య, లద్ధా రామ్‌జీ ఉన్నాడు. అతను దూకుడుగా ఉండే ఫాస్ట్ బౌలరు. బాంబేలో ఇంగ్లండ్‌తో భారతదేశం తరపున టెస్ట్ ఆడాడు. అతని మేనల్లుడు VL నకుమ్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

సింగ్ 1940 మే 21 ఉదయం జామ్‌నగర్‌లోని తన నివాసంలో న్యూమోనియాతో మరణించాడు. [4]

టెస్ట్ కెరీర్

మార్చు

అమర్ సింగ్ లద్ధా భారత జట్టులోని ఔత్సాహికులలో ఒకరు. అతని బౌలింగ్ భాగస్వామి నిస్సార్‌తో కలిసి, లార్డ్స్‌లో జరుగుతున్న మ్యాచ్ మొదటి రోజున సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇంగ్లీష్ టాప్ ఆర్డర్‌తో విధ్వంసం సృష్టించిన నిస్సార్, ఓపెనర్లు పెర్సీ హోమ్స్, హెర్బర్ట్ సట్‌క్లిఫ్‌లను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను 8 కి 1, ఆ తరువాత 11 కి 2 కూ నిర్బంధించాడు.

ఆ తర్వాత ఫ్రాంక్ వూలీ, స్కోరుకు ఎటువంటి పరుగులు జోడించకుండా రనౌట్ అయ్యాడు. 3 వికెట్లకు 19 పరుగుల వద్ద, ఇంగ్లండ్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కానీ, తర్వాత సింగ్‌ను విపరీతంగా ప్రశంసించిన లెజెండరీ వాలీ హమ్మండ్, అతని కెప్టెన్ డగ్లస్ జార్డిన్‌తో కలిసి ఇన్నింగ్సును కొంత నిలబెట్టాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించాక అమర్ సింగ్‌ తన మొదటి టెస్టు వికెట్ సాధించాడు. తరువాత నిస్సార్, తన పనిని కొనసాగించి, మరో మూడు వికెట్లు తీసి మిడిల్ ఆర్డర్‌ను తుడిచేసాడు. CK నాయుడు (ఇతను భారత కెప్టెన్, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 40 పరుగులకు రెండు వికెట్లు తీసుకున్నాడు), సింగ్ కలిసి చివరి వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 259 పరుగులకు అవుట్ చేసారు. అమర్ సింగ్ 31.1 ఓవర్లు వేసి 75 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

విస్డెన్ నివేదిక

మార్చు

విజ్డెన్ టెస్టు నివేదికలో, "అమర్ సింగ్ కూడా దాదాపు అంతే బాగా బౌలింగు చేసాడు. బంతిని లెగ్ నుండి లేదా ఆఫ్ నుండి గాలిలో తిరుగేలా చేసి, పిచ్ నుండి విపరీతమైన వేగంతో పైకి వచ్చేలా చేసాడు." బ్యాటింగులో పేపర్‌పై చాలా బలంగా కనిపించే ఇంగ్లండ్‌కు ఇది చాలా ఊహించనిది. అయితే, భారత బౌలర్ల మంచి పనిని జట్టు వృధా చేసుకుంది. 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన స్థితి నుండి, 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్, తమ రెండవ ఇన్నింగ్స్‌ను కూడా పేలవంగా ప్రారంభించింది. 30 పరుగుల ఓపెనింగ్ స్టాండ్ తర్వాత అమర్ సింగ్ చేతిలో సట్‌క్లిఫ్‌ను కోల్పోయింది. అప్పటి నుండి, మరో భారత ఫాస్ట్ బౌలర్ జహంగీర్ ఖాన్ 60 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ మిడిల్ ఆర్డరును చీల్చేసాడు. అమర్ సింగ్ 41 ఓవర్లు వేసి 84 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. అయితే, విజ్డెన్ భారత ఫాస్ట్ బౌలర్‌పై ప్రశంసలు కురిపించింది, "ఇంగ్లండ్ రెండోసారి ఆడినప్పుడు, అమర్ సింగ్ మునుపటి కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు". ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 275 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది, జార్డిన్ మరోసారి అద్భుతమైన స్వభావాన్ని ప్రదర్శించాడు, మొదటి ఇన్నింగ్స్‌లో అతని 79 పరుగులకు జోడీగా రెండవ ఇన్నింగ్సులో 85 నాటౌట్ పరుగులు చేశాడు. ఒక ప్రేక్షకుడు, "అదృష్టవశాత్తూ ఇంగ్లండ్ కెప్టెన్ జార్డిన్‌లో ఉక్కు గుండె గల యోధుడున్నాడు" అని ప్రశంసించాడు. [5]

ఫైటింగ్ అర్ధ శతకం

మార్చు

దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 346 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇంగ్లండ్‌ అత్యున్నత బౌలింగ్‌తో ఆలౌటైంది. వాస్తవానికి, విజ్డెన్ తన మ్యాచ్ నివేదికలలో ఇలా పేర్కొంది, "భారత్ చాలా ఘోరంగా ఆడడంతో 108 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. . ." . అయితే, అమర్ సింగ్ ఈసారి తన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ పరాక్రమాన్ని ప్రదర్శించి, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు. 29 పరుగులు చేసిన లాల్ సింగ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 74 పరుగులు జోడించాడు. అంతిమంగా, అమర్ సింగ్ 187 పరుగుల జట్టు స్కోరు వద్ద చివరి వ్యక్తిగా అవుటయ్యాడు. భారత్ 158 పరుగుల తేడాతో ఓడిపోయింది. [6]

అమర్ సింగ్ లద్ధా తన మిగిలిన ఆరు టెస్ట్ మ్యాచ్‌లను ఇంగ్లండ్‌తో ఆడాడు, కోల్‌కతాలో [7] 1934లో 106 పరుగులకు 4, 1936లో లార్డ్స్‌లో 35 కు 6, [8] 1934లో చెన్నై మ్యాచ్‌లో అతని కెరీర్‌లో అత్యుత్తమమైన 86 [9] కి 7 వికెట్ల ప్రదర్శనలతో సహా అనేక మంచి ప్రదర్శనలు చేసాడు. అతను ఆరు సందర్భాలలో ఒక ఇన్నింగ్స్‌లో ముప్పై-ఐదు ఓవర్ల కంటే ఎక్కువ బౌలింగ్ చేసాడు.[10]

క్రికెట్ శైలి

మార్చు

అమర్ సింగ్ ఆరు అడుగుల, రెండు అంగుళాలకు పైగా ఉండే పొడవైన వ్యక్తి. ఈ ఎత్తు ప్రయోజనాన్ని గొప్ప ప్రభావంతో ఉపయోగించాడు. విశాలమైన భుజాలతో ఉండేవాడు. [11] నిజంగా వేగంగా లేకపోయినా, అమర్ సింగ్ తన ఎత్తును ఉపయోగించి పిచ్ నుండి బౌన్స్‌ను, కదలికను తీసేవాడు. అతని యాక్షన్ చాలా క్లీన్‌గా ఉండేది. పన్నెండు గజాల కంటే కొంచెం ఎక్కువ దూరం నుండి పరుగెత్తి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేవాడు. ఇంగ్లీష్ పరిస్థితులు అతనికి బాగా సరిపోవడానికి ఇదే కారణం. అమర్ సింగ్‌కు కొత్త బంతిని రెండు విధాలుగానూ స్వింగ్ చేసే సామర్థ్యం ఉండేది. బంతి మెరుపు కోల్పోయాక, అతని "విధ్వంసక బ్రేక్‌బ్యాక్ తరచుగా బాగా నిలదొక్కుకున్న బ్యాటర్ల రక్షణలోకి చొచ్చుకుపోయి, వారిని దెబ్బతీసేది".

దూకుడు ఫీల్డ్ సెట్టింగ్

మార్చు

అమర్ సింగ్ అత్యధిక వికెట్లు పడటానికి ఒక కారణం అతను దూకుడు ఫీల్డ్ సెట్టింగ్‌తో బౌలింగ్ చేయడం. ముఖ్యంగా, అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టంపులను లక్ష్యంగా చేసుకోవడం. అతని ఫీల్డ్ సెట్టింగ్‌లో సాధారణంగా రెండు లేదా మూడు స్లిప్‌లు, ఒక గల్లీ, కవర్ పాయింట్, ఆఫ్‌సైడ్‌లో థర్డ్ మ్యాన్‌ ఉండేవి. లెగ్ సైడ్‌లో అతనికి సాధారణంగా షార్ట్ ఫైన్ లెగ్, ఫార్వర్డ్ షార్ట్ లెగ్, సిల్లీ మిడ్-ఆన్, లాంగ్ లెగ్ ఉంటాయి. అతను బ్యాట్స్‌మెన్‌లందరికీ ఇదే ఫీల్డ్‌ను వాడేవాడు.

పించ్ హిట్టర్

మార్చు

అమర్ సింగ్ బ్యాటింగు కూడా అతని బౌలింగు లాగానే దూకుడుగా ఉండేది. అతను పించ్ హిట్టరు. ఆశ్చర్యకరంగా, అమర్ సింగ్‌ను బ్యాటింగ్ ఆర్డరులో పైకి పంపారు. మూడు సార్లు మొదటి ఐదు స్థానాల్లో పంపారు; అయినా సరే, నాలుగు సార్లు నలభై పైన సాధించాడు. తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో, అమర్ సింగ్, లాంకషైర్‌పై నెం.10 స్థానంలో ఆడుతూ అజేయంగా 131 పరుగులు చేశాడు. ఈ స్థానం లోనే ఆడుతూ అతను, తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 51 పరుగులు చేశాడు.

అతని బౌలింగ్ ప్రదర్శనల వెలుగులో, అతని బ్యాటింగ్‌తో పాటు అతని ఆటలోని మరో అంశం ఏమిటంటే, ఫీల్డింగ్ క్యాచింగ్ చేయడం. 92 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో సింగ్, 77 క్యాచ్‌లు పట్టాడు. రూసీ మోడీ ప్రకారం, అతను స్లిప్ క్యాచింగ్ పరంగా బాబ్ సింప్సన్ లేదా వాలీ హమ్మండ్‌ల వలె రాణించాడు. అయితే, నిస్సార్, సింగ్ ల బౌలింగులో అమేక క్యాచ్‌లను వదిలేసారనే వాదన ఉన్నందువలన, భారతదేశపు మిగతా ఫీల్డర్లు అంత బాగా ఆడారా అనేది చర్చనీయాంశమైంది. 

మూలాలు

మార్చు
  1. "Amar Singh". ESPNcricinfo. Retrieved 9 May 2020.
  2. Simon Wilde, Number One: The World's Best Batsmen and Bowlers, Victor Gollancz, 1998, ISBN 0-575-06453-6, p135.
  3. Colne Cricket Club Archived 28 సెప్టెంబరు 2007 at the Wayback Machine
  4. "Amar Singh Dead". The Indian Express. 22 May 1940. p. 1. Retrieved 12 July 2017.
  5. Jardine spares England's blushes
  6. Wisden report-ENGLAND v INDIA
  7. 2nd Test, England v India at Kolkata, 5–8 Jan 1934
  8. 1st test, England v India, at Lord's, 27–30 June 1936
  9. England v India, at Chennai, 1934
  10. India's first lethal weapon
  11. Fast bowling legacy: Mohammad Nissar and Amar Singh