అమల్ ప్రవా దాస్

భారతీయ సామాజిక ఉద్యమకారిని , కస్తూరిబాయి ఆశ్రమ్ స్థాపకురాలు

అమల్‌ప్రవా దాస్ ఒక భారతీయ సామాజిక కార్యకర్త, గాంధేయవాది. ఈమెను అమల్ ప్రభా దాస్ అని కూడా పిలుస్తారు. అస్సాం లోని సారానియా కొండలలోని కస్తూర్బా ఆశ్రమం స్థాపకురాలు. సామాజిక అభివృద్ధి కొరకు ఇంకా అనేక సంస్థలనుస్థాపించింది.[1] సమాజానికి ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం అత్యున్నత భారతీయ పౌర పురస్కారమయిన పద్మశ్రీ తో సత్కరించింది[2] ఇంకా జమ్నాలాల్ బజాజ్ పురస్కార గ్రహీత కూడా.[3]

అమల్ ప్రవా దాస్
జననం12 నవంబరు 1911
ఇతర పేర్లుఅమల్ ప్రభా దాస్
వృత్తిసామాజిక కార్యకర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సామాజిక సేవ
తల్లిదండ్రులుహరే కృష్ణ దాస్
హేమ ప్రభా దాస్
పురస్కారాలుపద్మశ్రీ
జమ్నాలాల్ బజాజ్

విద్య

మార్చు

అమల్‌ప్రవా ఈశాన్య భారతదేశం అస్సాం రాష్ట్రం లో దిబ్రుగర్హ లో ధనవంతుల కుటుంబంలో 1911 నవంబరు 12 న జన్మించింది[1][3] ఆమె తల్లి తండ్రులు గాంధేయవాదులుగా పేరొందిన హరే కృష్ణ దాస్, హేమ ప్రభా దాస్ లు.[4] ఆమె పాఠశాల విద్యను స్థానిక విద్యా సంస్థలలో అభ్యసించింది, కానీ స్థానిక కాటన్ కళాశాలలో ఆమెకు ప్రవేశం నిరాకరించబడడముతో కళాశాల అధ్యయనాల కోసం 1929 లో కలకత్తాలోని బెతూన్ కళాశాలకు వెళ్లవలసి వచ్చింది. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైన తరువాత ఆమె స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరి, రసాయన శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (BSc), ఇంకా అనువర్తిత రసాయన శాస్త్రం (అప్లైడ్ కెమిస్ట్రీ)లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించింది. దాస్ విజ్ఞాన శాస్త్రం లో మాస్టర్స్ డిగ్రీ పొందిన మొదటి అస్సామీ మహిళ.[1][4] తరువాత ఆమె వ్యాధివిజ్ఞాన/రోగలక్షణ శాస్త్రం, చికిత్సలో డిప్లొమా కొరకు తన చదువును కొనసాగించింది. కానీ బ్రిటిష్ వారు నడిపే కాటన్ కాలేజీలో అధ్యాపక ఉద్యోగాన్ని తన దేశభక్తి కారణంగా నిరాకరించింది.[1]

సమాజ సేవ

మార్చు

దాస్‌ కు 1934 లో గౌహతి సందర్శించినప్పుడు, ఒక భారత స్వాతంత్య్రోద్యమ నాయకురాలు ఇంట్లో మహాత్మాగాంధీతో సంభాషించే అవకాశం లభించింది. ఈ సమావేశం ఆమెను ప్రభావితం చేసిందని, తనకు భవిష్యత్తు కార్యక్రమాలలో మార్గనిర్దేశం చేసిందని తెలుస్తొంది.[1]

అమల్ ప్రభా తన తల్లి తో 1939 లో గ్రామ సంస్కరణా కార్యక్రమాలను గురించి నేర్చుకోవడానికి వార్ధా లోని మగన్ బరి స్వయం అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించింది. ఆమె కుటుంబం వెంటనే సారానియా కొండలలో తన తండ్రికి చెందిన ఒక స్థలంలో మైత్రి ఆశ్రమాన్ని స్థాపించింది. దీనిని కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు.

1944లో కస్తూర్బా గాంధి మరణించినప్పుడు, మహాత్మాగాంధి కస్తూర్బా గాంధి మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించి, అమల్ దాస్ ను ఈశాన్య ప్రాంతం లో దీనికి సంబంధించిన కార్యక్రమాలు పర్యవేక్షించుటకు నియమించారు.[5]

తరువాత ఇది కస్తూర్బా ఆశ్రమంగా పేరు మార్చబడింది. ఈ ఆశ్రమం మహిళలకు వారి ఆర్థిక అభ్యున్నతి కొరకు స్వయం సహాయక బృందంగా ఏర్పాటైనది. దాస్ ఈ ఆశ్రమం ఆధ్వర్యంలో, గ్రామంలోని మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసి ఇంకా హస్తకళలలోను వారికి శిక్షణనిచ్చారు, తద్వారా వారికి ఆర్థిక స్వతంత్రం కలుగ చేసారు.[3] గాంధీ 1946 లో ఈ ఆశ్రమాన్ని సందర్శించినపుడు, అమల్ ప్రభా నుద్దేసించి "ఈ అమ్మాయి తెలివైనది. పని చేయగలదు" అని అన్నారు. తరువాత ఈ కస్తూర్బా ఆశ్రమం అరుణాచల ప్రదేశ్ లో 21 గ్రామ సేవికా కేంద్రాలను ఏర్పాటు కు తోడ్పడింది.

1950 లో అసోం రాష్ట్రాన్ని పెను భూకంపం విధ్వంసం చేస్తే ఈ కస్తూర్బా ఆశ్రమం, గ్రామ సేవా కేంద్ర సభ్యులు సహాయ కార్యక్రమాలలో తోడ్పడ్డారు. ఆమె ఈ ఆశ్రమం ఆర్ధర్వం లో భూకంపం వలన నిర్వాసితులైన వారి సహాయార్ధం లక్షింపుర్ లో కస్తూర్బా కల్యాణ్ కేంద్రం స్థాపించింది. ఆమె గౌహతి యువక్ సేవాదళ్ అనే ప్రభుత్వేతర సంస్థను అస్పృశ్యత కు వ్యతిరేకంగా, హరిజనుల సామాజిక అభివృద్ధి కొరకు స్థాపించింది. ఈ సేవాదళ్ వినోభా భావే భూదాన ఉద్యమం తో కలిసి పనిచేసింది.[5] ఇంతేకాకుండా, గౌహతి కటాయి మండలం, అస్సాం గో-సేవా సమితి వంటి అనేక సంస్థలను స్థాపించింది.[1] అనాధ బాలల సంరక్షణార్ధం అస్సాం శిశు కల్యాణ సదన్ ఏర్పాటులో కూడా తోడ్పడ్డారు. దానికి ఆరంభంగా సెప్టెంబర్ 5, 1956 న గౌహటి లో ఆమె ఉపాధ్యక్షులుగా ఒక సమావేశాన్ని నిర్వహించింది. మొదల అనాధ స్త్రీ, శిశువుల కొరకు అస్సాం నారీ ఔర్ శిశు కల్యాణ్ సదన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. కావలసిన స్థలం, ధనం సేకరించారు.[6]

స్వాతంత్రోద్యమం

మార్చు

అమల్ ప్రవా స్వాతంత్రోద్యమానికి సంబంధించిన అనేక కార్యక్రమాలలో సం. 1930-1947 ల మధ్య చురుకుగా పాల్గొనింది. ఆమెకు జాతీయ నాయకులతో సంబంధాలు ఉండేవి. 1930-32 బాలికా స్వఛ్చంద కార్యకర్తగా పని చేసింది. తే 19.2.41 న సల్మారా గ్రామంలో, తే.1.3.41న అంటోలా గ్రామాలలో సత్యాగ్రహం చేసినందుకు ఆమెను తే. 3.3.41 న నిర్బంధించి ఒకటిన్నర నెలలు కారాగారం లో ఉంచడమే కాకుండా రు.25 జరిమానా విధించారు, తే.17.4.41న విడుదల చేసారు. 1942-43 మధ్య అస్సాం రాష్ట్రం అంతా చురుకుగా ప్రచారం చేసినందుకు తే 27.1.43 న భద్రతా కారణాల వలన నిర్బంధం లోకి తీసుకొని దాదాపు సంవత్సరం తరువాత అంటే తే.16.2.44 విడుదల చేసారు.

అస్సాం రాష్ట్రం కామరూప్ జిల్లా తరపున హేమ ప్రవా దాస్, సరూప్ లతా చౌధరి తదితర మహిళా ఉద్యమ నాయకురాళ్ళతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొనింది.[7]

పురస్కారాలు

మార్చు

సమాజానికి దాస్ చేసిన కృషికి భారత ప్రభుత్వం 1954వ సంవత్సరంలో నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమయిన పద్మశ్రీ తో సత్కరించి ఆమెను మొదటి స్థానంలో నిలిపింది.[2] 1981 లో "నిర్మాణాత్మక పనిలో అత్యుత్తమ సహకారం" కోసం ఆమె జమ్నాలాల్ బజాజ్ అవార్డును అందుకున్నారు [8][3] భారత ప్రభుత్వం తరువాత ఆమెను పద్మ విభూషణ్ వంటి రెండవ అత్యున్నత పౌర పురస్కారానికి ఆమెను ఎంపిక చేసింది, కానీ ప్రజా గౌరవ పురస్కారాల పట్ల ఉదాసీనత కారణంగా ఆమె ఈ పురస్కారాన్ని తిరస్కరించింది.[1]

ఆమె మరణానంతరం 1986 లో ప్రచురించబడిన "ఎ బయోగ్రఫీ" అనే పుస్తకంలో ఆమె జీవితం, సమయాలు నమోదు చేయబడ్డాయి.[9] అస్సాం రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆమె గౌరవార్థం అమల్ ప్రవా దాస్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఇది 2006వ సం నుండి సామాజిక సేవలో నిబద్ధత, నైపుణ్యం కలిగిన కోసం ఏర్పాటు చేసారు. ఇది మూడు సంవత్సరాలకు ఒకసారి అస్సాం రాస్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ 2008, 2010, 2013 లో ప్రదానం చేసింది.[4][10][11]

అమల్ ప్రవా దాస్ సర్వోదయ పురస్కారం 2013 లో మికిర్ హిల్ల్స్ జిల్లా కౌంసిల్ ఉప సంచాలకులు, గాంధేయవాది, సామాజిక కార్యకర్త అయిన జర్దాన్ పాథక్ కు,[12] 2015లో మైత్రి ఆశ్రమం వినోబా కేంద్రం సంరక్షుకులు అయిన లఖి ఫుకన్ కు,[13] 2017 లో మహాత్మా గాంధి, వినోబా భావే, కస్తూర్బా గాంధి అనుచరుడు, సామాజిక కార్యకర్త సాంఘిక సంక్షేమ విభాగమునకు పర్యవేక్షకుడు అయిన ఛంపా బోరాకు,[14] ప్రదానం చేసారు. ఈ విభాగం అమల్‌ప్రవా దాస్ జీవితాన్ని వివరించే డాక్యుమెంటరీని రూపొందించే పనిలో ఉంది.[15]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "A Gandhian heaven for the downtrodden". Telegraph India. 14 August 2014. Retrieved 27 June 2018.
  2. 2.0 2.1 "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
  3. 3.0 3.1 3.2 3.3 "Jamnalal Bajaj Foundation". Jamnalal Bajaj Foundation. 2015. Retrieved 29 March 2015.
  4. 4.0 4.1 4.2 "Sentinel". Sentinel. 28 January 2013. Archived from the original on 24 September 2015. Retrieved 29 March 2015.
  5. 5.0 5.1 "Why Mahatma Gandhi choose Amal Prabha Das to manage his social work in the Northeast". InUth (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-13. Retrieved 2021-09-05.
  6. "Assam Sishu Kalyan Sadan". www.asksguwahati.org. Archived from the original on 2016-03-04. Retrieved 2021-09-05.
  7. Saikia, Navajit, participation of assamese women in the Quit India movement with special Reference to the women of Darrang District.  Journal of critical reviews, 7/18, 2020, ISSN 2394-5125
  8. "India Water Portal" (PDF). India Water Portal. 2015. Archived from the original (PDF) on 24 సెప్టెంబరు 2015. Retrieved 29 March 2015.
  9. Komol Singha, Gautam Patikar (2010). Rural Development in North East India. Concept Publishing Company. pp. 294 of 316. ISBN 9788180696688.
  10. "Karar Nivang". Karar Nivang. 2013. Archived from the original on 2 April 2015. Retrieved 29 March 2015.
  11. "Awards | Department of Cultural Affairs | Government Of Assam, India". culturalaffairs.assam.gov.in. Retrieved 2021-09-05.
  12. Desk, Sentinel Digital (2015-01-29). "Amal Prava Das Award conferred to Jardan Pathak - Sentinelassam". www.sentinelassam.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-05.
  13. Correspondent (2010-09-15). "Amal Prabha Das Sarvodaya Award presented". assamtribune.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-05.
  14. Reporter, Staff (2010-09-15). "Amal Prova Das Award to Gandhian Champa Bora". assamtribune.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-05.
  15. "Assam Tribune". Assam Tribune. 11 March 2015. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 29 March 2015.