అమీన్‌పూర్ (సంగారెడ్డి జిల్లా)

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం లోని పట్టణం
(అమీనాపూర్ (పటాన్ చెరువు) నుండి దారిమార్పు చెందింది)

అమీన్‌పూర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న అమీన్‌పూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] అమీన్‌పూర్ పట్టణ శివారు బీరంగూడలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఉంది.

అమీనాపూర్
—  రెవిన్యూ గ్రామం  —
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం
అమీనాపూర్ is located in తెలంగాణ
అమీనాపూర్
అమీనాపూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°31′57″N 78°19′52″E / 17.532391°N 78.331010°E / 17.532391; 78.331010
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం అమీన్‌పూర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 36,452
 - పురుషుల సంఖ్య 18,737
 - స్త్రీల సంఖ్య 17,715
 - గృహాల సంఖ్య 9,120
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అమీన్‌పూర్ మండలంలోకి చేర్చారు.[3]

భౌగోళికం

మార్చు

అమీన్‌పూర్ 17°53′23″N 78°33′10″E / 17.88972°N 78.55278°E / 17.88972; 78.55278 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.

సమీప గ్రామాలు

మార్చు

వడక్‌ పల్లి, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డిపేట్, ఐలాపూర్, పటేల్‌గూడ మొదలైన గ్రామాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.

గ్రామ జనాభా

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 36,452 - పురుషుల సంఖ్య 18,737 - స్త్రీల సంఖ్య 17,715 - గృహాల సంఖ్య 9,120

రవాణా

మార్చు

ఇక్కడికి సమీపంలోని చందానగర్, లింగంపల్లి ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం
  • వెంకటేశ్వర దేవాలయం
  • షిరిడీ సాయిబాబా దేవాలయం
  • సీతారామాంజనేయ దేవాలయం
  • శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం
  • మస్జిద్-ఇ-ఆయేషా
  • అమీనా మసీదు

విద్యాసంస్థలు

మార్చు
  • అమీన్‌పూర్ ప్రభుత్వ పాఠశాల
  • ఎంఎన్ ఆర్ కళాశాల
  • బెలూహ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
  • విజన్ వోక్ జూనియర్ కళాశాల
  • ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్
  • శివలి స్కూల్
  • లైఫ్ లైన్ ఇ-టెక్నో స్కూల్
  • త్రివేణి టాలెంట్ స్కూల్

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 17 April 2021.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-16. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  4. "Ameenpur, Miyapur, Hyderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-11-09.

వెలుపలి లంకెలు

మార్చు