సత్య కృష్ణన్ ఒక ప్రముఖ సినీనటి. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న ఆమెను శేఖర్ కమ్ముల తన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. సత్య కృష్ణన్ ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. ఆనంద్ సినిమాలో కథానాయికకు స్నేహితురాలిగా ఆమె పోషించిన అనిత పాత్ర బాగా ప్రాచుర్యం పొందింది.

సత్య కృష్ణన్
జననం
ఇతర పేర్లుసత్య కృష్ణ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం

కెరీర్

మార్చు

సత్య కృష్ణన్ హైదరాబాదులో తన చదువు పూర్తిచేసింది.[1] హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె హైదరాబాదులోని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో ఉద్యోగంలో చేరింది. ఎయిర్ హోస్టెస్ కావాలనేది ఆమె కల.[2] 2000 లో శేఖర్ కమ్ముల తన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. తరువాత ఆమె వివాహం చేసుకుని పంజాగుట్ట లోని ఓ బ్యాంకు ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్ళ తరువాత మళ్ళీ శేేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకి ఆమెకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు దక్కింది. దాంతో ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తి స్థాయి నటిగా మారింది.[3]

తరువాత బొమ్మరిల్లు, మొదటి సినిమా, వినాయకుడు లాంటి ఆదరణ పొందిన చిత్రాల్లో నటించింది. మొదటి సారిగా మెంటల్ కృష్ణ అనే సినిమాలో కథానాయికగా నటించింది. కానీ ఆ సినిమా విమర్శలపాలైంది.

నటించినవి

మార్చు

వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
  1. "Satya Krishnan chitchat – Telugu film actress". Idlebrain.com. 14 October 2005. Retrieved 16 November 2013.
  2. "Satya Krishnan | Actress Satya Krishnan | Mental Krishna | Dollar Dreams | Anand | Interview – Interviews". CineGoer.com. 27 February 2011. Retrieved 16 November 2013.
  3. "Metro Plus Visakhapatnam / Profiles : On a role". The Hindu. 27 September 2008. Retrieved 16 November 2013.
  4. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  5. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  6. సాక్షి, సినిమా (28 February 2020). "'హిట్‌' మూవీ రివ్యూ". Sakshi. సంతోష్‌ యాంసాని. Archived from the original on 28 February 2020. Retrieved 29 October 2020.