అరుణ్ సాగర్ (రచయిత)

(అరుణ్ సాగర్ నుండి దారిమార్పు చెందింది)

అరుణ్ సాగర్ (జనవరి 2, 1967 - ఫిబ్రవరి 12, 2016) ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు.[1] ఈయన చివరగా టీవీ5 సీఈవోగా పనిచేశాడు.[2] గతంలో పత్రికా రంగంలో పనిచేసిన సాగర్, అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాకు మారాడు. పలు ఛానళ్లలో ఉన్నత పదవులను చేపట్టాడు. మేలు కొలుపు, మ్యూజిక్ డైస్, మ్యాగ్జిమమ్ రిస్క్ కవితా సంకలనాలు ఈయనకు మంచిపేరును తెచ్చాయి. తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశాడు.[3]

అరుణ్ సాగర్
అరుణ్ సాగర్
జననం
అరుణ్ సాగర్

జనవరి 2, 1967
మరణంఫిబ్రవరి 12, 2016
ఉద్యోగంటీవీ5 సీఈవో
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత, పాత్రికేయులు
తల్లిదండ్రులుభారతీదేవి, టి.వి.ఆర్.చంద్రం

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు ఖమ్మం జిల్లా, భద్రాచలంలో భారతీదేవి, టి.వి.ఆర్.చంద్రం దంపతులకు 1967, జనవరి 2వ తేదీన జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం భద్రాచలం,ఖమ్మం, విజయవాడ, విశాఖపట్టణం లలో జరిగింది. మానవపరిణామశాస్త్రము (ఆంత్రోపాలజీ)లో స్నాతకోత్తర పట్టా పొందాడు. ఆంధ్రజ్యోతి, సుప్రభాతం మొదలైన పత్రికలలో టి.వి9, టి.వి.10, టి.వి.5 మొదలైన టి.వి.ఛానళ్లలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు.

ఇతడు ఫిబ్రవరి 12, 2016న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

రచనలు

మార్చు
  1. మియర్ మేల్
  2. మాగ్జిమమ్‌ రిస్క్
  3. మ్యూజిక్ డైస్ - మూలవాసుల అంతరంగిక వేదనకి అక్షర రూపం ఇది. అభివృద్ధి జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగి పోతున్న మూలవాసుల అంతరంగిక వేదనకి అక్షర రూపం ఇది.[4]
  4. మేల్‌ కొలుపు - ఆంధ్రజ్యోతిలో ఇరవై ఐదు వారాలపాటూ సాగిన ఈ వ్యాసపరంపరని ఒక సంకలనంగా 2003 లో ప్రచురించాడు.[5]

పురస్కారాలు

మార్చు
  1. ఇతని మియర్ మేల్ కవితా సంపుటానికి 2012 సంవత్సరానికిగాను రొట్టమాకురేవు కవితా పురస్కారం లభించింది.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు