రొట్టమాకురేవు కవితా పురస్కారం

యువ కవులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ఉద్దేశంతో కవి యాకూబ్ రొట్టమాకురేవు కవితా పురస్కారం ఏర్పాటుచేయబడింది.

తన తండ్రిగారైన కీ.శే. షేక్ మహమ్మద్ మియా, గురువుగారైన కీ.శే. కె.యల్.నరసింహారావు, మామగారైన కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి గార్ల స్మారక కవితా పురస్కారాన్ని ఏర్పాటుచేశారు. తన పుట్టిన ఊరైన ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం రొట్టమాకు రేవు గ్రామంలో ఈ పురస్కారాన్ని ప్రతిఏటా అక్టోబరు 10వ తారీకున అందజేస్తారు.

  • షేక్ మహమ్మద్ మియా (జననం: రికార్డు కాలేదు, మరణం: 09.10.2010) :- వరంగల్ జిల్లా, చిన్నగూడూర్ గ్రామంలో జన్మించారు. జీవికకోసం ఊరూరూ తిరుగుతూ, చివరికి రొట్టమాకు రేవు గ్రామంలో స్థిరపడ్డారు. ఈయనకు ఐదుగురు కుమారులు, ఒక కూతురు. యాకూబ్ రెండవవారు.
  • కె.యల్. నరసింహారావు (జననం: 10.06.1926, మరణం: 16.03.2011) :- ఇల్లందు తాలూకా బేతంపూడిలో పుట్టారు. స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటాల్లో పాల్గొన్నారు. జైలుకెళ్లారు. మొదటిసారిగా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ తరపున 1952లో ఇల్లెందు శాసనసభ నియోజకవర్గం నుండి అతి చిన్నవయనులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మరో రెండుసార్లు కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చివరివరకూ మార్క్సిస్టు పార్టీలో ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
  • పురిటిపాటి రామిరెడ్డి (జననం: 19.02.1929, మరణం: 23.03.2008) :- ఈయన శిలాలోలిత తండ్రిగారు. కృష్ణా జిల్లా, డోకిపర్రు గ్రామంలో జన్మించారు. ప్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. హందీలో ఎంఏ వరకు చదువుకొని చివరి వరకూ హిందీ ఉపాధ్యాయునిగా శంషాబాద్, హైదరాబాద్ లలో పనిచేశారు. కొన్నాళ్లపాటు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారికి హిందీ బోధకుడిగా పనిచేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
దస్త్రం:మొదటి పురస్కారం.jpg
మొదటి పురస్కారం చిత్రం

మొదటి పురస్కారంసవరించు

మొదటి పురస్కార మహోత్సవంలో భాగంగా 2011, 2012, 2013, 2014 సంవత్సరాలకు కలిపి ఒకేసారి నిర్వహించారు. ఈ పురస్కార ప్రదానం ఖమ్మం జిల్లా లోని కారేపల్లి సమీపంలోని రొట్టమాకు రేవు గ్రామంలో బుగ్గవాగు ఒడ్డున 2014, అక్టోబరు 10న జరిగింది. ఈ పురస్కార కార్యక్రమంలో

  • 2011 సం. సౌభాగ్య కవిత (కవితా సంపుటి) కి గాను సౌభాగ్యకు
  • 2012 సం. మియర్ మేల్ (కవితా సంపుటి) కి గాను అరుణ్ సాగర్ కు
  • 2013 సం. దర్దీ (కవితా సంపుటి) కి గాను షాజహానా కు
  • 2014 సం. నీలాగే ఒకడుండేవాడు (కవితా సంపుటి) కి గాను నందకిషోర్ కు అందజేశారు.

ప్రెస్ అకాడెమి చైర్మెన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రొ.ఘంటా చక్రపాణి, ఖాదర్ మొహియుద్దీన్, ఎన్.వేణుగోపాల్, సురేంద్ర రాజు, దీవి సుబ్బారావు, దర్శకులు 'ఓనమాలు' క్రాంతి మాధవ్, వాగ్గేయకారులు గోరటి వెంకన్న, జయరాజ్ చిత్రకారులు లక్ష్మణ్ ఏలె, మోహన్, శంకర్ ఇంకా కవులు, రచయితలూ పాల్గొన్నారు.[1]

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు -2015సవరించు

2015, అక్టోబరు 10న ఖమ్మం జిల్లా లోని కారేపల్లి సమీపంలోని రొట్టమాకు రేవు గ్రామంలోని బుగ్గవాగు ఒడ్డున జరిగిన ఈ కార్యక్రమంలో షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక అవార్డును నందిని సిధారెడ్డి (ఇక్కడి చెట్ల గాలి)కి, కె.ఎల్‌. నర్సింహారావు స్మారక అవార్డును మోహన్‌ రుషి (జీరో డిగ్రీ)కి, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డును హిమజ (సంచీలో దీపం)కి అందించారు.[2][3]

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు -2016సవరించు

2017, జనవరి 29న రొట్టమాకురేవులో జరిగిన ఈ కార్యక్రమంలో షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక అవార్డును ప్రసాదమూర్తి (పూలండోయ్ పూలు)కు, కె.ఎల్‌. నర్సింహారావు స్మారక అవార్డును శ్రీరామోజు హరగోపాల్ (రెండు దోసిళ్ళకాలం)కు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డును సుజాతా పట్వారి (పిట్టకు ఆహ్వానం) లకు ఆవార్డులు అందజేశారు.[4][5]

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు -2017సవరించు

2017, అక్టోబర్ 8న హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక అవార్డును కవి సిద్ధార్థ (బొమ్మల బాయి)కు, కె.ఎల్‌.నర్సింహారావు స్మారక అవార్డును అబ్దుల్ వాహెద్ (ధూళిచెట్టు)కు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డును అనిశెట్టి రజిత (నిర్భయాకాశం కింద)కు అర్డులు అందజేశారు.[6]

ఇతర లంకెలుసవరించు

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్. "కవితా పురస్కారాల ప్రదానం - కవి యాకూబ్‌". Retrieved 27 July 2016.[permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి (4 October 2015). "రొట్టమాకురేవు కవిత్వ అవార్డు ప్రదానం". Retrieved 10 October 2017.[permanent dead link]
  3. నమస్తే తెలంగాణ (11 October 2015). "తెలంగాణ సాధనలో కళాకారులే ప్రేరక శక్తులు". Retrieved 10 October 2017.[permanent dead link]
  4. ఆంధ్రజ్యోతి (22 January 2017). "రొట్టమాకురేవు కవిత్వ అవార్డు". Retrieved 10 October 2017.[permanent dead link]
  5. నవతెలంగాణ, దర్వాజ, స్టోరి (22 January 2017). "సరికొత్త సాహిత్య కేంద్రం రొట్టెమాకురేవు". Retrieved 10 October 2017.[permanent dead link]
  6. నవతెలంగాణ (17 September 2017). "రొట్టమాకురేవు అవార్డు గ్రహీతలు". Retrieved 10 October 2017.[permanent dead link]