అరుణ్ సాగర్ (రచయిత)
అరుణ్ సాగర్ (జనవరి 2, 1967 - ఫిబ్రవరి 12, 2016) ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు.[1] ఈయన చివరగా టీవీ5 సీఈవోగా పనిచేశాడు.[2] గతంలో పత్రికా రంగంలో పనిచేసిన సాగర్, అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాకు మారాడు. పలు ఛానళ్లలో ఉన్నత పదవులను చేపట్టాడు. మేలు కొలుపు, మ్యూజిక్ డైస్, మ్యాగ్జిమమ్ రిస్క్ కవితా సంకలనాలు ఈయనకు మంచిపేరును తెచ్చాయి. తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశాడు.[3]
అరుణ్ సాగర్ | |
---|---|
![]() అరుణ్ సాగర్ | |
జననం | అరుణ్ సాగర్ జనవరి 2, 1967 |
మరణం | ఫిబ్రవరి 12, 2016 |
ఉద్యోగం | టీవీ5 సీఈవో |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, రచయిత, పాత్రికేయులు |
తల్లిదండ్రులు | భారతీదేవి, టి.వి.ఆర్.చంద్రం |
జీవిత విశేషాలుసవరించు
ఇతడు ఖమ్మం జిల్లా, భద్రాచలంలో భారతీదేవి, టి.వి.ఆర్.చంద్రం దంపతులకు 1967, జనవరి 2వ తేదీన జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం భద్రాచలం,ఖమ్మం, విజయవాడ, విశాఖపట్టణం లలో జరిగింది. మానవపరిణామశాస్త్రము (ఆంత్రోపాలజీ)లో స్నాతకోత్తర పట్టా పొందాడు. ఆంధ్రజ్యోతి, సుప్రభాతం మొదలైన పత్రికలలో టి.వి9, టి.వి.10, టి.వి.5 మొదలైన టి.వి.ఛానళ్లలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు.
మరణంసవరించు
ఇతడు ఫిబ్రవరి 12, 2016న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
రచనలుసవరించు
పురస్కారాలుసవరించు
- ఇతని మియర్ మేల్ కవితా సంపుటానికి 2012 సంవత్సరానికిగాను రొట్టమాకురేవు కవితా పురస్కారం లభించింది.
మూలాలుసవరించు
- ↑ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ కన్నుమూత Sakshi February 12, 2016
- ↑ ప్రముఖ జర్నలిస్టు అరుణ్ సాగర్ కన్నుమూత TNN| Feb 12, 2016
- ↑ అరుణ్ సాగర్ కన్నుమూత: ఆయన మేల్ కొలుపు తనకెంతో ఇష్టమన్న బాలకృష్ణ Friday, February 12, 2016
- ↑ మూలవాసుల అంతరంగిక వేదన - నవతెలంగాణ - వంశీకృష్ణ
- ↑ మేల్ కొలుపు పుస్తక పరిచయం - కత్తి మహేశ్ కుమార్