అరుణ మిల్లర్

భారతదేశంలో జన్మించిన అమెరికా రాజకీయ నాయకురాలు.

అరుణా కాట్రగడ్డ మిల్లర్ (జ. నవంబరు 6, 1964) భారతదేశంలో జన్మించిన అమెరికా రాజకీయ నాయకురాలు. మేరీలాండ్ రాష్ట్రపు ప్రతినిధుల సభలో సభ్యురాలు. ఈమె మాంట్‌గొమెరీ కౌంటీలోని 15వ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.[1] మేరీలాండ్ శాసననియోజకవర్గం 15, విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ మాంట్‌గొమెరీ కౌంటీలోకెల్లా అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో బాయిడ్స్, క్లార్క్స్‌బర్గ్, డార్న్‌స్‌టౌన్, పూల్స్‌విల్, పటోమెక్, డికర్సన్, బార్న్‌స్‌విల్, బీల్స్‌విల్ లతో పాటు, గెయిథర్స్‌బర్గ్, ఉత్తర పటోమెక్, రాక్‌విల్ లోని కొన్నిప్రాంతాలు కూడా ఉన్నాయి. అప్రాప్రియేషన్స్ కమిటీ సభ్యురాలైన మిల్లర్, మేరీలాండ్ విధాన సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళ.

అరుణ మిల్లర్
Aruna Miller.jpg
Member of the మేరీలాండ్ House of Delegates
from the 15 district
Assumed office
జనవరి 12, 2011
Preceded byక్రెగ్ ఎల్. రైస్
Personal details
Born (1964-11-06) 1964 నవంబరు 6 (వయస్సు: 55  సంవత్సరాలు)
Political partyDemocratic
Spouse(s)డేవిడ్ మిల్లర్
Childrenమీనా, క్లోయీ, , శాషా
Occupationసివిల్ ఇంజనీరు (రవాణా)
Websitewww.ArunaMiller.com

అరుణ మిల్లర్, వర్జీనియా, హవాయి, కాలిఫోర్నియాలతో పాటు మాంట్‌గొమెరీ కౌంటీలో పాతికేళ్లపాటు ఇంజనీరుగా పనిచేసింది. ఇంజనీరుగా మిల్లర్, పాఠశాలకు, ఉపాధికేంద్రాలకు, సామూహిక సదుపాయాలను అందరికీ అందుబాటులో ఉండేలా, పాదచారులకు, సైకిలు నడిపేవారికి, బస్సుల్లో ప్రయాణించేవారికి, వికలాంగులకు అనువుగా ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందించింది. 2015లో మాంట్‌గొమెరీ కౌంటీ ప్రభుత్వ ఉద్యోగంనుండి విరమణ పొంది పూర్తిస్థాయిలో మేరీలాండ్ శాసనమండలి కార్యకలాపాల్లో నిమగ్నమైంది.

కుటుంబనేపథ్యంసవరించు

వెంట్రప్రగడ గ్రామంలో జన్మించిన కాట్రగడ్డ వెంకటరామారావు, భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, ఉన్నత చదువులకోసం 1960లో అమెరికా వెళ్ళినారు. చదువుల అనంతరం వీరు విజయవాడకు చెందిన వెనిగళ్ళ హేమలతను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడినారు. ఈ దంపతుల కుమార్తె అరుణ కాట్రగడ్డ.[2] అరుణకు 8 ఏళ్ల వయసులో కుటుంబం అమెరికా తరలివచ్చి స్థిరపడింది. అమెరికా వ్యక్తినే వివాహం చేసుకున్నాగానీ, మన తెలుగు సంప్రదాయాలనూ, భారతదేశాన్నీ మరచిపోలేదు. ఈమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా, అమెరికా దేశ రాజకీయాలలో చురుకుగా పాల్గొనుచుంటున్నది. 2010 ఎన్నికలలో ఈమె, మేరీలాండ్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున, డెలిగేట్ గా పోటీ చేసి, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులపై విజయం సాధించింది. మొదటిసారి గెలిచిన తరువాత ఈమె, తన రాష్ట్ర గవర్నరును హైదరాబాదుకు తీసికొని వచ్చి, భారతదేశంతో, పలు వ్యాపార విభాగాలలో, అరవై మిలియను డాలర్ల వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలను కుదిర్చారు. ఈమె 2014లో రెండవసారి గూడా డెలిగేట్ గా ఎన్నికై, అమెరికా లోని ఒక చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు తేగలిగినారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి మహిళ హిల్లరీ క్లింటన్ ప్రచార బృందంలో, మౌంట్ గోరీ కౌంటీలోని 15వ డిస్ట్రిక్ట్ డెలిగేట్ అయిన మన తెలుగు మహిళ అరుణ, ఆరు గజాల చీర కట్టుకుని, ఎర్రని బొట్టు పెట్టుకుని, అందరినీ ఆకట్టుకొనుచున్నది. ఈమె ప్రస్తుతం, మేరీల్యాండ్ రాష్ట్ర ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహించుచున్నది.

మూలాలుసవరించు

  1. "House of Delegates". Maryland Manual. మూలం నుండి 28 January 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 26 January 2011. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  2. [6] ఈనాడు మెయిన్, వసుంధర పేజీ; 2016,ఆగస్టు-20.

ఇతర లింకులుసవరించు