అర్నాద్ ప్రసిద్ధి చెందిన దుంప హరనాథరెడ్డి ప్రముఖ తెలుగు నవలా రచయిత. కాళీపట్నం రామారావును గురువుగా భావించే అర్నాద్ 50 కి పైగా రచనలు చేసాడు. అర్నాద్ జూలై 1, 1946న విశాఖపట్నం జిల్లా కంచర్లపాలెంలో జన్మించాడు.[1] మెకానిక్ ఇంజనీరింగులో డిప్లొమా పొంది విశాఖపట్నంలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ హెవీ ప్లేట్ అండ్ వెస్సల్స్ లిమిటెడ్‌లో మెటీరియల్ మానేజ్‌మెంట్ విభాగంలో సీనియర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అర్నాద్ ఆంధ్ర ప్రభ, స్వాతి మాసపత్రికలలో వెలువడిన నవలలు, కథానికలకు అనేక బహుమతులు అందుకున్నాడు. చీకటోళ్ళు (1978), ఈతరం స్త్రీ (1985), సాంఘికం (1990) అనే మూడు నవలలను ప్రచురించాడు. 1981లో అర్నాద్ కథలు పేరిట ఒక లఘు కథా సంపుటాన్ని ప్రచురించాడు. ఈయన వ్రాసిన చీకటోళ్ళు నవలపై ఆధారితంగా నిర్మించబడిన చిత్రం రష్యా చిత్రోత్సవానికి ఎంపికయ్యింది.[2] ఈయన సతీమణి రమణిమణి. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

అర్నాద్ రచనలుసవరించు

1. చీకటోళ్లు 2. ఈతరం స్త్రీ[3] 3. సాంఘికం

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అర్నాద్&oldid=2983255" నుండి వెలికితీశారు