అలియా బాలుర ఉన్నత పాఠశాల

అలియా బాలుర ఉన్నత పాఠశాల (మదర్సా-ఐ-అలియా) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గన్‌ఫౌండ్రిలో ఉన్న పాఠశాల.[1] 1872లో నిర్మించబడిన ఈ స్కూలు అప్పట్లో బాగా పేరు సంపాదించింది.[2]

అలియా బాలుర ఉన్నత పాఠశాల
స్థానం

భారతదేశం
సమాచారం
Funding typeరాష్ట్ర ప్రభుత్వం
స్థాపన1872
స్థాపకులునిజాం

చరిత్ర

మార్చు

నిజాం కాలంలో హైదరాబాదు యొక్క అభివృద్ధిలో భాగంగా 1872లో ఈ పాఠశాల ప్రారంభించబడింది. ఈ పాఠశాల 1960వరకు హైదరాబాద్లోని అత్యుత్తమ పాఠశాలలలో ఒకటిగా నిలిచింది. ఆంగ్లో-ఇండియన్లచే నిర్వహించబడిన ఈ పాఠశాల ఆపరేషన్ పోలో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది.

ఈ పాఠశాల భవనం వారసత్వ భవనాల జాబితాలో చేర్చబడింది. 1948లో ఈ పాఠశాల పేరు మార్చబడింది. తరువాత మదర్సా-ఐ-అలియా పేరుతో సాలార్ జంగ్ I చే నిజాం కళాశాల ప్రాంగణంలో స్థాపించబడింది. ఒకప్పుడు ఉన్నత వర్గానికి సేవచేసిన పాఠశాల ఇప్పుడు పేద ప్రజలకు తన సేవలను అందిస్తుంది.[3][4]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Aliya, Mahbubia to stay as govt institutes". Times of India. 2003-07-09. Archived from the original on 2012-07-16. Retrieved 7 May 2019.
  2. సాక్షి, తెలంగాణ (20 January 2016). "1813లోనే మొదటి స్కూల్". Archived from the original on 7 May 2019. Retrieved 7 May 2019.
  3. Baseerat, Bushra (8 January 2012). "'School for the elite' lies in a shambles". Times of India. Archived from the original on 16 July 2012. Retrieved 7 May 2019.
  4. Akula, Yuvraj (27 December 2016). "Once an elite school, now in shambles". Telangana Today. Retrieved 7 May 2019.