అల్లం పచ్చడి ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలలో ఒక పేరుపొందిన పచ్చడి. దీన్ని ప్రధానంగా ఇడ్లీ, దోశ లాంటి అల్పాహారాలతో కలిపి భుజిస్తారు.

అల్లం పచ్చడి
అల్లం పచ్చడి
మూలము
మూలస్థానందక్షిణ భారత దేశం
వంటకం వివరాలు
వడ్డించే విధానంబ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్
ప్రధానపదార్థాలు అల్లం, శెనగపప్పు, మినపపప్పు మొ.

కావలసిన పదార్థాలు

మార్చు
 
అల్లం చట్నీ
  • అల్లం - 1/4 కిలో
  • శెనగపప్పు (సెనగబెడలు) - 1/2 స్పూన్
  • మినపప్పు - 1/2 స్పూన్
  • ఆవాలు - 1 స్పూను
  • కరివేప ఆకు - 3 రెబ్బలు
  • ఎండుమిర్చి - 8
  • కారం - 4 స్పూన్లు
  • బెల్లం - 100 గ్రాముల
  • చింతపండు - 100 గ్రాముల
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - 5 టేబుల్ స్పూను

తయారుచేసే విధానం

మార్చు
  1. 2 స్పూన్లు నూనెలో అల్లం దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో 1 టీ స్పూను నూనెలో ఎండుమిర్చి వేగించి పక్కనుంచాలి.
  2. వెయించిన అల్లం ఎండుమిర్చి రుబ్బు కొవాలి. మిగిలిన 2 టీ స్పూను నూనెలో శనగపప్పు (సెనగబెడలు), మినపప్పు, ఆవాలు, కరివేప ఆకులు వేసి దోరగ వేగించి పక్కనుంచాలి.
  3. మిగిలిన నూనెలో అల్లం ఎండుమిర్చి మిశ్రమం, కారం, చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు వేసి వేయించాలి (నీరు పూర్తిగా అవిరి అయ్యేవరకు).
  4. పచ్చడి చల్లరాక గాజు సీసలో ఉంచుకోవాలి. దాదాపు ఒక నెల నిలువ వుంటుంది.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు