అల్లరి వయసు 1979లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ ఫిల్మ్స్ పతాకంపై వెంకట సుబ్బారావు, పి.పి.అబ్దుల్లాలు నిర్మించిన ఈ సినిమాకు జగపతి రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, జయచిత్ర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

అల్లరి వయసు
(1979 తెలుగు సినిమా)
తారాగణం మాగంటి మురళీమోహన్
నిర్మాణ సంస్థ కల్యాణచిత్ర ఫిల్మ్స్
భాష తెలుగు

చెల్లెలి కాపురం సినిమాలోని "చరణ కింకిరులు ఘల్లుఘల్లుమన" పాటను ఎం.బాలయ్య అనుమతితో ఈ చిత్రంలో ఉపయోగించారు.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • నిర్మాతలు: కోపూరు వెంకట సుబ్బారావు, పిపి అబ్దుల్లా
  • కథ, దర్శకుడు: జగపతి రాజశెఖర్
  • బ్యానర్: లక్ష్మీ పిలింస్
  • సమర్పణ: కళ్యాణచిత్ర
  • మాటలు: అప్పలాచార్య
  • చిత్రానువాదం: కళ్యాణ చిత్ర యూనిట్
  • పాటలు: ఆత్రేయ, వేటూరి, కొసరాజు, గోపి
  • నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి.వసంత, జి.ఆనంద్, శోభాశేఖర్
  • స్టిల్స్: జయకుమార్, కె.ఎస్.మణి
  • స్టంట్: అంబూరు బాబు
  • కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
  • కూర్పు: గౌతంరాజు
  • కెమేరా: బాబూరావు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • విడుదల: 1979 డిసెంబరు 11

పాటల జాబితా

మార్చు

1.అల్లుడమ్మ అల్లుడు హనుమంతుని తమ్మడు, గానం.పులపాకా సుశీల

2.ఆడవే మయూరి నటన మాడవే , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం

3.ఎదలో జీవన రాగాల వీణ ఎదుటే ఆమని, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.నమ్మకు ఆడదాని నమ్మకు నమ్మినా ప్రేమించకు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.పాపం ఈ చిన్నవాడికొకలోకం పగలైనా రేయైనా, గానం.గేదెల ఆనంద్, శోభాశంకర్

6.వయసా ఇది మాటే విననే మనసు భల్ తెంపరి బల్ తెంపరి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వసంత

మూలాలు

మార్చు

1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు