శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా "అల్లుడు శీను". ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యాడు. సమంత కథానాయిక. ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్, కన్నెగంటి బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించారు. తమన్నా మొదటి సారి ఈ సినిమాలో ఒక ఐటెం పాటలో నర్తించింది.[1] కోన వెంకట్, గోపీ మోహన్, కె.ఎస్. రవీంద్రనాథ్ ఈ సినిమాకు కథ, చిత్రానువాదం, సంభాషణలను అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఛోటా కె. నాయుడు ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా, గౌతంరాజు ఎడిటరుగా పనిచేసారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఈ సినిమా కళావిభాగంలో పనిచేసాడు. నల్గొండలోని సిరిపురం అనే ఓ పల్లెటూళ్లో కథ మొదలవుతుంది. గ్రామంలో అల్లుడు శీను, అతని మామ నరసింహ అప్పుల పాలై ఊరి నుండి దుబాయ్ వెళ్లాలనుకుని చెన్నై ట్రైన్ బదులు హైదరాబాదు ట్రైన్ ఎక్కేస్తారు. దాంతో వారు హైదరాబాదు చేరుకుంటారు. నరసింహ పోలికలున్న భాయ్ హైదరాబాదులో దందాలు, సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. దాంతో శీను బాయ్ పిఎ డింపుల్ ను తెలివిగా వాడుకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ టైమ్ లోనే భాయ్ కూతురు అంజలిను ప్రేమిస్తాడు శీను. ఇలాంటి సమయంలో భాయ్ కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడు భాయ్ ఏం చేస్తాడు? అసలు భాయ్ కి, నరసింహకి ఉన్న సంబంధం ఏమిటి? అల్లుడు శీను తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2014 జూలై 25న విడుదలైంది.[2]

అల్లుడు శీను
దర్శకత్వంవి. వి. వినాయక్
రచనకోన వెంకట్,
గోపీమోహన్,
కె.ఎస్. రవీంద్రనాథ్
నిర్మాతబెల్లంకొండ సురేష్
తారాగణంబెల్లంకొండ శ్రీనివాస్,
సమంత,
ప్రకాశ్ రాజ్,
ప్రదీప్ రావత్,
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుగౌతంరాజు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
జులై 25, 2014
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు

ఓరీ దేవుడో , రచన: చంద్రబోస్, గానం. జావీద్ అలీ, సుచిత్ర

నీలి నీలి, రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.కార్తీక్, హరిణి

వాట్స్అప్ అంటూ , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.దేవీశ్రీ ప్రసాద్ , షర్మిల

లబ్బర్ బొమ్మ , రచన: చంద్రబోస్ , గానం.సూరజ్ సంతోష్ , రనినారెడ్డి

ఓహో బుజ్జికొండ , రచన: చంద్రబోస్ , గానం.జస్ప్రీత్ జాస్,షర్మిల

అల్లుడు శీను , రచన: చంద్రబోస్, గానం.సింహా, ప్రియాహిమేష్

మూలాలు

మార్చు
  1. "సమంత సినిమాలో తమన్నా ఐటెం సాంగ్!". వెబ్ దునియా. March 31, 2014. Retrieved July 25, 2014.
  2. "జూలై 25న బెల్లంకొండ శ్రీనివాస్‌-వి.వి.వినాయక్‌ల 'అల్లుడు శీను'". వెబ్ దునియా. July 5, 2014. Retrieved July 25, 2014.