రాం చరణ్ తేజ
రామ్ చరణ్ తేజ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు[ఆధారం చూపాలి].
కొణిదెల రామ్ చరణ్ తేజ | |
![]() మే 2015లో ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో చరణ్ | |
జన్మ నామం | కొణిదెల రామ్ చరణ్ తేజ |
జననం | ![]() | మార్చి 27, 1985
ఇతర పేర్లు | చెర్రీ |
వెబ్‌సైటు | http://www.cherryfans.com/ |
ప్రముఖ పాత్రలు | చరణ్ (చిరుత) కాళభైరవ,హర్ష(మగధీర) |
వ్యక్తిగత జీవితంసవరించు
రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు.[1].
సినీ జీవితంసవరించు
చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత (సినిమా) చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.
ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది.ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రేండింగ్ లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ (సినిమా) చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి ఎవడు (సినిమా) చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ (సినిమా) చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు.2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ లో నటించాడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.2016 లో వచ్చిన ధృవ చిత్రం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు.2018 లో వచ్చిన రంగస్థలం చిత్రం లో చెవిటి వాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు ఆ చిత్రం విజయం తో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది.2019 లో జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలోవినయ విధేయ రామ చిత్రంలో నటించారు.
నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయిక | ఇతర విశేషాలు | |
---|---|---|---|---|---|
2007 | చిరుత | చరణ్ | నేహా శర్మ | విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం | |
2009 | మగధీర | హర్ష
కాళభైరవ |
కాజల్ అగర్వాల్ | విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం | |
2010 | ఆరెంజ్ | రాం | జెనీలియా | ||
2011 | రచ్చ | "బెట్టింగ్" రాజ్ | తమన్నా | ||
2013 | నాయక్ | చరణ్
సిద్దార్థ్ నాయక్ |
కాజల్ అగర్వాల్ | ||
2013 | తుఫాన్ (జంజీర్) | విజయ్ | ప్రియాంక చోప్రా | తొలి హిందీ చిత్రం. తెలుగులో తుఫాన్‌గా అనువదించబడింది | |
2014 | ఎవడు | సత్య
చరణ్ |
శృతి హాసన్ | ||
2014 | గోవిందుడు అందరివాడేలే | అభిరామ్ | కాజల్ అగర్వాల్ | ||
2015 | బ్రూస్ లీ - ది ఫైటర్ | కార్తీక్ | రకుల్ ప్రీత్ సింగ్ | ||
2016 | ధృవ | ధ్రువ | రకుల్ ప్రీత్ సింగ్ | ||
2017 | ఖైదీ నెంబర్ 150 | అతిథి పాత్ర | అమ్మడు లెట్స్ డూ కుమ్మూడు పాటలో కనిపిస్తాడు | ||
2018 | రంగస్థలం | చిట్టిబాబు | సమంత అక్కినేని | ||
2019 | వినయ విధేయ రామ | రామ | కైరా అద్వానీ (నటి) | ||
2019 | ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం |
నిర్మాతగాసవరించు
సంవత్సరం | చిత్రం | తారాగణం | బాష | దర్శకుడు |
---|---|---|---|---|
2017 | ఖైదీ నెంబర్ 150 | చిరంజీవి, కాజల్ అగర్వాల్ | తెలుగు | వి. వి. వినాయక్ |
2018 | Sye Raa Narasimha Reddy | చిరంజీవి, నయన తార | తెలుగు | సురేందర్ రెడ్డి |
గాయకునిగాసవరించు
సంవత్సరం | పాటలు | చిత్రం | సంగీత దర్శకుడు | బాష | Singer(s) |
---|---|---|---|---|---|
2013 | "Mumbai Ke Hero" | తుఫాన్ (సినిమా) | Chirantan Bhatt | తెలుగు | రాం చరణ్,
Jaspreet Jasz, Roshni Baptist |
వనరులుసవరించు
- ↑ "Ram Charan marries Upasana Kamineni". The Times of India.
Wikimedia Commons has media related to Ram Charan. |
బయటి లింకులుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాం చరణ్ పేజీ
- ఫేస్బుక్ లో రాం చరణ్