ఘంటాడి కృష్ణ ఒక తెలుగు సినీ సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు.[1][2] 50 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[3] అతను టాలీ వుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. అతని చిత్రంలో మెలోడీతో పాటు ఫోక్ బీట్ కూడా ఉంతర్లీనంగా ఉండేటట్లు చూసుకుంటాడు. విజయవంతమైన కొన్ని సినిమాలు: సంపంగి, 6 టీన్స్, వైఫ్, ప్రేమలో పావనీ కళ్యాణ్, శ్రీరామచంద్రులు, జానకీ వెడ్స్ శ్రీరాం, బంగారు కొండ, అవతారం, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు.[4]

ఘంటాడి కృష్ణ
వృత్తిసంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు

అతను ఉపేంద్ర,అతని సతీమణి నటించిన "శ్రీమతి" అనే కన్నడ చిత్రానికి సంగీతం అందించాడు.

జీవిత విశేషాలు మార్చు

అతను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాకు చెందిన కొత్తగూడెం. అతను ఇంజనీరింగ్ లో బి.టెక్ (సివిల్) పూర్తిచేసాడు. తరువాత మ్యూజిక్ లో ఎం.ఏ చేసాడు. అతని తండ్రి గురుమూర్తి, తల్లి వెంకటమ్మ. అతని తండ్రి మంచి గాయకుడు.

అతను సినిమా పాటల రచయితగా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించాడు. వాస్తవానికి అతను గాయకుడు. సినీ పరిశ్రమకు రాకముందు చదువుకున్న కాలంలో బాగా పాటలు పాడేవాడు. చదుతు కొనసాగిస్తూనే సంగీతాన్ని అభ్యసించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఎం.ఏ (మ్యూజిక్) చేసి పాటల రచయితగా ప్రేమపల్లకి సినిమా ద్వారా సినీ రంగంలో చేరాడు. సంగీత దర్శకునిగా అతని మొదటి ఆల్బం సంపంగి లోని పాటలన్నీ ప్రేక్షకుల ఆదరణను పొందాయి. అతను రాసిన మొదటి పాట "వెల్లువై ఉరికేనులే...వేణువై పాడేనులే".

అతను 6 టీన్స్, సంపంగి లు పూర్తి అయిన తరువాత వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు.

సినిమాలు మార్చు

దర్శకుడిగా మార్చు

  • రిస్క్‌ (2023)[5]

మూలాలు మార్చు

  1. "Ghantadi Krishna". thetelugufilmnagar.com. Retrieved 20 September 2017.[permanent dead link]
  2. "నిర్మాతగా ఘంటాడి కృష్ణ". sakshi.com. sakshi.com. Retrieved 20 September 2017.
  3. యాదవ్, రాజు. "ఇద్ద‌రిమ‌ధ్య ఏం జ‌రిగింది!". prabhanews.com. ఆంధ్రప్రభ. Retrieved 23 September 2017.[permanent dead link]
  4. "Ghantadi Krishna Birthday Special". www.ragalahari.com. Retrieved 2020-07-17.
  5. Namasthe Telangana (28 March 2023). "దర్శకుడిగా మారిన టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. వివరాలివే". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.

బాహ్య లంకెలు మార్చు