అవిసె మొక్క లినేసి /లైనేసి కుటుంబానికి చెందినమొక్క. ఈమొక్క వృక్షశాస్త్రనామము:లైనమ్ ఉసిటాటిసిమమ్. అవిసెను ఇంగ్లీషులో ఫ్ల్యాక్స్ లేదా లిన్సీడ్ అని పిలుస్తారు. వీటిని తెలుగులో మదనగింజలు, ఉలుసులు, అతశి అని కూడా ఆంటారు. ఇది ప్రపంచం యొక్క చల్లని ప్రాంతాల్లో పెరిగే ఒక ఆహార, పీచు పంట. అవిసె నార మొక్క కాండం నుండి తీసుకుంటారు, ఇది పత్తి కంటే రెండు మూడు రెట్ల బలంగా ఉంటుంది. అలాగే, అవిసె నార సహజంగా మృదువుగా, పొడవుగా ఉంటుంది. పందొమ్మిదో శతాబ్దం వరకు, వెజిటబుల్ ఆధారిత వస్త్రాల కొరకు ఐరోపా, ఉత్తర అమెరికాలు ప్లాక్స్ మీద ఆధారపడ్డాయి. ప్లాక్స్ స్థానాన్ని పత్తి అధిగమించడంతో అత్యంత సాధారణ మొక్కగా నార కాగితం తయారీ కొరకు ఉపయోగిస్తున్నారు. ఫ్లాక్స్ ను కెనడియన్ ప్రాయిరైస్ లో లిన్‌సీడ్ ఆయిల్ కొరకు పండిస్తున్నారు, ఈ ఆయిల్ ను రంగులలో, వార్నిష్ లలో, లినోలియం వంటి ఉత్పత్తుల్లో, ముద్రణ సిరాలలో డ్రైయింగ్ ఆయిల్ గా ఉపయోగిస్తున్నారు. ఇది భారతదేశానికి తూర్పు మధ్యధరా ప్రాంతము నుండి విస్తరించింది,, ఇది బహుశా సారవంతమైన ప్రాంతాలలో పండించిన మొదటి దేశవాళీ పంట. ప్లాక్స్ ను ప్రాచీన చైనా, ప్రాచీన ఈజిప్ట్ లలో విస్తారముగా సాగు చేశారు.

అవిసె
Linum usitatissimum - Köhler–s Medizinal-Pflanzen-088.jpg
Flax plant
Scientific classification
Kingdom
(unranked)
(unranked)
(unranked)
Order
Family
Genus
Species
L. usitatissimum
Binomial name
Linum usitatissimum

చరిత్రసవరించు

దీని ప్రారంభమూలస్దానం మధ్యధరా ప్రాంతం, అటునుండి భారత్‍వరకు విస్తరించింది.అనాదికాలంనుండి కూడా ఇథోఫియా, పురాతన ఈజిఫ్టులో సాగుచేస్తున్నటు ఆధారాలున్నాయి.క్రీ>శ.2009లో రిపబ్లిక్ ఆఫ్‍ జార్జియాలోని అతిపురాతనమైన (prehistoric) గుహలో అవిసెమొక్క నార ఆనవాళ్లు దొరికాయి, దాదాపు క్రీ.పూ,30000 వేలసంవత్సరాలనాటికే అవిసెను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. నియోథిక్ (Neolithic) (రాతియుగం చివరిదశ) నాటికే అవిసెనారనుండి యూరఫ్ ప్రాంతంలో బట్టలు తయారుచేసినట్లు తెలుస్తున్నది.థెబ్స్ (Thebes) లోని సమాధులపైన, దేవాలయాల గోడలపైన అవిసె పూలచిత్రాలను గుర్తించారు.

ఇతరభారతీయభాషలలో అవిసె పేరుసవరించు

  • హింది, గుజరాతి, పంజాబి:అల్సి (Alsi)
  • మరాతి:జరస్ (jaras, అల్సి, (Alsi)
  • కన్నడం:అగసె (agase)
  • తమిళం:అలిరిథల్ (alirithal)
  • ఒరియా:పెషి (peshi)
  • బెంగాలి, అస్సామీ:తిషి (Tishi, అల్సి (Alsi)

అవిసె పంటసాగుసవరించు

మొక్క అవిసెమొక్క 4అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.ఏకవార్షికము.ఆకులు పొడవుగావుండి మధ్యలో వెడల్పుగా వుండి, పచ్చగావుండును.20-40మి.మీపొడవుండి, ఆకుమధ్యభాగం3-5మి.మీ వెడల్పువుండును.పూలు పర్పులుబ్లూ రంగులో వుండును.15-25మి.మీ వ్యాసంకల్గి, ఐదు పుష్పదళాలను కలిగివుండును. చల్లవి వాతావరణఉష్ణోగ్రతలో పంట బాగాదిగుబడి ఇచ్చును.వర్షపాతం 150-750 మి.మీ.లమధ్యవుండవలెను.నల్లరేగడిభూములు (deep black soil) అనుకూలం.గంగానదీతీరప్రాంతాలలోనిపరిసర మైదానాలు (Indo-gangatic plains) కూడా సాగుకు అనుకూలం.ఈపంటను ఎక్కువగా రబీ (సెప్టెంబరు-అక్టొబరు,, ఫిబ్రవరి-మార్చిలలో) లో సాగుచేయుదురు.వర్షాధారపంట అయ్యినచో హెక్టారుకు 210నుంచి450 కిలోల దిగుబడి వచ్చును.నీటిపారుదలక్రింద అయ్యినచో 1200నుంచి1500కిలోలు ఒక హెక్టారుకు గింజలదిగుబడి వచ్చును.సరాసరి దిగుబడిని 1000-1900 కిలోలు /హెక్టరుకు. భారతదేశంలో ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు :మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహరు, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్నాటక రాష్ట్రం.ప్రపంచదేశాలలో కెనడా, అమెరికా, యూరోపు, చైనా, ఇథోఫియా, రష్యా, పాకిస్తాను, బ్రెజిల్,, అర్జైంటినాలు.

అవిసె నూనెసవరించు

ప్రధానవ్యాసం: అవిసె నూనె చూడండి.

ఆధారాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అవిసె&oldid=3051699" నుండి వెలికితీశారు