అవుటాఫ్ కవరేజ్ ఏరియా


అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథల సంపుటాన్ని పసునూరి రవీందర్ రచించాడు. ఈ కథలలో తెలంగాణ ప్రాంతానికి చెందిన దళితుల జీవనాన్ని చిత్రించాడు. రచయిత ఈ గ్రంథాన్ని తన తల్లిదండ్రులైన వరవ్వ, వీరస్వామిలకు, ప్రాణస్నేహితుడైన తెల్లం కృష్ణమోహన్‌కు అంకితం ఇచ్చాడు.

అవుటాఫ్ కవరేజ్ ఏరియా
కృతికర్త: పసునూరి రవీందర్
బొమ్మలు: అక్బర్
ముఖచిత్ర కళాకారుడు: ఎం.ఎఫ్. హుసేన్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంపుటి
ప్రచురణ: ఇండస్ పబ్లికేషన్స్
విడుదల: ఆగష్టు, 2014
పేజీలు: 182
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-93-5174-897-7

రచయిత గురించి

మార్చు

పసునూరి రవీందర్ వరంగల్‌ జిల్లా శివనగర్‌ ప్రాంతంలో 1980వ సంవత్సరం జనవరి 8న జన్మించాడు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో "ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం -విమర్శ"అనే అంశం మీద ఎంఫిల్‌, "తెలంగాణ గేయసాహిత్యం-ప్రాదేశిక విమర్శ"అనే అంశంపై పి.హెచ్‌డీ చేశాడు. ఇతడు రాసిన వ్యాసాలు పలు దిన, వార పత్రికల్లో అచ్చయ్యాయి. 'దస్కత్'తెలంగాణ కథా వేదికకు కన్వీనర్‌గా పనిచేసాడు.

పుస్తకంలో 15 కథలు ఉన్నాయి. వీటిలో మూడవ కథ "అవుటాఫ్ కవరేజ్ ఏరియా"ను ఈ పుస్తకానికి శీర్షికగా రచయిత ఎన్నుకున్నాడు. ఈ పుస్తకంలోని కథలు వరుసగా:

  1. వేరెవర్ యూ గో
  2. గోవర్ణం
  3. అవుటాఫ్ కవరేజ్ ఏరియా[1]
  4. ఊగి... ఊగి... ఉయ్యాల
  5. మేరా నంబర్ కబ్ ఆయేగా ..?
  6. అన్నీ తానై...
  7. జాగీరు
  8. ఒడుపు
  9. పొద్దయ్యింది
  10. ఫరెవర్...
  11. పెంజీకటి
  12. దేవుని మీద మన్నుబొయ్య..!!
  13. సంపుడుపంజెం
  14. నిచ్చెనమెట్లు
  15. తురుంఖాన్

పురస్కారాలు

మార్చు
  • కేంద్ర సాహిత్య అకాడమీ వారి యువపురస్కారం ఈ గ్రంథానికి గాను పసునూరి రవీందర్కు 2015లో లభించింది.

ప్రముఖుల అభిప్రాయాలు

మార్చు
  • రవీందర్ కథల్లో చాలా మటుకు కులం ముఖ్యమైన విషయంగా మారడంలో ఆశ్చర్యమేమి లేదు. పది నిజాల కంటే ఒక అబద్ధం ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.పైగా, ఆ అబద్దం ఆ పది నిజాల్ని కప్పిపుచ్చేది అయితే కోపం ఇంకా కట్టలు తెంచుకుంటుంది. రవీందర్ కథల్లో ఈ సామాజిక అధర్మం మీద, ధర్మాగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. - అఫ్సర్.
  • ఈ కథలు దళిత జీవితం పట్ల సామాన్యుని అవగాహనను విశాలం చేస్తాయి. ఆధిపత్యం ప్రదర్శించేవాళ్లను సిగ్గుపడేటట్టు చేస్తాయి. ఈ సమాజాన్ని, దళిత జీవితాన్ని ఉన్నతీకరించడానికి చేతులు కలుపమని కర్తవ్యాన్ని బోధిస్తాయి. - పిల్లలమర్రి రాములు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు