పసునూరి రవీందర్

పసునూరి రవీందర్‌ కవిగా, రచయితగా తెలుగు సాహితీ జగత్తుకు సుపరిచితుడు. తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం అందుకున్న రచయిత. తెలంగాణ ఉద్యమ గేయసాహిత్యంపై హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్‌ అందుకున్నారు[ఆధారం చూపాలి] . వరంగల్‌ జిల్లా శివనగర్‌ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై జనవరి 8న జన్మించారు.

పసునూరి రవీందర్
డాక్టర్ పసునూరి రవీందర్
జననంజనవరి 8
వరంగల్ జిల్లా శివనగర్‌
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిరచయిత

"ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం -విమర్శ"అనే అంశం మీద ఎంఫిల్‌, "తెలంగాణ గేయసాహిత్యం-ప్రాదేశిక విమర్శ"అనే అంశంపై పి.హెచ్‌డీ చేశారు. పసునూరి రాసిన వ్యాసాలు పలు దిన, వార పత్రికల్లో అచ్చయ్యాయి. 'దస్కత్'తెలంగాణ కథా వేదికకు కన్వీనర్‌గా పనిచేసారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యకారులను కూడగట్టి ఉద్యమ బాట పట్టించిన "సింగిడి" తెలంగాణ రచయితల సంఘానికి కన్వీనర్‌గా పనిచేశారు. తాను రాసిన అవుటాఫ్ క‌వ‌రేజ్ ఏరియా క‌థా సంపుటికి కేంద్ర‌సాహిత్య అకాడెమి యువ‌ పుర‌స్కారం ల‌భించింది. జాషువా, బోయి భీమ‌న్నల త‌ర్వాత‌ సాహిత్య అకాడెమి చేత గౌర‌వాన్ని అందుకున్న ద‌ళిత ర‌చ‌యిత ర‌వీంద‌రే.[1] కొంతకాలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకునిగా (గెస్ట్ ఫ్యాకల్టీగా) పని చేశారు.

ప్రస్తుతం అద్దం డిజిటల్ డైలీ పత్రికకు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రచనలు

మార్చు

డాక్టర్‌ పసునూరి రవీందర్‌ రాసిన మొదటి కథ "వలసపక్షులు" (2002) 'ప్రజాశక్తి' దినపత్రికలో అచ్చైంది.

  • -లడాయి (2010) (తెలంగాణ ఉద్యమ దీర్ఘకవిత, పలు విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో పేర్కొనబడిన కావ్యం)
  •  
    తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో మామిడి హరికృష్ణ నుండి సత్కారం అందుకుంటున్న పసునూరి రవిందర్ మిర్యాల లలిత (చిత్రంలో నందిని సిధారెడ్డి, తిరునగరి రామానుజయ్య, నాళేశ్వరం శంకరం తదితరులు)
    -జాగో జగావో (2012) (సహ సంపాదకత్వం) (200మంది కవుల కవిత్వం వెలువడ్డ తెలంగాణ కీలక వచన కవితా సంకలనం)
  • -దిమ్మిస (2013) (సహ సంపాదకత్వం) వినిర్మాణ కవిత్వం)
  • -అవుటాఫ్ కవరేజ్ ఏరియా (2014) (తెలంగాణ రాష్ట్ర తొలి కథా సంపుటి), తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారి యువ పురస్కారానికి ఎంపికైన కథా సంపుటి.
  • -తెలంగాణ గేయ సాహిత్యం ప్రాదేశిక విమర్శ (2016) (తెలంగాణ ఉద్యమ పాటపై పరిశోధన గ్రంథం)
  • -ఒంటరి యుద్ధభూమి (2018) (కవిత్వం)
  • -గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ (2016) ఎంఫిల్ సిద్ధాంత వ్యాసం)
  • ఇమ్మతి (సాహిత్య విమర్శ వ్యాస సంపుటి) (2018)
  • పోటెత్తిన పాట (గేయ సాహిత్య విమర్శ) (2018)
  • కండీషన్స్ అప్లయ్ (కథా సంపుటి) (2023)
    • -మాదిగపొద్దు (2009) (సంపాదకత్వం)

పసునూరి ప్రధాన సంపాదకునిగా ఉన్న పత్రిక

  • -స్వేరోటైమ్స్ (మంత్లీ మ్యాగ్జిన్)

పసునూరి కాలమిస్ట్ గా ఉన్న అంతర్జాల సాహిత్య పత్రిక

-సారంగ

గతంలో పనిచేసిన సాహిత్య పత్రికలు

-హైదరాబాద్ మిర్రర్ తెలుగు దినప్రతిక (కాలమిస్టు)

-జనగానం ప్రజానాట్యమండలి సాంస్కృతిక పత్రిక (కాలమిస్టు, ఎడిటోరియల్ బోర్డు మెంబర్)

-సింగిడి మాసపత్రిక (ఎడిటోరియల్ బోర్డు మెంబర్)

–అద్దం డిజిటల్​ డైలీ (చీఫ్​ ఎడిటర్​)

బహుముఖ కృషి

మార్చు

డాక్టర్ పసునూరి రవీందర్ బహుముఖీన కృషి చేస్తున్నారు. సాహిత్యంలో ఎవరికైనా ఒకటో రెండో ప్రక్రియల్లో ప్రవేశం, ప్రావీణ్యం ఉంటుంది. కానీ, డాక్టర్ పసునూరి మాత్రం తొలుత పాటతో తాను సాహిత్యంలోకి ప్రవేశించారు. విద్యార్థిగా ఉన్న నాటి నుండి వామపక్ష ఉద్యమాల సాంస్కృతిక సంఘాల్లో కళాకారునిగా పనిచేశారు. అలా గాయకునిగా మొదలైన ప్రస్థానం, అనతికాలంలోనే పాటల రచయితగా మారింది. అందుకు కారణం ఉద్యమ అవసరాలే. అలా డిగ్రీ చదివేనాటికే వాగ్గేయకారునిగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా పేరుగాంచారు. ఇంటర్మీడియేట్లోనే రాష్ట్ర స్థాయి జానపద గేయాల పోటీలో అనేక బహుమతులు అందుకున్నారు. ఆ తరువాత కవిత్వంలో అడుగుపెట్టారు. 2002లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కవిసమ్మేళనాల్లో పాల్గొని ప్రజల పక్షాన తన గళం వినిపించారు. పసునూరి కవితలు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, సూర్య, ప్రస్థానం, గోదావరి సాహితీ, బహుజన కెరటాలు వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కవితలు ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. సాహిత్య పరిశోధకునిగా పరిశోధనలోకి, అలాగే సాహిత్య విమర్శలోకి అడుగుపెట్టారు. దళిత, బహుజన ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలుస్తు సాహిత్య విమర్శ రాశారు. ఇక కథకునిగా తెలంగాణ దళిత జీవితాన్ని ప్రతిబింబించే కథలు రాస్తున్నారు. ఇక సాహిత్యోద్యమ కారునిగా రవీందర్ చేసిన కృషి విలువైనది. తెలంగాణ ఉద్యమంలో సింగిడి తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్ గా, ఉద్యమానికి మద్ధతుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవ అనంతరం ఏర్పడిన బహుజన రచయితల సంఘానికి కూడా రవీందరే వ్యవస్థాపక అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కథా ప్రక్రియకు జరుగుతున్న అన్యాయం పై ఏర్పడిన 'దస్కత్` తెలంగాణ కథా వేదికకు కన్వీనర్ గా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు సాహిత్యోద్యమకారునిగా పనిచేస్తూనే, తాను పరిశోధన చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ జేఏసీ కో-కన్వీనర్ గా పనిచేశారు. పలు ప్రాంతాల విద్యార్థుల మధ్య సమన్వయం ఏర్పరచి, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను పదిజిల్లాల్లో ప్రచారం చేశారు.

తెలంగాణ ఉద్యమగీతాల్లో తలమానికమైన గీతాల్లో ఒకటిగా పేరొందిన ''జైకొట్టు తెలంగాణ'' https://www.youtube.com/watch?v=ub2CqasoanU&list=RDub2CqasoanU&index=0) గీతం పసునూరి రవీందర్ రచించిందే. ఈ పాట ఉద్యమకాలంలో దేశ, విదేశాల్లో మార్మోగింది.

అవార్డులు

మార్చు

- కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత (2015) (తొలి తెలంగాణ రచయిత)

-యువశ్రీ (1998), యువశ్రీ కల్చరల్ ఆర్గనైజేషన్, వరంగల్

-సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం (2015) (తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ తేనా వారి పునర్జీవన గౌరవపురస్కారాలు-ఉత్తమ పరిశోధనగ్రంథ పురస్కారం)

-రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు (2015) (తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ వేడుకలు)

-నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (2015) (యునైటెడ్ ఫోరం)

-ద‌ర‌సం పుర‌స్కారం (2017)

-న‌ట‌రాజ్ అకాడెమి ప్ర‌తిభా పుర‌స్కారం (2017)

-గిడుగు పుర‌స్కారం (2017)

సాహిత్య రత్న అవార్డ్ (భారతీయ దళిత సాహిత్య అకాడెమి) (2018)

కంకణాల జ్యోతి సాహిత్య రత్న అవార్డ్(2018)

జెన్నె మాణిక్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం (2019)

వాయిస్ టుడే ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ లిటరరీ కాంట్రిబ్యూషన్ (2019)

గూడా అంజయ్య స్మారక పురస్కారం (2019)

జ్యోత్స్నా కళాపీఠం-ఉగాది కవితా పురస్కారం(2019)

జైనీ శకుంతల స్మారక కథా పురస్కారం (2019)

బి.ఎస్.రాములు స్ఫూర్తి పురస్కారం (2019)

సుద్దాల హనుమంతు పురస్కారం (2019)

లలిత కళాభిరామ పించము సాహిత్య అవార్డ్ (2019)

పూలే అంబేద్కర్ సేవ పురస్కారం (2020)

సాహసం, వే ఫౌండేషన్ ‘‘ఆత్మీయ పురస్కారం (2020)

కాళోజీ జాతీయ పురస్కారం (2020)

స్వేరోస్ ఎస్ ఎన్ సీ-5 బెస్ట్ రైటర్ (2020)

తెలుగువిశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2020)

ఇండియన్ బాబ్ మార్లే ఎర్ర ఉపాలి అవార్డ్ (2021)

తెలంగాణ సారస్వత పరిషత్​ ఉత్తమ కథా సంపుటి అవార్డ్​ (2024)[2]

ప్రసంగించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులు

మార్చు
  • -ప్రపంచీకరణ-తెలుగు భాష, సాహిత్యం-కళలు (ఇంటర్నేషనల్ సెమినార్, ఉస్మానియా కాలేజ్, కర్నూలు, 2014)
  • -నిర్దేశాత్మక వ్యాకరణం-ప్రాదేశిక భాషలు (నేషనల్ సెమినార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,2008)
  • -జానపద సిద్ధాంతాలు-నూతన పరిశోధన పద్ధతులు (నేషనల్ సెమినార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 2008)
  • -కె.వి.నరేందర్ కథలు-ప్రాదేశిక దృక్పథం (నేషనల్ సెమినార్, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2008)
  • -ప్రపంచీకరణ గేయసాహిత్యం-రాజ్యాధిపత్యం (నేషనల్ సెమినార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 2008)
  • -ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్య విమర్శ (నేషనల్ సెమినార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్2008)
  • -తెలుగు దళిత కథా చరిత్ర-వికాసం (నేషనల్ సెమినార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 2010)
  • -తెలంగాణ గేయ సాహిత్యం-ఉద్యమాలు (నేషనల్ సెమినార్, జడ్చర్ల, హైదరాబాద్, 2012)
  • -ప్రపంచకీరణ సాహిత్య విమర్శ-సిద్ధాంతం (నేషనల్ సెమినార్, ఇందిరా ప్రియదర్శిని కళాశాల, హైదరాబాద్, 2013)
  • -తెలంగాణ పాట-ప్రజా పోరాటాలు ( (నేషనల్ సెమినార్, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్, 2014)
  • -తెలంగాణ గేయం సాహిత్యం-సూత్రీకరణ (నేషనల్ సెమినార్, ట్రిపుల్ ఐటీ, బాసర, 2015)
  • -తెలంగాణ గేయ సాహిత్యం-ఆరంభ, వికాసాలు (నిజాం కాలేజ్, హైదరాబాద్, 2016)

మూలాలు

మార్చు
  1. ఓరుగల్లు బిడ్డకు సాహితీ పురస్కారం[permanent dead link]
  2. Babu, Sridhar (2024-06-26). "సారస్వత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారాలు". www.dishadaily.com. Retrieved 2024-10-26.

బయటి లింకులు

మార్చు