ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర అనే పుస్తకం యాగాటి చిన్నారావు ఆంగ్లంలో వ్రాసిన దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ యొక్క తెలుగు అనువాదం.[1] ఈ అనువాదానికి గాను ప్రభాకర్ మందారకు 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[2] ఈ అవార్డును 20 ఆగస్టు 2010 న పనాజీ (గోవా) లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు సునీల్ గంగోపాధ్యాయ ప్రదానం చేసారు.

ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర
"ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: యాగాటి చిన్నారావు
అసలు పేరు (తెలుగులో లేకపోతే): దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ
అనువాదకులు: ప్రభాకర్ మందార
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పరిశోధనా గ్రంథం
ప్రచురణ: హైదరాబాదు బుక్ ట్రస్టు
విడుదల: 2003
పేజీలు: 198
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 8173915733
9788173915734
ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌,హైదరాబాద్‌ - 500 067

పుస్తక సమీక్ష

మార్చు

అర్థ శతాబ్దపు (1900-1950) ఆంధ్ర దళిత ఉద్యమాల చరిత్రను కూలంకషంగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన పుస్తకమిది. ఆంధ్ర చరిత్రలో మరుగున పడి కనిపించని అనేక సామాజిక, సాంస్కృతిక అంశాలను యాగాటి చిన్నారావు నూతన ఆధారాలతో వెలికితీసి ఇందులో పొందుపరిచారు. అంటరానితనం పేరిట హిందూ సమాజం దళితులపై ప్రదర్శించిన హేయమైన వివక్షనూ, క్రౌర్యాన్నీ, వాటి మూలాలనూ, దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధికి దోహదం చేసిన దళిత విద్య, రాజకీయాలలో దళితుల భాగస్వామ్యం; గుర్తింపుకోసం, ఆత్మగౌరవం కోసం దళితులు చేసిన పోరాటాలు, దళితుల ప్రతిఘటనా సాహిత్యం వంటి అనేక అంశాలను ఇందులో లోతుగా పరిశీలించారు. 1932 నాటి గాంధీ హరిజనోద్ధరణ కార్యక్రమానికంటే ఎంతో ముందే మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంతంలోనూ, హైదరాబాద్‌ రాష్ట్రంలోనూ పెల్లుబికిన స్వతంత్ర దళితోద్యమాలను ఇందులో సవివరంగా పేర్కొన్నారు. జాతీయ దళితోద్యమ చరిత్రలో అటుంచి, స్థానికంగా కూడా సరైన గుర్తింపునకు నోచుకోని ఎందరో తెలుగు దళిత మేధావులు, రచయితలు, నేతల విశిష్ట కృషిని ఇందులో కళ్లకు కట్టినట్టు వివరించారు.[3][4]

ఈ పుస్తకం దళిత్స్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ పేరిట ఆంగ్లంలో వెలువడి ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అనువాదం

మార్చు

ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన ప్రభాకర్ మందార "2009 సంవత్సరపు కేంద్ర సాహిత్య అకాడమీ ట్రాన్స్‌లేషన్‌ ప్రైజ్‌"కు ఎంపికయ్యారు.

మూలాలు

మార్చు
  1. Andrapradesh Dalitha Udyama Charithra(1900-1950) (ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర(1900-1950) )
  2. "Prabhakar bags Sahitya Akademi prize". News. The Hindu. 27 February 2010. Retrieved 7 February 2016.
  3. Dalits struggle for identity: Andhra and Hyderabad 1900-1950
  4. పుస్తక పరిచయం[permanent dead link]

ఇతర లింకులు

మార్చు