ఆత్మగౌరవం

1966 సినిమా

ఆత్మగౌరవం 1966 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కాంచన ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మదుసూధనరావు. సాలూరు రాజేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

ఆత్మగౌరవం
Aathma Gouravam.jpg
దర్శకత్వంకె.విశ్వనాథ్
రచనగొల్లపూడి మారుతీరావు,
భమిడిపాటి రాధాకృష్ణ
కథయద్దనపూడి సులోచనారాణి,
గొల్లపూడి మారుతీరావు
నిర్మాతదుక్కిపాటి మధుసూధనరావు
నటవర్గంఅక్కినేని నాగేశ్వరరావు,
కాంచన,
చలం,
పి.హేమలత,
రాజశ్రీ,
అల్లు రామలింగయ్య,
రమణారెడ్డి,
వాసంతి,
గుమ్మడి
సంగీతంఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1966 మార్చి 11 (1966-03-11)
భాషతెలుగు

నిర్మాణంసవరించు

అభివృద్ధిసవరించు

ఆత్మగౌరవం సినిమా కె.విశ్వనాథ్ కు దర్శకునిగా తొలి సినిమా. సినిమాకు కథ యద్దనపూడి సులోచనారాణి, గొల్లపూడి మారుతీరావు అందించగా, గొల్లపూడి మారుతీరావు, భమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాశారు. సినిమాను అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విశ్వనాథ్ ప్రతిభ గమనించిన అక్కినేని నాగేశ్వరరావు తమ అన్నపూర్ణ పిక్చర్స్ లో కొన్నాళ్ళు దర్శకత్వ శాఖలో పనిచేయమని తానే దర్శకునిగా అవకాశమిస్తానని అన్నారు. అలానే కొన్నాళ్ళు విశ్వనాథ్ పనిచేయడంతో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ సినిమా అవకాశాన్ని విశ్వనాథ్ కు ఇచ్చారు అన్నపూర్ణ నిర్మాతలు. నిజానికి వారు డాక్టర్ చక్రవర్తి సినిమాకే విశ్వనాథ్ ని దర్శకత్వం వహించమని అవకాశమిచ్చినా, అప్పటికి తనపై తనకు పూర్తి నమ్మకం రాని కారణంగా విశ్వనాథ్ ఆ సినిమాకు ఎప్పటిలానే ఆదుర్తి అసోసియేట్ గా పనిచేసి తర్వాత కొన్నాళ్ళకు దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథాచర్చలు ప్రధానంగా హైదరాబాదు పబ్లిక్ గార్డెన్లోనే జరిగాయి.[1]

నటీనటుల ఎంపికసవరించు

ఆత్మగౌరవం సినిమాని హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో, రామప్ప ప్రాంతం వంటి ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్న క్రమంలో స్థానిక నటులను, సాంకేతిక నిపుణులను సినిమాలోకి తీసుకుని అవకాశాలిచ్చారు.[1]

[2]

చిత్రీకరణసవరించు

ఆత్మగౌరవం సినిమాలోని అవుట్ డోర్ సన్నివేశాలను హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో, రామప్ప చెరువు ప్రాంతంలోనూ, రామప్ప దేవాలయము వద్ద, దిండి ప్రాజెక్టు పరిసరాల్లోనూ చిత్రీకరించారు.[1]

విడుదల, స్పందనసవరించు

1966 మార్చి 11న ఆత్మగౌరవం సినిమా విడుదలైంది. సినిమా మంచి ప్రేక్షకాదరణ పొంది వ్యాపారపరంగా విజయం సాధించింది. తర్వాతి కాలంలో దర్శకునిగా ఎదిగిన ఈ చిత్రదర్శకుడు కె.విశ్వనాథ్ కెరీర్ కి ఈ సినిమా బాటలువేసింది.[1][2]

అవార్డులుసవరించు

  • తృతీయ ఉత్తమచిత్రం నంది పురస్కారం
  • ఉత్తమ కథాచిత్రం నంది పురస్కారం.

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
ఒక పూలబాణం తగిలింది మదిలో తొలిప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
పరువము పొంగే వేళలో పరదాలు ఎందుకో చెంగున లేచి చేతులు చాచి చెలియ నన్నందుకో సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
రానని రాలేనని ఊరకే అంటావు రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే మనసులు కలిపిన చూపులే పులకించె పాడెలే శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
మా రాజులొచ్చారు, మహారాజులొచ్చారు, మా ఇంటికొచ్చారు, మా మంచివారంట, మనసున్న వారంట, మాకెంతో నచ్చారు సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, వసంత
అందెను నేడే అందని జాబిల్లి దాశరథి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 "మొదటి సినిమా-కె. విశ్వనాథ్, నవతరంగంలో". Archived from the original on 2015-08-26. Retrieved 2015-08-22.
  2. 2.0 2.1 మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.