ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ముస్లిం రచయితలు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ముస్లిం రచయితలు
ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం వర్గానికి ఉర్దూ మాట్లాడడం వచ్చు గాని ఉర్దూ చదవడం, వ్రాయడం బహుతక్కువ. కానీ తెలుగు మాట్లాడేవారు తప్పక తెలుగు చదవనూ గలరు, వ్రాయనూ గలరు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం వర్గానికి తెలుగుతో అవినాభావ సంబంధం వున్ననూ వీరి పాత్ర తెలుగు సాహితీ రంగంలో బహు తక్కువే. దీనికి కారణం అపారమైన సాహితీరంగంలో పాలలో చక్కెరగా కలిసిపోయి మిగతా తెలుగువారికి అనునయించడమే. అలాగని వీరి సాహితీ బాంధవ్యాలు తక్కువేమీ కావు.
తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు
మార్చుతెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు. తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;
- ముహమ్మద్ హుస్సేన్
భక్త కల్పద్రుమ శతకం (1949) మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం సుమాంజలి. హరిహరనాథ శతకము అనుగుబాల నీతి శతకము తెనుగుబాల శతకము
- మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
- మాతృ భాష యొండు మాన్యము గదా
- మాతృ శబ్దము విన మది పులకింపదా?
- వినుత ధర్మశీల తెనుగు బాల"
- షేక్ దావూద్
1963లో రసూల్ ప్రభు శతకము అల్లా మాలిక్ శతకము
- సయ్యద్ ముహమ్మద్ అజమ్
సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము
- ముహమ్మద్ యార్
సోదర సూక్తులు
- గంగన్నవల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్ దాసవర్య
- హాజీ ముహమ్మద్ జైనుల్ అబెదీన్
ప్రవక్త సూక్తి శతకము, భయ్యా శతకము
- తక్కల్లపల్లి పాపాసాహెబ్
వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట
- షేక్ ఖాసిం
సాధుశీల శతకము కులము మతముగాదు గుణము ప్రధానంబు దైవచింత లేమి తపముగాదు, బాలయోగి కులము పంచమ కులమయా, సాధులోకపాల సత్యశీల
- షేక్ అలీ
గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం మానస ప్రబోధము శతకం
- ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన
- పాండితీ ప్రకర్ష పట్టుబడదు
- పరులభాష గాన భాధను గూర్చును
- గురుని మాట యశము గూర్చు బాట
- దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ
- వభ్యసించ వలయు నర్భకుండ
- మాతృ భాష నేర్చి మర్యాదలందుమా
- గురుని మాట యశము గూర్చు బాట
- షేక్ రసూల్
మిత్రబోధామృతము అనే శతకం
బ్రహ్మ విద్యా విలాసము.
- కవి యాకూబ్
- "తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి 1991 లో నాగార్జున యూనివర్శిటీలో పి.హెచ్.డి వచ్చింది.
- ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగు సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు.
- సయ్యద్ నశీర్ అహ్మద్ "అక్షర శిల్పులు" పేరుతో 333 మంది తెలుగు ముస్లిం కవులు, రచయితల వివరాలతో 2010 లో పుస్తకం ప్రచురించారు.
- సయ్యద్ సలీం నవల "కాలుతున్న పూలతోట"కు 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
- వేంపల్లె షరీఫ్ కథల పుస్తకం "జుమ్మా''కు 2012లో కేంద్రసాహిత్య అకాడెమీ యువ అవార్డు వచ్చింది.
స్వాతంత్రానికి పూర్వం ముస్లిములు నడిపిన తెలుగు పత్రికలు
మార్చు- 1842-"వర్తమాన తరంగిణి "వార పత్రిక ---1842 జూన్ 8 న సయ్యద్ రహమతుల్లా మద్రాసు.సయ్యద్ రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం.మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము.హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
- 1891-"విద్వన్మనోహారిణి "—మీర్ షుజాయత్ అలీ ఖాన్, నరసాపురం.తరువాత ఈ పత్రిక వీరేశ లింగం గారు నడిపిన "వివేకవర్ధని "లో కలిసిపోయింది.
- 1892 -- "సత్యాన్వేషిణి "—బజులుల్లా సాహెబ్, రాజమండ్రి.
- 1909 --"ఆరోగ్య ప్రబోధిని " షేక్ అహ్మద్ సాహెబ్, రాజమండ్రి.
- 1944 -- "మీజాన్ " దినపత్రిక—కలకత్తావాలా, హైదరాబాదు.అడవి బాపిరాజు సంపాదకుడు.