ఆంధ్రాపోరి
ఆంధ్రాపోరి, 2015 జూన్ 5న విడుదలైన తెలుగు సినిమా.[1] ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానురులో రమేష్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆకాష్ పూరి, ఉల్కా గుప్త జంటగా నటించగా, డాక్టర్ జోస్యభట్ల సంగీతం అదించాడు. అంకుల్ (2001), రుషి (2012) సినిమాల తర్వాత రాజ్ మాదిరాజు దర్శకుడిగా చేసిన మూడవ చిత్రం ఇది.
ఆంధ్రాపోరి | |
---|---|
దస్త్రం:অন্ধ্র পরী চলচ্চিত্রের পোস্টার.jpg | |
దర్శకత్వం | రాజ్ మాదిరాజు |
నిర్మాత | రమేష్ ప్రసాద్ |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ వనమాలి |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | డాక్టర్ జోస్యభట్ల |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 5 జూన్, 2015 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఈ సినిమా 2014లో వచ్చిన మరాఠీ సినిమా టైమ్‌పాస్కు అధికారిక రీమేక్. ఇందులో ప్రథమేష్ పరాబ్, కేతకి మాటేగాంకర్[2][3] నటించారు. షైజు మాథ్యూ రాసిన నాక్డ్ అప్ నవల ఆధారంగా 2010లో విడుదలయిది.[4]
నటవర్గం
మార్చు- ఆకాశ్ పూరి (నర్సింగ్)
- ఉల్కా గుప్తా (ప్రశాంతి)
- అరవింద్ కృష్ణ (బాలు)
- శ్రీముఖి (స్వప్న)
- ఉత్తేజ్ (నరసింహరావు)
- ఈశ్వరీ రావు (యాదమ్మ)
- శ్రీకాంత్ (గాపాల్ రావు)
ఇతర సాంకేతికవర్గం
మార్చు- కళ: రాజీవ్ నాయర్
- కో-డైరెక్టర్: రమేష్ నారాయణ్
- ప్రొడక్షన్ డిజైనర్: మహేష్ చదలవాడ
- నృత్యం: చంద్రకిరణ్
- స్టిల్స్: సత్య
- పబ్లిసిటీ డిజైనర్ శ్రీ యాడ్స్ ఈశ్వర్
పాటలు
మార్చుఈ సినిమాకు డాక్టర్ జోస్యభట్ల సంగీతం అందించాడు. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల మొదలైనవారు పాటలు రాశారు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "దేత్తడి" | స్వీకర్ అగస్తీ | |
2. | "ఏ కల్వికి" | ప్రణవి, హేమచంద్ర | |
3. | "ఆంధ్రాపోరి" | అమృత వర్షిణి, సాయికిరణ్ | |
4. | "దోస్తీ" | బాలాజీ | |
5. | "గుండెల్లో" | కల్పనా రాఘవేంద్ర | |
6. | "ఏ చరిత్ర" | హేమచంద్ర |
వివాదాలు
మార్చుఈ సినిమా టైటిల్ కు వ్యతిరేకంగా ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ పిటిషన్ ను దాఖలు చేసింది, పోరి అనే పదం "అమ్మాయిల ఆత్మగౌరవాన్ని దిగజార్చడానికి అభ్యంతరకరమైన పదం" అని వాదించగా, ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.[5]
మూలాలు
మార్చు- ↑ Chowdhary, Y. Sunita (5 June 2015). "Andhra Pori: Not exactly a time pass" – via www.thehindu.com.
- ↑ "Dad suggested I do 'Andhra Pori': Puri Akash". 31 May 2015.
- ↑ Jha, Lata (11 September 2017). "Ten Marathi films remade in other languages". mint.
- ↑ kavirayani, suresh (10 October 2014). "Puri Akash to act in a teenage love drama". Deccan Chronicle.
- ↑ "HC Dismisses Plea on 'Andhra Pori' Movie Title". The New Indian Express.