ప్రధాన మెనూను తెరువు

ఆచంట శరత్ కమల్ (జననం: జులై 12, 1982) ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబమునకు చెందినవాడు. చెన్నై లయోలా కళాశాలలో చదివాడు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఉద్యోగి[1].

ప్రస్తుతము ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో కమల్ ది 63వ స్థానము.

విజయములు, పురస్కారాలుసవరించు

  • 2004 లో కౌలాలంపూర్లో జరిగిన 16వ కామన్ వెల్త్ క్రీడలలో బంగారు పతకము సాధించాడు.
  • 2004 లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారముతో సన్మానించింది.
  • 2006 లో కొలంబోలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలలో నాలుగు పతకములు గెలిచాడు.
  • 2006 లో మెల్‌బోర్న్ కామన్‌వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకములు సాధించాడు
  • 2007 లో ఉత్తర కొరియా లోని ప్యోంగ్ యాంగ్ అంతర్జాతీయ టూర్నమెంట్ గెలిచాడు.
  • 2008 లో నాలుగవ సారి జాతీయ ఛాంపియన్ గా ఎన్నుకొనబడ్డాడు.
  • 2010 లో గౌహతిలో జరిగిన 71వ జాతీయ ఛాంపియన్ గా గెలిచాడు.

మూలాలుసవరించు