ఆదర్శ పెళ్ళిళ్ళు

ఆదర్శపెళ్ళిళ్ళు 1969లో విడుదలైన తెలుగు సినిమా.ఇది 1967లో విడుదలైన తమిళ సినిమా ఊటీ వరై ఉరవుకు తెలుగు డబ్బింగ్. శ్రీ శ్రీనివాసా ఫిల్మ్స్ పతాకంపై బొడగల కృష్ణయ్య నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, ఆర్. ముత్తురామన్, కె.ఆర్.విజయ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]

ఆదర్శ పెళ్ళిల్లు
(1969 తెలుగు సినిమా)

ఆదర్శ పెళ్ళిళ్ళు సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ శ్రీ శ్రీనివాస ఫిల్మ్స్
భాష తెలుగు

ఇదే సినిమా 1983లో శ్రీరంగనీతులు పేరుతో రీమేక్ చేయబడింది.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  1. ఇదే మధురమైన స్నేహలీలా ఇదే మదిన్ మోహల్ మీరు వేళ - ఎస్.పి. బాలు, పి.సుశీల
  2. కలలుగాంచి నా రాణి వచ్చే నన్ను మోజుతో కవ్వించె - పి.బి.శ్రీనవాస్, ఎల్. ఆర్.ఈశ్వరి
  3. తీయగా పాడనా హాయిగా ఆడనా విరిసిన ఆశయే మైకమై సాగెనా - పి.సుశీల
  4. పూబాలయే సుకుమారియే నవనాట్యాలాడేనులే - ఎస్.పి.బాలు, పి.సుశీల
  5. బలే చిన్నదిలే షోకైనదీ, అందములు చిందెనులే - ఎస్.పి. బాలు
  6. హాపీ హాపీ హపీ లోకమే హాపీ హాపీ - ఎస్.పి.బాలు, పి.సుశీల

శ్రీమంతుడైన వెంకటాచలం చిన్నప్పుడు ఒక యువతితో సంబంధం పెట్టుకుని ఒక ఆడపిల్లను కంటాడు. ఆ యువతి మరణించి ఆ పిల్ల అనాథరాలు అవుతుంది. ఇప్పుడు వెంకటాచలం తన భార్యతోను, విద్యాధికుడైన కుమారుడు రవితోను గౌరవంగా సమాజంలో జీవిస్తున్నాడు. ఆ ఆడపిల్ల గతిలేని స్థితిలో తండ్రిని వెతుక్కొంటూ వెంకటాచలం వద్దకు బయలుదేరింది. కానీ త్రోవలో కారు ఆక్సిడెంట్ అయి రవి చేత ఆసుపత్రిలో చేరుతుంది. ఆమె స్థానంలో ఆ ఆక్సిడెంటుకు కారణమైన విజయ అనే అమ్మాయి వెంకటాచలం వద్దకు వచ్చి తనే కూతురునని చెప్పి బెదిరించింది. వెంకటాచలం ఆమె మాటను నమ్మి తనకు కూతురున్నదనే విషయం భార్యా బిడ్డలకు తెలిస్తే పరువు పోతుందని భయపడి ఆమెను బ్రతిమలాడుకుని ఇంట్లోనే అట్టిపెడతాడు. ఆమె తన చెల్లెలు కాదని తెలుసుకున్న రవి తన తండ్రి చేసిన తప్పును తండ్రి చేతే బయట పెట్టించే ఎత్తు వేసి ఆమెతో ప్రేమ కలాపాలు సాగిస్తాడు. వారిద్దరి నటన నిజమైన ప్రేమగా మారుతుంది. తన కొడుకూ కూతురూ ప్రేమించుకుంటున్నారని భ్రమపడిన వెంకటాచలం వారిని విడదీయడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఈలోగా తన చెల్లెలు రతి కోలుకుని తన మిత్రుణ్ణి ప్రేమిస్తున్నదని తెలుసుకున్న రవి సనాతనుడైన ఆ మిత్రుని తండ్రిని ఒప్పించడానికి ఎన్నో పన్నాగాలు పన్ని రతిని వారి ఇంట్లోనే చేర్పించి నాటకమాడతాడు. రతి భాగ్యవంతుల పిల్ల అని నమ్మి అతడు తన కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. రతి వివాహ సమయంలోనే రవి విజయల వివాహం కూడా నిశ్చయమౌతుంది. వెంకటాచలం తన తప్పును ఒప్పుకుంటాడా? రవి తల్లి అతడిని క్షమిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో లభిస్తుంది. [3]

మూలాలు

మార్చు
  1. "Aadarsha Pellillu (1969)". Indiancine.ma. Retrieved 2020-08-15.
  2. రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "ఆదర్శపెళ్ళిళ్ళు - 1969". ఆదర్శపెళ్ళిళ్ళు - 1969. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. అనిసెట్టి సుబ్బారావు (1969). ఆదర్శ పెళ్ళిళ్ళు పాటల పుస్తకం (1 ed.). pp. 2–3. Retrieved 28 September 2021.

బాహ్య లంకెలు

మార్చు