సి.వి.శ్రీధర్
చిట్టమూరి విజయరాఘవులు శ్రీధర్ (సి.వి.శ్రీధర్) (23 జూలై 1933 - 20 అక్టోబర్ 2008) ఒక భారతీయ చలన చిత్ర దర్శకుడు. ఇతడు తమిళ, తెలుగు, హిందీ భాషలలో 60కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు.
సి.వి.శ్రీధర్ | |
---|---|
జననం | చిట్టమూరి విజయరాఘవులు శ్రీధరకృష్ణన్ 1933 జూలై 22 చిట్టమూరు, చెంగల్పట్టు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2008 అక్టోబరు 20 చెన్నై | (వయసు 75)
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1959–1991 |
జీవిత భాగస్వామి | దేవసేన |
తల్లిదండ్రులు | విజయరాఘవులు రెడ్డియార్r తాయారమ్మాళ్ |
జీవిత విశేషాలు
మార్చుశ్రీధర్ తమిళనాడు రాష్ట్రంలోని మధురాంతకం సమీపంలోని చిట్టమూర్ అనే గ్రామానికి చెందినవాడు. ఇతడు చెంగల్పట్టులోని సెయింట్ జోసెఫ్ హైస్కూలులో చదివాడు. ఇతడు 7వ తరగతి చదివే సమయం నుండే రచనలు చేయడం, నాటకాలలో నటించడం ప్రారంభించాడు.
వృత్తి
మార్చుఇతడు తన 18వ యేట రక్తపాశం అనే తమిళ నాటకాన్ని వ్రాయగా టి.కె.షణ్ముగం దానిని అనేక చోట్ల ప్రదర్శించాడు. తరువాత ఈ నాటకాన్ని జుపిటర్ పిక్చర్స్ సినిమాగా తీసింది. ఆ సినిమాకు శ్రీధర్ సంభాషణలు వ్రాశాడు. పిమ్మట 1956లో ఈ చిత్రాన్ని ఎ.వి.యం. ప్రొడక్షన్స్ అశోక్ కుమార్, కిశోర్ కుమార్ నటులుగా భాయి భాయి అనే పేరుతో హిందీలో నిర్మించింది. ఆ చిత్రానికి కూడా ఇతడు స్క్రీన్ ప్లే, సంభాషణలను సమకూర్చాడు. తరువాత ఇతడు మాడరన్ థియేటర్స్, వీనస్ పిక్చర్స్ మొదలైన సంస్థలకు పనిచేశాడు. తరువాత చిత్రాలయ అనే స్వంత సంస్థను ప్రారంభించి కొన్ని సినిమాలను నిర్మించాడు.
మరణం
మార్చుఇతడు తన 75వ యేట 2008, అక్టోబర్ 20న చెన్నైలో గుండెపోటుతో మరణించాడు.[1]
ఫిల్మోగ్రఫీ
మార్చుశ్రీధర్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల జాబితా:[2]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | వివరాలు | |||
---|---|---|---|---|---|---|
దర్శకుడు | నిర్మాత | కథ | స్క్రీన్ ప్లే/సంభాషణలు | |||
1954 | జ్యోతి | కె.బి.తిలక్‌తో కలిసి | ||||
1960 | పెళ్ళికానుక | |||||
1961 | కష్టసుఖాలు | విదివెల్లి తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1961 | విరిసిన వెన్నెల | తెన్ నిలవు తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1961 | స్త్రీ హృదయం | మీంద సొర్గమ్ తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1964 | మాస్టారమ్మాయి | సుమైతాంగి తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1965 | మారని మనసులు | నెంజం మరప్పతిల్లై తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1966 | మనసే మందిరం | నెంజిల్ ఒరు ఆలయం తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1969 | ఆదర్శ పెళ్ళిళ్ళు | ఊటీ వరై ఉరవు తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1970 | విప్లవం వర్ధిల్లాలి | శివంద మన్ తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1975 | లక్ష్మి నిర్దోషి | |||||
1976 | హీరో - 76 | వైర నెంజమ్ తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1977 | మనసున్న మనిషి | |||||
1977 | సీత గీత దాటితే | |||||
1978 | వయసు పిలిచింది | |||||
1979 | ఊర్వశీ నీవే నా ప్రేయసి | |||||
1980 | జన్మహక్కు | |||||
1980 | హరే కృష్ణ హలో రాధ | |||||
1984 | ప్రేమ సంగమం | |||||
1984 | రౌడీలకు సవాల్ | తడిక్కుం కరంగళ్ తమిళ సినిమా డబ్బింగ్ | ||||
1985 | ఆలయదీపం | |||||
1987 | అందరికంటే ఘనుడు | |||||
1987 | పొగరుబోతు | |||||
1988 | ప్రేమాయణం | |||||
1990 | మొగుడికి తగ్గ పెళ్ళామ్ |
పురస్కారాలు
మార్చుఇతడు అనేక పురస్కారాలకు ప్రతిపాదించబడ్డాడు. అనేక పురస్కారాలను స్వీకరించాడు. ఇతడు అందుకున్న కొన్ని పురస్కారాలు:
- 1959లో కళ్యాణ పరిసు చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం[3]
- 1962లో నెంజిల్ ఒరు ఆలయం చిత్త్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం[4]
- కళైమామణి పురస్కారం
- 1961లో నజరానా చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ కథ పురస్కారం
- 1997లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వారి అరిజ్ఞర్ అన్నా అవార్డు.
మూలాలు
మార్చు- ↑ Dore, Shalini. "Indian director C.V. Sridhar dies". వెరైటీ. Retrieved 19 August 2012.
- ↑ web master. "All Movies C.V. Sridhar". ఇండియన్ సినిమా. Archived from the original on 20 September 2022. Retrieved 20 September 2022.
- ↑ "7th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 26 March 2015. Retrieved 20 September 2022.
- ↑ "10th National Film Awards". International Film Festival of India. Archived from the original on 29 సెప్టెంబరు 2015. Retrieved 9 సెప్టెంబరు 2011.
బయటి లింకులు
మార్చు