ఆనీ మాస్కరీన్

భారత స్వాతంత్ర్య సమరయోధురాలు

ఆనీ మాస్కరీన్ (1902 జూన్ 6 - 1963 జూలై 19) స్వాతంత్ర్య సమర యోధురాలు, రాజకీయవేత్త, న్యాయవాది, కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఆనీ, పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసింది. అలా చేసిన మొదటి మహిళ ఆమె. కేరళలో మొదటి మహిళా మంత్రి కూడా.

ఆనీ మాస్కరీన్
ఆనీ మాస్కరీన్


ట్రావన్కోర్ రాష్ట్ర శాసనసభ సభ్యురాలు (1948)

వ్యక్తిగత వివరాలు

జననం (1902-06-06)1902 జూన్ 6
మరణం 1963 జూలై 19(1963-07-19) (వయసు 61)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

కుటుంబం, విద్య

మార్చు

మాస్కరీన్ 1902 జూన్‌లో ఒక లాటిన్ కాథలిక్ కుటుంబంలో, త్రివేండ్రంలో జన్మించింది. ఆమె తండ్రి, గాబ్రియేల్ మాస్కరీన్, ట్రావన్‌కోర్ సంస్థానంలో అధికారి. ఆమె 1925 లో మహారాజా కాలేజీ ట్రావెన్‌కోర్‌లో చరిత్ర, ఆర్థికశాస్త్రంలో డబుల్ ఎంఏ సంపాదించింది. సిలోన్‌లో ఉపాధ్యాయురాలిగా కొన్నాళ్ళు పనిచేసి, తిరిగి వచ్చాక, త్రివేండ్రం లోని మహారాజా ఆర్ట్స్ అండ్ లా కాలేజీలో చేరి, న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించింది. [1] [2]

స్వాతంత్ర్య సమరం, రాజకీయాలు

మార్చు

అక్కమ్మ చెరియన్, పట్టం థాను పిళ్లైతో పాటు, మాస్కరీన్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొంది. సంస్థానాల విలినం కోసం కృషిచేసిన నాయకులలో ఆమె ఒకరు. [3] [4] 1938 ఫిబ్రవరిలో, ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు, అందులో చేరిన మొదటి మహిళలలో ఆమె ఒకరు. ట్రావెన్‌కోర్ కోసం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని స్థాపించడమే ఆ పార్టీ లక్ష్యం. దానికి అధ్యక్షుడిగా పట్టం థాను పిళ్లై నాయకత్వం వహించాడు. అందులో KT థామస్, PS నటరాజ పిళ్లై, కార్యదర్శులుగాను, MR మాధవ వారియర్, కోశాధికారిగానూ పనిచేశారు. మాస్కరీన్ కార్యవర్గ సభ్యురాలిగా నియమించబడింది. పార్టీ ప్రచార కమిటీలో కూడా ఆమె పనిచేసింది. సంస్థాన దివానుగా సర్ సిపి రామస్వామి అయ్యర్ నియామకాన్ని రద్దు చేయాలని, అతని పరిపాలన, నియామకాలు, ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలనీ డిమాండ్ చేస్తూ మహారాజా చితిర తిరునాల్‌కు మెమోరాండం పంపడం కార్యనిర్వాహక కమిటీ తీసుకున్న తొలి చర్యలలో ఒకటి. అయ్యర్ పరిపాలనపై దాడి చేసినందుకు గాను, అతడూ అతని అనుచరులూ ప్రతీకారం తీర్చుకున్నారు. [5]

పార్టీ అధ్యక్షుడు పిళ్ళైతో కలిసి చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రచార పర్యటనలో మాస్కరీన్, శాసనసభలోను, ప్రభుత్వం లోనూ దివాను జోక్యం చేసుకోవడాన్ని ఆమె విమర్శించింది. ఆమె స్టేట్‌మెంట్ల కారణంగా ఓ పోలీసు అధికారి ఆమెపై దాడి చేసాడు. ఆమె ఇంటిని పగలగొట్టి, ఆస్తిని దోచుకెళ్ళారు. ఆమె ఈ ఘటనపై కథనాన్ని ప్రచురించి, పోలీసుల ఆగ్రహానికి గురైంది. [6] [7] అయ్యర్ ఆమెకు వ్యతిరేకంగా మహారాజాతో మాట్లాడాడు, మాస్కరీన్ ప్రభుత్వ పరువు తీసే ప్రసంగాలు చేస్తోందనీ, పన్నులు చెల్లించవద్దని ప్రజలను ప్రోత్సహిస్తోందనీ ఆరోపించాడు. ఆమె ప్రమాదకరమనీ, అసంతృప్తిని రగిలించిందనీ పోలీసు కమిషనరు కూడా నివేదించారు. [6] ఆమె క్రియాశీలత కారణంగా 1939-1947 మధ్య వివిధ సందర్భాల్లో అనేక సార్లు అరెస్టైంది. జైలుశిక్షలు అనుభవించింది. [8]

1938, 1939 ల్లో, మాస్కరీన్ ట్రావెన్‌కోర్ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డులో పనిచేసింది. [9] [10] రాష్ట్ర శాసనసభలో ఉండగా ఆమె, శక్తివంతమైన వక్తగా మారింది. విధాన నిర్ణయాలు చెయ్యడాన్ని ఆస్వాదించింది. [11] 1942 లో, మాస్కరీన్ క్విట్ ఇండియా ఉద్యమంలో చేరింది. రెండు సంవత్సరాల తరువాత ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెసు పార్టీకి కార్యదర్శిగా ఎన్నికైంది. 1946 ఫిబ్రవరి 21 న మాస్కరీన్‌ బొంబాయిలో చేసిన ప్రసంగం గురించి ఆమెకు మహాత్మాగాంధీ ఇలా రాసాడు, "అలా కాకపోయినా సరే, మీ నాలుకపై మీకు నియంత్రణ లేదని నాకు తెలుసు. మాట్లాడటానికి నిలబడినప్పుడు, మీకు ఏది తోస్తే అది అనేస్తారని తెలుసు. ఆ వార్తాపత్రిక నివేదిక సరైనదే అయితే ఈ ప్రసంగం కూడా దానికి ఒక నమూనాయే. నేను భాయ్ థాను పిళ్లైకి ఆ నివేదిక పంపాను. మీరు దానిని చదవండి. ఇలాంటి విచక్షణారహితమైన మాటలు మీకు గానీ, ట్రావెన్‌కూరులోని పేద ప్రజలకు గానీ మేలు చేయవు. అంతేకాకుండా, మీ చర్య ద్వారా మీరు మొత్తం స్త్రీ జాతినే సిగ్గుపడేలా చేసారు." ప్రభుత్వంలో మంత్రి పదవి నుండి మాస్కరీన్‌ను తప్పించాలని ఆశిస్తూ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌లో సహోద్యోగికి రాసాడు కూడా. [11]

పార్లమెంటరీ కెరీర్

మార్చు

1946 లో, భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పరచిన 299 మంది సభ్యుల రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన 15 మంది మహిళలలో మాస్కరీన్ ఒకరు. [11] హిందూ కోడ్ బిల్లును పరిశీలించే అసెంబ్లీ ఎంపిక కమిటీలో ఆమె పనిచేసింది. [12] [13] భారత స్వాతంత్ర్య చట్టం 1947 ను బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించాక, ఆగష్టు 15 న, ఈ రాజ్యాంగ సభే పార్లమెంటుగా మారింది. [14] 1948 లో ఆమె ట్రావెన్‌కోర్-కొచ్చిన్ శాసనసభకు తిరిగి ఎన్నికైంది. ఆ స్థానంలో ఆమె 1952 వరకు పనిచేసింది. [1] 1949 లో, పరూర్ టికె నారాయణ పిళ్లై మంత్రిత్వ శాఖలో ఆమెను ఆరోగ్యం, విద్యుత్ శాఖల మంత్రిగా నియమించారు, స్వాతంత్య్రానంతరం రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి మహిళ ఆమె. [15] [16]

మాస్కరీన్, 1951 భారత సార్వత్రిక ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా మొదటి లోక్‌సభకు ఎన్నికైంది. [17] ఆమె కేరళ నుండి ఎన్నికైన మొట్ట మొదటి మహిళా ఎంపీ. ఆ ఎన్నికలలో పార్లమెంటుకు ఎన్నికైన 10 మంది మహిళల్లో ఒకరు. [18] [19] 1957 రెండవ సార్వత్రిక ఎన్నికలలో, ఆమె తిరువనంతపురంలో ఎస్ ఈశ్వరన్ చేతిలో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. అక్కడ పోటీచేసినవారిలో ట్రావెన్‌కోర్ కాంగ్రెస్‌లో తన పాత సహోద్యోగి పట్టం థాను పిళ్లై కూడా ఉన్నాడు. [20]

ఆనీ మాస్కరీన్ 1963 లో మరణించింది. ఆమె సమాధి తిరువనంతపురంలోని పట్టూర్ స్మశానవాటికలో ఉంది. [21]

సంస్మరణ

మార్చు

తిరువనంతపురంలోని వజుతకాడ్‌లోని ఆనీ మాస్కరీన్ స్క్వేర్‌లో ఆనీ మాస్కరీన్ కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. 2013 సెప్టెంబరులో దీనిని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించాడు.[22] [23]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "First Lok Sabha - Members Bioprofile". Archived from the original on 27 May 2014. Retrieved 2013-02-01.
  2. "ANNIE MASCARENE (1902–1963)". Retrieved 2013-02-01.
  3. Social Science History 8. Social Science History Association. 1968. p. 99. ISBN 9788183320979.
  4. Thanthai, Kumari (2009). Liberation of the Oppressed a Continuous Struggle. Nagercoil: Kanyakumari Institute of Development Studies. p. 207.
  5. Karunakaran, M. (2008). "The Role of Annie Mascarene, The Freedom Fighter in the Travancore Princely State". Proceedings of the Indian History Congress. 69. New Delhi, India: Indian History Congress: 1268–1269. JSTOR 44147300. OCLC 1063275330.
  6. 6.0 6.1 Karunakaran, M. (2008). "The Role of Annie Mascarene, The Freedom Fighter in the Travancore Princely State". Proceedings of the Indian History Congress. 69. New Delhi, India: Indian History Congress: 1268–1269. JSTOR 44147300. OCLC 1063275330.
  7. Ravichandran, Priya (16 February 2018). "Annie Mascarene: Freedom Fighter, Nation Builder, Guardian of Democracy and Kerala's First MP". The Indian Express. Mumbai, India. Archived from the original on 24 July 2019. Retrieved 27 November 2019.
  8. "First Lok Sabha - Members Bioprofile". Archived from the original on 27 May 2014. Retrieved 2013-02-01.
  9. The Travancore Directory for 1938. Trivandrum: Government Press. 1937. p. 230.
  10. The Travancore Directory for 1939. Trivandrum: Government Press. 1938. p. 152.
  11. 11.0 11.1 11.2 Ravichandran, Priya (16 February 2018). "Annie Mascarene: Freedom Fighter, Nation Builder, Guardian of Democracy and Kerala's First MP". The Indian Express. Mumbai, India. Archived from the original on 24 July 2019. Retrieved 27 November 2019.
  12. "The Constitution-framers India forgot". Rediff.com. Retrieved 2013-02-01.
  13. "CONSTITUENT ASSEMBLY OF INDIA - VOLUME X". Parliament of India. Archived from the original on 7 September 2011. Retrieved 2013-02-01.
  14. Thiruvengadam, Arun K. (2017). The Constitution of India: A Contextual Analysis. New Delhi, India: Bloomsbury Publishing. p. 40. ISBN 978-1-84946-869-5.
  15. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Kochuthressia 1994 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  16. "COUNCIL OF MINISTERS, TRAVANCORE-COCHIN". Archived from the original on 2017-02-11. Retrieved 2013-02-01.
  17. "MEMBERS OF FIRST LOK SABHA". Parliament of India. Archived from the original on 8 April 2013. Retrieved 2013-02-01.
  18. "Representation of women in Lok Sabha from Kerala". Press Information Bureau. Retrieved 2013-02-01.
  19. "60 years ago, in Parliament". The Indian Express. 13 May 2012. Retrieved 2013-02-01.
  20. "Second Lok Sabha - Members Bioprofile". Archived from the original on 4 March 2016. Retrieved 2013-02-01.
  21. "Gathering nuggets of history from city streets". The Hindu. 16 June 2014. Retrieved 2014-08-12.
  22. "Ansari to unveil Annie Mascarene statue". The Hindu. 9 September 2013. Retrieved 2013-09-13.
  23. "Vice-President unveils statue of Annie Mascarene". The New Indian Express. 12 September 2013. Archived from the original on 2013-10-24. Retrieved 2013-09-13.