భారత స్వాతంత్ర్య చట్టం 1947

భారత స్వాతంత్ర చట్టం 1947 అన్నది బ్రిటీష్ ఇండియాను భారత, పాకిస్తాన్ అన్న రెండు స్వతంత్ర డొమినియన్లు ఏర్పాటుచేస్తూ విభజించేందుకు యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్ చేసిన చట్టం. జూలై 18, 1947న చట్టం రాజసమ్మతి పొందింది, భారత స్వాతంత్రం, పాకిస్తాన్ ఏర్పాటు ఆగస్టు 15 తేదీన జరిగాయి. ఐతే వైశ్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆగస్టు 15వ తేదీన అధికార బదిలీ కోసం ఢిల్లీలో ఉండవలసి రావడంతో, పాకిస్తాన్ 14 ఆగస్టు 1947న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది.[1]

సంప్రదింపుల అనంతరం జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్, ఆచార్య కృపలానీ ప్రాతినిధ్యంలోని కాంగ్రెస్ పార్టీ, మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, అబ్దుల్ రబ్ నిష్తార్ ల ప్రాతినిధ్యంలోని ముస్లిం లీగ్, సిక్ఖుల ప్రతినిధిగా సర్దార్ బల్దేవ్ సింగ్ లతో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్‌బాటన్ ఒప్పందానికి వచ్చాకా యు.కె. ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ ప్రభుత్వం, భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ కలిసి చట్టాన్ని తయారుచేశారు.

అధికార బదిలీ కోసం సంప్రదింపులు చేసేందుకు వచ్చిన క్యాబినెట్ మిషన్ సమైక్య భారత సమాఖ్య ప్రతిపాదన (మే 16 ప్రతిపాదన) కు కాంగ్రెస్, ముస్లిం లీగ్ ల ఆమోదం లభించింది. కానీ క్యాబినెట్ మిషన్ సభ్యుడు క్రిప్స్ ఎవరికి అనుకూలమైన నిర్వచనం వారికి చెప్తూ ఆమోదం పొందడంతో వారు వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగిస్తూ దాన్ని పూర్తిగా తిరస్కరించారు. దాంతో ఆగ్రహించిన ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ప్రత్యక్ష కార్యాచరణ దినానికి పిలుపునిచ్చారు. హింసాత్మకమైన ఈ మలుపుతో కాంగ్రెస్, బ్రిటీష్ ప్రభుత్వాలపై ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశాన్ని సమాఖ్యగా ఉంచే మే 16 ప్రతిపాదన, పూర్తి బెంగాల్, పూర్తి పంజాబ్ లతో పాకిస్తాన్ విభజించి ఏర్పరిచే జూన్ 16 ప్రతిపాదనకు మధ్యగా మరో ప్రణాళికను ముందు సివిల్ సర్వెంట్ వి.కె.మీనన్ తయారు చేశారు. దీని ప్రకారం బ్రిటీష్ ఇండియా భారత దేశం, పాకిస్తాన్ లుగా విభజన అవుతుంది, అలాగే బెంగాల్, పంజాబ్ ప్రావిన్సులు కూడా విభజితమై, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు పాకిస్తాన్ కు, హిందువుల సంఖ్యాధిక్యత ఉన్న ప్రాంతాలు భారతదేశానికి లభిస్తాయి. ఇది మౌంట్ బాటన్ ప్రణాళికగా పేరొందింది. దీనికి ముందు కాంగ్రెస్ వారు అంగీకరించారు, ఐతే కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన విన్నప్పుడు వ్యతిరేకించినా అధికార బదిలీకి సిద్ధమైపోతున్న బ్రిటీష్ ప్రభుత్వం ఈ ప్రతిపాదననూ తిరస్కరిస్తే అధికారాన్ని బేషరతుగా కాంగ్రెస్ కు బదిలీ చేయగలదని అనుమానించిన జిన్నా మౌంట్ బాటన్ నుంచి వినగానే దీనికి అంగీకరించారు.[2]

చట్టం నేపథ్యంసవరించు

అట్లీ ప్రకటనసవరించు

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ 1947 ఫిబ్రవరి 20న ప్రకటన ఇలావుంది:

  1. బ్రిటీష్ ప్రభుత్వం బ్రిటీష్ ఇండియాకు పూర్తి స్వంత ప్రభుత్వాన్ని కనీసం జూన్ 1948 నాటికి మంజూరుచేస్తుంది.
  2. తుది (అధికార) బదిలీ తేదీ నిర్ణయించిన తర్వాత సంస్థానాల భవితవ్యం నిర్ణయమవుతుంది[3]

3 జూన్ ప్రణాళికసవరించు

మౌంట్ బాటన్ ప్రణాళికగా పేరొందింది. బ్రిటీష్ ప్రభుత్వం 1947 జూన్ 3న ప్రతిపాదించిన ప్రణాళికలో ఈ అంశాలున్నాయి:

  1. భారత విభజనకు సూత్రాన్ని బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించింది
  2. వారసులుగా వచ్చే ప్రభుత్వాలకు డొమినియన్ స్థాయి ఇవ్వబడుతుంది
  3. బ్రిటీష్ కామన్వెల్త్ నుంచి ఎప్పుడైనా తప్పుకునేందుకు షరతులు లేని హక్కు ఉంటుంది

భారత స్వాతంత్ర చట్టం 1947 అన్నది జూన్ 3 ప్రణాళికకు అమలు వంటిది.

మూలాలుసవరించు

  1. Hoshiar Singh, Pankaj Singh; Singh Hoshiar. Indian Administration. Pearson Education India. p. 10. ISBN 978-81-317-6119-9. Retrieved 2 January 2013.
  2. గాంధీ, రాజ్ మోహన్ (మే 2016). "విజయం". వల్లభ్ భాయ్ పటేల్:జీవిత కథ (తెలుగు (అనువాదం) లో) (2 సంపాదకులు.). హైదరాబాద్: ఎమెస్కో బుక్స్.CS1 maint: unrecognized language (link)
  3. Ghose, Sankar (1993). Jawaharlal Nehru : a biography (1. publ. సంపాదకులు.). New Delhi [u.a.]: Allied Publ. p. 151. ISBN 9788170233695.