ఆముదార్లంక కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఆముదార్లంక
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఆముదార్లంక is located in Andhra Pradesh
ఆముదార్లంక
ఆముదార్లంక
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°06′29″N 80°51′22″E / 16.108110°N 80.856112°E / 16.108110; 80.856112
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి కట్టా పద్మావతి
పిన్ కోడ్ 522257
ఎస్.టి.డి కోడ్ 08648.

చల్లపల్లి మండల పరిధిలో ఉన్న ఆముదార్లంక గ్రామం, గుంటూరు జిల్లా కృష్ణా నది ఒడ్డున ఉంది. ఈ గ్రామం ఒక లంక గ్రామం. ఈ గ్రామానికి పోస్టాఫీసు వగైరాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి.

సమీప గ్రామాలు

మార్చు

రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

వీరు మండల కేంద్రానికి రావాలంటే, 33 కి.మీ. రహదారి మార్గం గుండా ప్రయాణించవలసి ఉంటుంది. లేదంటే పడవల మీద కృష్ణా నది దాటి రావాలి. మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 62 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ గ్రామానికి వానా కాలంలో అప్పుడప్పుడూ వరదలు వస్తుంటవి. అప్పుడు గ్రామంలోని ఈ పాఠశాలలో, వరద బాధితులకోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తారు.

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

ఈ గ్రామానికి పోస్టాఫీసు వగైరాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ ఆలూరి జగన్నాధం సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

మార్చు
  1. ప్రస్తుత నిజామాబాదు జిల్లా, నిజామాబాదు గ్రామీణ నియోజకవర్గ, శాసనసభ్యులైన, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుగారి పూర్వీకులు, ఈ గ్రామస్తులేనని పెద్దలు చెబుతుంటారు.ఇతని తండ్రి వెంకటరామయ్య గారిని గ్రామస్థులు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు.
  2. ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్ర ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేయుచున్న శ్రీ మండవ విష్ణువర్ధన్ ఈ గ్రామస్తులే.
  3. ఈ గ్రామానికి చెందిన శ్రీ మండవ హర్షవర్ధన్, 2010లో బిట్స్, పిలానీలో కంప్యూటర్ సైన్సెస్ పట్టభద్రుడు. తరువాత, ఐ.పి.ఎస్.లో ఉత్తీర్ణత సాధించి, హైదరాబాదులోని సర్దార్ పటేల్ పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందాడు. శిక్షణా కాలంలో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. తరువాత జరిగిన Passingout Parade లో నవంబరు-5,2013నాడు, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి 2 ప్రత్యేక ప్రతిభా పురస్కారాలు అందుకున్నాడు న్యాయశాస్త్రవిభాగంలో ప్రథముడిగా నిల్చినందుకు. (2) భారత శిక్షాస్మృతిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను, పరదేశినాయుడు ట్రోఫీ. ఈ యువ ఐ.పి.ఎస్. తను స్థాపించిన "పరివర్తన ఫౌండేషను" ద్వారా లంక గ్రామాలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలుచేస్తున్నాడు. ఈయన తండ్రి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో "ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్"గా పనిచెయుచున్నారు.
  4. 2014, జూన్-12న విడుదల చేసిన భారత ప్రభుత్వ "సివిల్స్" పరీక్షా ఫలితాలలో, 135వ ర్యాంకు సాధించిన మండవ దీపిక తండ్రి, ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్ర డి.జి.పి అయిన, శ్రీ మండవ విష్ణువర్ధనరావు, ఈ గ్రామ వాస్తవ్యులే. మండవ దీపిక BITS, పిలానీలో సివిల్ ఇంజనీరింగు, ఎం.ఎస్.సి.ఎకనామిక్స్ ను, 2013 లో పూర్తిచేసి, అదే సంవత్సరం, తొలి ప్రయత్నంలోనే ఐ.పి.ఎస్.కు సెలక్టు అయినది. ఈమె 2014 సెప్టెంబరు నుండి ఉత్తరప్రదేశ్ లోని హరిద్వార్ లో శిక్షణ తీసికొనబోవుచున్నది.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు