ఆరని మంటలు
ఆరని మంటలు 1980, మార్చి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. టీ.వీ ఫిల్మ్స్ పతాకంపై కె.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, కవిత, సుభాషిణి తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2] బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది. ఇది తమిళంలోకి అనువాదమైన చిరంజీవి తొలి చిత్రం. చిరంజీవికి కూర్పు మోహన్ డబ్బింగ్ చెప్పాడు.
ఆరని మంటలు (1980 తెలుగు సినిమా) | |
ఆరని మంటలు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.వాసు |
నిర్మాణం | కె.మహేంద్ర |
తారాగణం | చిరంజీవి, కవిత, సుభాషిణి, ప్రసాద్ బాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | టీ.వీ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | మార్చి 15,1980 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథా నేపథ్యం
మార్చురవి (చిరంజీవి) సోదరి శారద (సుభాషిణి) ని నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఆ నలుగురు రేపిస్టులను చంపడం ద్వారా రవి ప్రతీకారం తీర్చుకుంటాడు.
నటవర్గం
మార్చు- చిరంజీవి (రవి)
- కవిత (లత)
- ప్రసాద్ బాబు (ఇన్సిపెక్టర్ రఘు)
- సుభాషిణి (శారద)
- హరిబాబు
- సిలోన్ మనోహర్ (డేవిడ్)
- నవకాంత్
- జయమాలిని
- గిరిబాబు (గిరి)
- రావి కొండలరావు (లత తండ్రి)
- రాళ్ళపల్లి (కానిస్టేబుల్)
- ఆర్. నారాయణమూర్తి (రౌడీ)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కె.వాసు
- నిర్మాణం: కె.మహేంద్ర , త్రిపుర మల్లు వెంకటేశ్వర్లు
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- నిర్మాణ సంస్థ: టీ.వీ ఫిల్మ్స్
- సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, మైలవరపు గోపి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల , శిష్ట్లా జానకి,
- విడుదల'15:03:1980.
పాటలు
మార్చుఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[3]
- అన్నయ్య దీవెన - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- కమ్మని నా పాట - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
- నా చూపు నీ చూపులు - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్. జానకి
- నలుగురి కోసం వెతుకుతున్నవి - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఓ యమ్మో టక్కరిగుంట - రచన: గోపి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
మూలాలు
మార్చు- ↑ "Archived copy". Archived from the original on 29 January 2018. Retrieved 14 August 2020.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html
- ↑ Cineradham, Songs. "Aarani Mantalu (1980)". www.cineradham.com. Retrieved 14 August 2020.[permanent dead link]