ఆర్.కె.వెంకటరామ శాస్త్రి

వాయులీన విద్వాంసుడు, ఆకాశవాణి కళాకారుడు

రుద్రపట్నం కృష్ణ వెంకటరామ శాస్త్రి కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.[1]

ఆర్.కె.వెంకటరామ శాస్త్రి
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంరుద్రపట్నం కృష్ణ వెంకటరామశాస్త్రి
జననం(1907-11-10)1907 నవంబరు 10
రుద్రపట్న,హసన్ జిల్లా, కర్ణాటక
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

విశేషాలు

మార్చు

ఇతడు 1907, నవంబరు 10వ తేదీన రుద్రపట్నం కృష్ణశాస్త్రి, సణ్ణక్క దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోని రుద్రపట్న గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి కృష్ణశాస్త్రి సంగీతకారుడు, హరికథా కళాకారుడు, నాటక రచయిత, సంస్కృత, కన్నడ పండితుడు. తల్లి సణ్ణక్క గాయని, వైణికుడు బెట్టదపుర నారాయణస్వామి కుమార్తె. ఇతడు వీణ సుబ్బణ్ణ, మైసూర్ తిరుమకూడలు చౌడయ్యల వద్ద ఒక దశాబ్దం పాటు వాయులీనం నేర్చుకున్నాడు. 1936లో ఇతడు మద్రాసుకు వెళ్ళి అప్పుడే ప్రారంభమైన ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ 32 సంవత్సరాలపాటు నిలయ వాయులీన విద్వాంసుడిగా పనిచేశాడు. ఇతడి వాయులీన విద్యపై పాపా వెంకటరామయ్య ప్రభావం ఉంది.[2]

ఇతడు తిరువయ్యారు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో 40 సంవత్సరాలపాటు వరుసగా తన కచేరీ నిర్వహించాడు. ఇతడు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టైగర్ వరదాచారి, అరియకుడి రామానుజ అయ్యంగార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి విద్వాంసులకు వాద్య సహకారాన్ని అందించాడు. ఇతడు తన గురువు తిరుమకూడలు చౌడయ్య ప్రదర్శనలకు కూడా తన సహకారాన్ని అందించాడు.

1970లో ఇతడికి "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ కళైమామణి పురస్కారాన్ని ఇచ్చింది. [3] 1975లో బెంగళూరు గాయన సమాజ "సంగీత కళారత్న" బిరుదును ప్రదానం చేసింది. [4] 1989లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.

మూలాలు

మార్చు
  1. web master. "R. K. Venkatarama Sastry". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 31 March 2021.[permanent dead link]
  2. ఎడిటర్ (10 November 2017). "R K VENKATARAMA SASTRY". SRUTI.MAGAZINE. Retrieved 31 March 2021.
  3. web master. "Kamat Research Database". Kamat's Potpourri. Retrieved 31 March 2021.
  4. సంగీత కళారత్న అవార్డు గ్రహీతల జాబితా