ఆర్.భూపతిరెడ్డి
రేకులపల్లి భూపతిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ. ఆయన 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1]
ఆర్.భూపతిరెడ్డి | |||
మాజీ ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2015 నుండి 2019 | |||
నియోజకవర్గం | నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 12 ఫిబ్రవరి 1964 జలాల్పూర్, నిజామాబాద్ గ్రామీణ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాజారెడ్డి | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మతం | హిందూ |
జననం, విద్యాభాస్యం సవరించు
ఆర్.భూపతిరెడ్డి 1964 ఫిబ్రవరి 12లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ గ్రామీణ మండలం, జలాల్పూర్ గ్రామంలో రేకులపల్లి రాజారెడ్డి, లక్ష్మి దంపతులు జన్మించాడు. ఆయన హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాల నుండి ఎంఎస్ (ఆర్థో) పూర్తి చేశాడు. ఆయన 1996 లో నిజామాబాద్ ఖలీల్‌వాడిలో నర్సింగ్ హోం ఏర్పాటు చేసి ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేశాడు.[2]
రాజకీయ జీవితం సవరించు
డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఆయన 2001నుంచి 2009 వరకు నిజామాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా, 2009-2014 వరకు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశాడు. ఆయన 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 2018, సెప్టెంబరు 14న టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4] ఆయన 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆర్.భూపతిరెడ్డి 2019 జనవరి 16లో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ అయ్యాడు.[5][6]
మూలాలు సవరించు
- ↑ Sakshi (12 December 2015). "నిజామాబాద్ ఎమ్మెల్సీగా భూపతిరెడ్డి ఏకగ్రీవం". Sakshi. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
- ↑ Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
- ↑ The Hans India, Roja (14 September 2018). "TRS MLC Bhupathi Reddy joins Congress party". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
- ↑ Hindustan Times (16 January 2019). "3 TRS MLCs, who defected to Congress, disqualified from membership". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
- ↑ Sakshi (17 January 2019). "భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు". Sakshi. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.