ఆర్.యస్.సుదర్శనం తెలుగు భాషలో పేరెన్నికగన్న విమర్శకులలో ఒకడు[1]. ఈయన పాశ్చాత్య విమర్శ దృక్పథంతో విమర్శలు సాగించారు.[2]

జీవిత విశేషాలుసవరించు

ఆయన మదనపల్లెలో డిసెంబరు 13 1927 న జన్మించారు. ఆయన మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదలనపల్లె దివ్యజ్ఞాన కళాశాల లలో విద్యాభ్యాసం చేసారు.మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి 1947లో పట్టా పుచ్చుకున్నాడు. ప్రముఖ రచయిత్రి ఆర్.వసుంధరాదేవి ఇతని భార్య. వివిధ కళాశాలలలో అధ్యాపకునిగా, విభాగాధిపతిగా, ప్రిన్సిపాల్ గానూ పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత ఆయన 1986లో స్వంత ఊరైన మదనపల్లెలో శేష జీవితం గడిపి డిసెంబరు 14 2001 న కన్నుమూసారు.

ఉద్యోగ జీవితంసవరించు

ఆయన 1947లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో ట్యూటరుగా చేరారు.1947-48 మధ్య మచిలీపట్నం హిందూ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేసారు.1948-49 లో మదనపల్లెలో బెసెంట్ థియోసాఫికల్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసారు.1949-66 మధ్య ఆయన అనంతపురం, వరంగల్, నల్గొండ, చిత్తూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆంగ్ల అధ్యాపకునిగా, విభాగాధిపతిగా పనిచేశారు.1967-71 మధ్య విడవలూరు డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసారు. శ్రీ విశ్వనాథ సత్యన్నారాయణ గారికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారిని విడవలూరుకు ఆహ్వానించి వారి చిత్రపటం బహూకరించారు.ఆరుద్ర, పిలకా గణపతి శాస్త్రి, మహీధర రామమోహన్ వంటి ప్రముఖ సాహిత్యకారులను అక్కడి కళాశాలకు రప్పించి ఆ ఊరిలో సాంస్కృతిక వాతావరణం నెలకొల్పారు. 1971-73 చిత్తూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు.అప్పుడు కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించారు.1974-77 లో అనంతపురం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు.1977-85 లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా, రీజనల్ జాయింట్ డైరక్టరు ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గా పనిచేసి పదవీవిరమణ చేసారు[3].

అనువాదాలుసవరించు

నేషనల్ బుక్ ట్రస్టు, సాహిత్య అకాడమీల కోసం గోపబంధుదాస్, లక్ష్మీకాంత బెజ్జిరోవా ల మోనోగ్రాఫ్ లను తెలుగులోకి, చలం మోనోగ్రాఫ్ ను ఆంగ్లంలోని అనువాదం చేసారు. సి.ఆర్.రెడ్డి సెంటినరీ కొరకు వారి పీఠికలు, ఉపన్యాసాలు ఆంగ్లంలోనికి చేసి యిచ్చారు.

రచనలుసవరించు

 1. అనుబంధాలు (నవల) - 1958-ఆదర్శ గ్రంథ మండలి ప్రచురణ
 2. సంసారవృక్షం (నవల) - 1976 (ఎమెస్కో ప్రచురణ) [4]
 3. నిషాంతం (కవితలు) - 1970 (విశ్వనాథ సత్యనారాయణ గారిచే ప్రచురితం), 1975 (గుంటూరు శేషేంద్రశర్మ గారిచే), 1994 పునర్ముద్రణం.
 4. మళ్ళీ వసంతం (నవల) - 1969 అక్టోబరు - ఆగస్టు 86 లో పురర్ముద్రణ
 5. మధురమీనాక్షి కథలు -1981
 6. నూరు సమీక్షలు[5] - 1987 జనవరి
 7. సాహిత్యంలో దృక్పథాలు - 1968
 8. అసుర సంధ్య (నవల)
 9. కాలం తెచ్చిన మార్పు (కథలసంపుటి) - 1963 (ఎమెస్కో ప్రచురణ)
 10. జి.వి.చలం [6]
 11. కవిహృదయం[5] - 1988
 12. సాహిత్యనేపథ్యం[5] - 1983 జనవరి.
 13. సమాజం-సాహిత్యం (వ్యాసాలు) - 1972 అక్టోబరు

సంసార వృక్షం (ఇతర భాషల్లో)సవరించు

 • హిందీలో : మన్ కే బంధన్ (అప్పలరాజు గారు - ఆంధ్రా విశ్వవిద్యాలయం)
 • గుజరాతీ : వంశవృక్ష నవనీత్ మద్రాసీ
 • ఇంగ్లీషులో : The tree of love

సాహితీ సేవలుసవరించు

ఆయన 1960 నుండి 1990 వరకు భారతి, ఆంధ్రప్రభ వీక్లీ వంటి వివిధ పత్రికలకు వ్రాసిన పుస్తక సమీక్షలు సాహిత్య లోకంలో ఉన్నత స్థాయికి చెందినట్లుగా గుర్తింపు పొందాయి.ఎందరో రచయితల పుస్తకాలకు ముందుమాటలు, పీఠికలు వ్రాసారు.కొందరి కవితలు, కథలు ఆంగ్లంలోనికి అనువాదం చేసి యిచ్చారు. 2000 లో ప్రచురితమైన "జి.వి.చలం(జీవిత చరిత్ర)"కు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[7] ఆయనకు 1977 లో "సంసార వృక్షం" అనే పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

పత్రికలు, రేడియో కేంద్రాలు, సాహితీ పరుల ప్రశ్నావళిలో ఆయన అభిప్రాయాలు పలు సందర్భాలలో విశదీకరింపబడ్డాయి. విజయవాడ శారదా కళాశాల దశాబ్ది సంచికలోనూ, మే 1991 లో శ్రీవాణి పత్రికలో ప్రచురించిన "వేమన-అద్వైతం" అనే వ్యాసం విజ్ఞుల మెప్పు పొందింది. "concept of freedon in telugu romantic poetry" అన్న వ్యాసం తెలుగు విశ్వవిద్యాలయం 1989 ఎండోమెంతు లెక్చర్ విలువైనదిగా గుర్తించబడింది. ఆంధ్ర సచిత్ర వారపత్రిక వజ్రోత్సవ సంచికకు ఆయన వ్రాసిన చలం స్మృతి (19-08-1983) చక్కని జ్ఞాపిక.

అవార్డులుసవరించు

 • 1975 : రోటరీ క్లబ్, అనంతపురం.
 • 1977 : రోటరీ క్లబ్, రాజమండ్రి.
 • 1980 : బెస్ట్ టీచర్ అవార్డు ఫర్ కాలేజీ టీచర్స్.
 • 1975 : ఎ.పి సాహిత్య అకాడమీ వార్షిక బహూకృతులు (సమాజము-సాహిత్యము సాహిత్య విమర్శకు)
 • 1977 : సాహిత్య అకాడమీ పురస్కారం (సంసార వృక్షం నవలకు)
 • 1984 : మధుర మీనాక్షి కథలకు సాహిత్య్ అకాడమీ పురస్కారం.
 • 1984 : హితకారిణి సమాజము సత్కారము, రాజమండ్రి.

మూలాలుసవరించు

 1. "Portraits of literary personalities". SAROJINI PREMCHAND. The Hindu. Retrieved 25 May 2010. Cite news requires |newspaper= (help)
 2. సాహిత్యవిమర్శ-కవి-కావ్యం-సాక్షి పత్రిక(1/8/2015)
 3. "List of Regular Principals in government college,rajahmundry". మూలం నుండి 2015-08-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-12. Cite web requires |website= (help)
 4. The tree of life(a Novel)
 5. 5.0 5.1 5.2 "VimarSa - Visleshana". http://www.telupu.com/. Retrieved 10 August 2015. External link in |website= (help)
 6. G.V. Chalam (Makers Of Indian Literature)
 7. "sahitya-akademi/publications" (PDF). మూలం (PDF) నుండి 2013-11-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-12. Cite web requires |website= (help)

ఇతర లింకులుసవరించు