ఆర్.వి. దేశ్‌పాండే

రఘునాథ్ విశ్వనాథ్ దేశ్‌పాండే (జననం 1947 మార్చి 16) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తొమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య, హెచ్. డి. కుమారస్వామి మంత్రివర్గంలో రెవెన్యూ, పర్యాటక శాఖల మంత్రిగా పనిచేశాడు.[1]

రఘునాథ్ విశ్వనాథ్ దేశ్‌పాండే
ఆర్.వి. దేశ్‌పాండే


రెవెన్యూ శాఖ మంత్రి
పదవీ కాలం
8 జూన్ 2018 – 23 జులై 2019
ముందు కగోడు తిమ్మప్ప
తరువాత ఆర్. అశోక

పర్యాటక శాఖ
పదవీ కాలం
2013 – 2018
ముందు ఆనంద్ సింగ్
తరువాత ఎస్.ఆర్. మహేష్ ]]

ఎమ్మెల్యే
పదవీ కాలం
19 మే 2018 – ప్రస్తుతం
నియోజకవర్గం హలియాల్

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
2008 – 2010

వ్యక్తిగత వివరాలు

జననం (1947-03-16) 1947 మార్చి 16 (వయసు 77)
హాలియాల్, బొంబాయి ప్రెసిడెన్సీ,బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కర్ణాటక, భారతదేశం)
రాజకీయ పార్టీ కాంగ్రెస్

రాజకీయ జీవితం మార్చు

దేశ్‌పాండే కర్ణాటక స్టేట్ కో-ఆపరేటివ్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన జనతా పరివార్‌లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. దేశ్‌పాండే 1983లో హలియాల్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

దేశ్‌పాండే 1994 & 2004 & 2015 నుండి 2018 మధ్య 13 సంవత్సరాలు పరిశ్రమల, ఉన్నత విద్య, పర్యాటక, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశాడు.[3] ఆయన మధ్యతరహా, భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధికి, విద్య & పర్యాటక అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాడు. దేశ్‌పాండే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రత కోసం పర్యాటకం ట్రేడ్ ఫెసిలిటేషన్ యాక్ట్ పేరుతో కొత్త ముసాయిదాను రూపొందించాడు.[4][5]

మూలాలు మార్చు

  1. Eenadu (14 May 2023). "తొమ్మిదోసారీ.. ఆయనే". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. "Karnataka Election Results 2018: Congress' RV Deshpande recommended to be pro tem Speaker, says report". Firstpost. 18 May 2018. Retrieved 2018-05-18.
  3. "Minister's Profile". www.karnataka.gov.in. Archived from the original on 2016-12-17.
  4. Mohandas Pai to head Vision Group, boost tourism in state: Minister Deshpande | Deccan Chronicle Archived 2015-12-22 at the Wayback Machine. Archives.deccanchronicle.com (2013-09-04). Retrieved on 2015-12-20.
  5. Why did Hegde go to Delhi, asks Patel