ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 & 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆళ్ల రామకృష్ణా రెడ్డి
ఆళ్ల రామకృష్ణారెడ్డి


శాసన సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 నుండి 11 డిసెంబర్ 2023[1]
నియోజకవర్గం మంగళగిరి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1974
పెదకాకాని, గుంటూరు జిల్లా
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ఆళ్ల రమా
బంధువులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం & గ్రామంలో1968లో దశరథరామిరెడ్డి, [2] వీరరాఘవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన గుంటూరు ఎసి కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆయనకు సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయనకు 2019 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేశ్ పై 5337 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019 జూన్లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) కు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[4]

ఆళ్ల రామకృష్ణారెడ్డి 2023 డిసెంబర్ 10న ఎమ్మెల్యే పదవికి వైసీపీకి రాజీనామా చేసి[5] 2024 జనవరి 21న విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6] ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిబ్రవరి 20న వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[7]

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (11 December 2023). "వైసీపీకి ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాకు అసలు కారణమిదే..." Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  2. Sakshi (3 September 2020). "ఎమ్మెల్యే ఆర్కేకు పితృ వియోగం". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  3. India Today (2019). "Andhra Assembly polls: TDP's Nara Lokesh loses to YSR Congress's Ramakrishna Reddy" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-06. Retrieved 6 July 2021.
  4. Mana Telangana (14 June 2019). "సిఆర్‌డిఎ చైర్మన్ గా ఆళ్ల రామకృష్ణారెడ్డి". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  5. Eenadu (11 December 2023). "మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  6. Prajasakti (22 January 2024). "కాంగ్రెస్‌లోకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి - Prajasakti". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  7. Eenadu (20 February 2024). "తిరిగి వైకాపాలో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.