ప్రధాన మెనూను తెరువు

నారా లోకేశ్ (జననం 23 జనవరి 1983) భారతీయ రాజకీయనాయకుడు మరియు వ్యాపారవేత్త. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర "సాంకేతిక పరిజ్ఞాన, పంచయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించిన మాజీ మంత్రివర్యులు. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడును మాజీ ముఖ్యమంత్రియు తెలుగు చలనచిత్ర నటుడును నైన ఎన్.టి.రామారావు యొక్క మనుమడు.[3] తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకమును ఆయన అభివృద్ధి చేశారు. నారా లోకేశ్ మొట్టమొదట పార్టీలోనికి మే 2013లో చేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు.[4][5]. ఇతడు హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్ గా పనిచేసాడు.

నారా లోకేష్
నారా లోకేశ్

నారా లోకేష్


ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ మరియు ఐటి మంత్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పంచయత్ రాజ్ మరియు రూరల్ డెవలప్‌మెంటు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2 April 2017

వ్యక్తిగత వివరాలు

జననం (1983-01-23) 1983 జనవరి 23 (వయస్సు: 36  సంవత్సరాలు)
హైదరాబాదు, భారతదేశం
(now in Telangana, India)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నారా చంద్రబాబునాయుడు (తండ్రి)
నారా భువనేశ్వరి (తల్లి)
జీవిత భాగస్వామి నారా బ్రహ్మణి
సంతానము నారా దేవాన్ష్(ఏకైక కొడుకు) [1][2]
నివాసము అమరావతి, భారతదేశం
హైదరాబాదు, భారతదేశం
పూర్వ విద్యార్థి m:en:Carnegie Mellon University (B.Sc.)
m:en:Stanford Graduate School of Business (ఎంబిఎ)
వృత్తి వ్యాపారి, రాజకీయవేత్త
మతం హిందూమతము
వెబ్‌సైటు www.naralokesh.com

ప్రారంభ జీవితంసవరించు

నారా లోకేశ్ జనవరి 23, 1983 న జన్మించాడు. ఆయన నారా చంద్రబాబునాయుడు మరియు భువనేశ్వరిల యొక్క ఏకైక కుమారుడు. ఆయన స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశాడు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసాడు.

రాజకీయ జీవితంసవరించు

ఆయన మార్చి 30, 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైనాడు. మంత్రి పదవిని చేబట్టెను. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి తన ప్రత్యర్థియు వై.కా.పా. అభ్యర్థియునైన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోకేశ్ యొక్క శాసనమండలి సభ్యత్వము 2023-వ సంవత్సరము వరకునున్నది.

అభివృద్ధి మరియు సంక్షేమ నమూనాలుసవరించు

ఆయన ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్టు లోని హెల్త్ కేర్, విద్య యొక్క ట్రస్టీలలో ఒకరు.

ఆరోగ్య సంరక్షణసవరించు

లోకేష్ ట్రస్టులో ఆరోగ్యసంరక్షణ కార్యక్రమాన్ని రూపకల్పన చేసాడు. దీనిని పేద ప్రజలు, వారి ఆరోగ్యంపై శ్రద్ద తీసుకొనుటకు, వారి అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలను అందించుటకు ఉపయోగపడే కార్యక్రమం గా రూపొందించారు. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం. ఆయన రక్త నిధులు (బ్లడ్ బ్యాంకులు), హెల్త్ క్యాంపులు (మొబైల్ క్లినిక్స్ మరియు నేత్ర శిబిరాలు) నిర్వహిస్తున్నాడు.

సాంకేతిక పరిజ్ఞానంసవరించు

ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మంత్రిగా [6] ఎనిమిది ఐ.టి కంపెనీలను ప్రారంభించాడు.[7]

వ్యక్తిగత జీవితంసవరించు

2007 లో ఇతను తన మామ అయిన నందమూరి బాలకృష్ణ ప్రథమ పుత్రిక అయిన నందమూరి బ్రాహ్మణిని పెళ్ళాడెను.[8]

పురస్కారాలుసవరించు

  • 2018 : పరిపాలనలో సృజనాత్మక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేవారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారం.[9][10]

మూలాలుసవరించు

  1. "Lokesh names kid 'Devansh'". sakshipost.coms. 28 May 2015. Retrieved 28 May 2015. Cite web requires |website= (help)
  2. "Nara Lokesh Son Name Devaansh". page3hyd.in. 28 May 2015. Retrieved 28 May 2015. Cite web requires |website= (help)
  3. http://www.firstpost.com/politics/nara-lokesh-inducted-into-ap-cabinet-chandrababu-naidus-son-is-latest-chapter-of-indias-dynastic-politics-3366358.html
  4. Indian Express TDP chief Chandrababu Naidu's son Nara Lokesh joins politics 28 May 2013 "Andhra Pradesh politics witnessed another son-rise on Monday with Nara Lokesh, son of Telugu Desam Party president Nara Chandrababu Naidu, being formally inducted into the party. He was introduced into the party at TDP's two-day gathering 'Mahanadu' at Gandipet on the outskirts of Hyderabad. Lokesh has been heading "The Cadre Welfare Wing" of the Party from June 2014.
  5. The Hindu: Nara Lokesh hogs the limelight 28 May 2013
  6. http://indianexpress.com/article/india/andhra-pradesh-portfolios-allocated-to-new-ministers-lokesh-gets-it-and-panchayati-raj-4598001/
  7. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-08-23/Nara-Lokesh-to-open-8-IT-companies-in-Vizag/321151
  8. Janyala, Sreenivas (16 February 2009). "Their fathers' sons". The Indian Express. Retrieved 15 April 2014.
  9. Reporter, Staff (2018-01-20). "Lokesh receives innovation in governance award". The Hindu (ఆంగ్లం లో). ISSN 0971-751X. Retrieved 2018-01-21.
  10. "Lokesh bags Kalam Innovation Award". The Hans India (ఆంగ్లం లో). Retrieved 2018-01-21.

బయటి లంకెలుసవరించు