ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 16 సెప్టెంబర్ 2022న విడుదలైంది.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి | |
---|---|
దర్శకత్వం | ఇంద్రగంటి మోహన కృష్ణ |
రచన | ఇంద్రగంటి మోహన కృష్ణ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | పి.జి విందా |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | వివేక్ సాగర్ |
నిర్మాణ సంస్థలు | బెంచ్‌మార్క్ స్టూడియోస్ మైత్రి మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 2022 సెప్టెంబర్ 16 |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమా షూటింగ్ 2021 జనవరి 5న హైదరాబాద్‌లో ప్రారంభమైంది.[2] ఈ సినిమాకి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే పేరును 2021 మార్చిలో ఖరారు చేసి, 2022 జనవరి 1న సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి,[3] 2022 జనవరి 23న టీజర్‌ను విడుదల చేశారు.[4]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: బెంచ్‌మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్
- నిర్మాత: బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇంద్రగంటి మోహన కృష్ణ[7]
- సంగీతం: వివేక్ సాగర్
- సినిమాటోగ్రఫీ: పి.జి విందా
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
- ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
- పాటలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
పాటల జాబితా
మార్చు1': కొత్త కొత్తగా , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.చిత్ర అంబడిపూడి , అభయ్ జోద్ పుర్కార్
2: మీరే హీరోలా , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.విజయ్ ప్రకాష్ , హేమచంద్ర, అనురాగ్ కులకర్ణి, బాలాజి దకే , విష్ణుప్రియ
3: ఆ మెరుపేమిటో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.అనురాగ్ కులకర్ణి.
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (2 March 2021). "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!". Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
- ↑ Sakshi (5 January 2021). "మూడో సినిమాకి ముహూర్తం". Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
- ↑ A. B. P. (1 January 2022). "ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు". Archived from the original on 1 January 2022. Retrieved 25 January 2022.
- ↑ Eenadu (23 January 2022). "నన్ను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా". Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
- ↑ 10TV (1 March 2021). "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" (in telugu). Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV (1 July 2021). "షూటింగ్ లో జాయిన్ అయిన కృతి శెట్టి!". Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
- ↑ TV9 Telugu (2 January 2022). "ప్రతి సినిమాకు కొత్తగా కథ చెప్పాలని ప్రయత్నిస్తా : ఇంద్రగంటి మోహనకృష్ణ". Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)