ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, మాధవి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ, పి. ఎల్. నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు నటించారు.[2] ఇది దర్శకుడిగా కోడి రామకృష్ణకు, నటుడిగా గొల్లపూడి మారుతీ రావుకు తొలిచిత్రం.[2] ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించాడు.
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య | |
---|---|
![]() | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాత | కె.రాఘవ |
రచన | కోడి రామకృష్ణ (కథ, స్క్రీన్ ప్లే) గొల్లపూడి మారుతీరావు (సంభాషణలు) |
నటులు | చిరంజీవి, మాధవి, పూర్ణిమ |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | |
విడుదల | ఏప్రిల్ 23, 1982[1] |
నిడివి | 2 గంటల 15 నిమిషాలు |
భాష | తెలుగు |
కథసవరించు
రాజశేఖరం ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి) తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల ప్రవర్తన గల సుబ్బారావు జయలక్ష్మి మీద కన్నేస్తాడు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధాన కథ.
తారాగణంసవరించు
- రాజశేఖరంగా చిరంజీవి
- జయలక్ష్మిగా మాధవి
- చిట్టితల్లిగా పూర్ణిమ
- సుబ్బారావుగా గొల్లపూడి మారుతీరావు
- సీతగా సంగీత
- జయలక్ష్మి తండ్రిగా పి. ఎల్. నారాయణ
ఫలితంసవరించు
ఈ చిత్రం 8 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.[1]
పాటలుసవరించు
పాట | పాడినవారు | రచన |
---|---|---|
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య | బాలు | |
ఒక వనిత నవ ముదిత | బాలు | |
వచ్చే వచ్చే వయసు జల్లు | బాలు, సుశీల | |
స్వామి శరణం అయ్యప్ప | ||
సీతారాముల ఆదర్శం | బాలు | |
పలికేది వేద మంత్రం |
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "38 సంవత్సరాల 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య". సితార. Retrieved 2020-06-08.
- ↑ 2.0 2.1 శ్రీ, అట్లూరి. "Intlo Ramayya Veedhilo Krishnayya (1982)". telugucinema.com. Retrieved 18 October 2016.