రాధిక (నటి)
సినీ నటి, నిర్మాత
రాధిక శరత్ కుమార్ ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందినది. రాధిక 1963 ఆగష్టు 21న జన్మించింది. ఈమె మూడుసార్లు వివాహము చేసుకున్నది. ఈమెకు మొదట తమిళనటుడు ప్రతాప్ పోతన్ తో 1985లో వివాహమైంది. రెండేళ్ల తరువాత విడిపోయి 1990లో రిచర్డ్ హార్డీతో జరిగిన రెండో వివాహం ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురు ఉన్నది. ఆ తరువాత సహనటుడు శరత్ కుమార్ ను 2001లో మూడో వివాహము చేసుకున్నది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు.
రాధిక శరత్‌కుమార్ | |
---|---|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1978–1990, 1993–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 4 |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
|
‘ఉమెన్స్ సెలెబ్రేషన్స్-2022’ పురస్కారం యూకే పార్లమెంట్ రాధికకు అందచేసింది.[3]
రాధిక నటించిన తెలుగు సినిమాల జాబితా
మార్చు- చిలిపి వయసు (1980)
- యువతరం కదిలింది (1980)
- కిరాయి రౌడీలు (1981)
- డబ్బు డబ్బు డబ్బు (1981)
- న్యాయం కావాలి (1981)
- ప్రియ (1981)
- రాధా కల్యాణం (1981)
- ఇది పెళ్లంటారా? (1982)
- ఈనాడు (1982)
- ఏవండోయ్ శ్రీమతి గారు (1982)
- కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి (1982)
- త్రిశూలం (1982)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- పన్నీరు పుష్పాలు (1982)
- మొండిఘటం (1982)
- యమకింకరుడు (1982)
- వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
- అభిలాష (1983)
- గూఢచారి నెం.1 (1983)
- చిలక జోస్యం (1983)
- తోడు నీడ (1983)
- పల్లెటూరి మొనగాడు (1983)
- పెంకిఘటం (1983)
- ప్రేమ పిచ్చోళ్ళు (1983)
- బెజవాడ బెబ్బులి (1983)
- ముగ్గురు మొనగాళ్ళు (1983)
- మూడు ముళ్ళు (1983)
- రాజు రాణీ జాకి (1983)
- శివుడు శివుడు శివుడు (1983)
- అనుబంధం (1984)
- అభిమన్యుడు (1984)
- కొండవీటి నాగులు (1984)
- బాబులుగాడి దెబ్బ (1984)
- యుద్ధం (1984)
- శ్రీమతి కావాలి (1984)
- ఇల్లాలే దేవత (1985)
- జ్వాల (1985)
- మాంగల్య బలం (1985)
- రగిలేగుండెలు (1985)
- స్వాతిముత్యం (1985)
- ఉక్కుమనిషి (1986)
- కోటిగాడు (1986)
- చల్లని రామయ్య చక్కని సీతమ్మ (1986)
- జీవన పోరాటం (1986)
- జైలుపక్షి (1986)
- బంధం (1986)
- రావణబ్రహ్మ (1986)
- అమెరికా అబ్బాయి (1987)
- ఉమ్మడి మొగుడు (1987)
- ఓ ప్రేమ కథ (1987)
- కార్తీక పౌర్ణమి (1987)
- దొంగ మొగుడు (1987)
- నేనే రాజు – నేనే మంత్రి (1987)
- రౌడీ పోలీస్ (1987)
- సర్దార్ ధర్మన్న (1987)
- అన్నా చెల్లెలు (1988)
- ఆణిముత్యం (1988)
- ధర్మతేజ (1988)
- పగలే వెన్నెల (1989)
- మా ఇంటి కృష్ణుడు (1990)
- ఓ పాపా లాలి (1991)
- కాలేజీ బుల్లోడు (1992)
- బలరామకృష్ణులు(1992)
- స్వాతి కిరణం (1992)
- పలనాటి పౌరుషం (1994)
- కుర్రాడు బాబోయ్ (1995)
- శాస్త్రి (1995)
- కోనసీమ మొనగాడు (1996)
- కుటుంబ గౌరవం (1997)
- వంశోద్ధారకుడు (1997)
- ఆరో ప్రాణం (1997)
- జీన్స్ (1997)
- సూర్య వంశం (1998)
- ప్రేమకథ (1999)
- శకుని (2012)
- జీనియస్ (2012)
- పూజ (2014)
- రాజా ది గ్రేట్ (2017)
- కృష్ణ వ్రింద విహారి (2022)
- లవ్ టుడే (2022)
- కోస్టి (2023)
- ధ్రువ నక్షత్రం (2023)
- ఆదికేశవ (2023)
- ఆపరేషన్ రావణ్ (2024)
వెబ్ సిరీస్
మార్చు- గాలివాన (2022)
మూలాలు
మార్చు- ↑ "Heroines who fell for their directors". The Times of India. Retrieved 5 August 2021.
- ↑ "Tamil celebrities who married more than once". The Times of India. Retrieved 5 August 2021.
- ↑ "యూకే పార్లమెంటులో రాధికకు పురస్కారం". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-23. Retrieved 2022-04-23.[permanent dead link]