ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భోపాల్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భోపాల్ (ఐఐఐటీ భోపాల్, ట్రిపుల్ ఐటీ భోపాల్) అనేది మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా లాభాపేక్ష లేని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా క్రింద స్థాపించబడిన 20 ఐఐఐటీలలో ఇదీ ఒకటి.
నినాదం | విద్యాయామృతమశ్నుతే |
---|---|
రకం | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం |
స్థాపితం | 2017 |
డైరక్టరు | ప్రొ. రామ. ఎస్.వర్మ |
స్థానం | భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం 23°13′01″N 77°24′29″E / 23.217°N 77.408°E |
కాంపస్ | పట్టణ |
చరిత్ర
మార్చుభారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 2017లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలో భాగంగా ఈ ఐఐఐటీ రాయచూర్‌ను స్థాపించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు, 2020 ప్రకారం భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది. 2020 మార్చి 20న లోక్‌సభలో, 2020 సెప్టెంబరు 22 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది.[1][2]
ప్రాంగణం
మార్చుప్రస్తుతం ఇది మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో పనిచేస్తుండగా, శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం 50 ఎకరాల భూమి గుర్తించబడింది.[3]
పరిపాలన
మార్చుప్రొ. రామ. ఎస్. వర్మ ఈ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు.[4]
కోర్సుల వివరాలు
మార్చుఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సైన్స్, ఇంజినీరింగ్‌లో ప్రావీణ్యత సాధించేందుకు ఈ ఇన్‌స్టిట్యూట్ లో శిక్షణ అందించబడుతుంది.
బిటెక్ కోర్సులు
మార్చు- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మూలాలు
మార్చు- ↑ "Parliament passes IIIT amendment bill, giving national importance tag to five new institutes". The Times of India. 2020-09-22. ISSN 0971-8257. Archived from the original on 2022-09-01. Retrieved 2023-02-04.
- ↑ "IIIT Laws (Amendment) Bill 2020 passed in Rajya Sabha; know about the bill". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2023-02-04.
- ↑ "Institute of Information Technology Bhopal". Mapit.gov.in. Archived from the original on 2018-10-06. Retrieved 2023-02-04.
- ↑ "About Us/Director's Desk". www.iiitbhopal.ac.in. Retrieved 2023-01-04.