ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాయచూర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాయచూర్ (ఐఐఐటీ రాయచూర్, ట్రిపుల్ ఐటీ రాయచూర్) అనేది కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, కర్నాటక ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ సంస్థ ఏర్పాటుచేయబడింది.
రకం | ఐఐఐటీ |
---|---|
స్థాపితం | 2019 |
మాతృ సంస్థ | ఐఐటీ హైదరాబాద్ |
డైరక్టరు | ప్రొ. బూదరాజు శ్రీనివాస మూర్తి (మెంటర్) |
విద్యార్థులు | 56 |
చిరునామ | ఐఐటీ హైదరాబాద్, సంగారెడ్డి, తెలంగాణ, భారతదేశం 16°12′N 77°22′E / 16.2°N 77.37°E |
చరిత్ర
మార్చుభారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 2019లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలో భాగంగా ఈ ఐఐఐటీ రాయచూర్‌ను స్థాపించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు, 2020 ప్రకారం భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది. 2020 మార్చి 20న లోక్‌సభలో, 2020 సెప్టెంబరు 22 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది.[1][2] ఐఐఐటీ రాయచూర్ 2019 జూలై 26న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) లో తాత్కాలిక క్యాంపస్ నుండి పనిచేయడం ప్రారంభించింది. బూదరాజు శ్రీనివాస మూర్తి మెంటర్ డైరెక్టర్‌గా, ఐఐఐటీ హైదరాబాద్ మెంటార్ ఇన్స్టిట్యూట్గా ఉన్నాడు.[3]
ప్రాంగణం
మార్చుఅన్ని అకడమిక్, కరిక్యులర్ కార్యకలాపాలు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో జరుగుతాయి. విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌లోని హాస్టళ్ళలో ఉంటున్నారు.[4]
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాయచూర్‌లో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి 60 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. ఐఐఐటీ రాయచూర్ కోసం మాస్టర్ ప్లాన్, అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఫ్యాకల్టీ & స్టాఫ్ హౌసింగ్, స్టూడెంట్ హాస్టల్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సంబంధిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం సమగ్ర ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్యాకేజీ కోసం ఆర్కిటెక్ట్ నియామకానికి సంస్థ టెండర్‌ను ఆహ్వానించింది.[5]
విద్య
మార్చువిద్యా కార్యక్రమాలు
మార్చుఐఐఐటీ రాయచూర్ 30 మంది విద్యార్థులతో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బిటెక్ కోర్సును అందిస్తోంది.[6] మొదటి సంవత్సరం నుండి అధునాతన కోర్సులకు ప్రాధాన్యతలో కూడిన పాఠ్యాంశాలను కలిగి ఉంది. కంప్యూటర్ సైన్స్ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సమానంగా విద్యార్థులకు అధునాతన విద్యను అందిస్తోంది.
ప్రవేశం
మార్చుఉమ్మడి ప్రవేశ పరీక్ష మెయిన్స్ ద్వారా ఇక్కడి బిటెక్ కోర్సులోని 30 సీట్లకు అడ్మిషన్లు జరుగుతాయి.
విద్యార్థి జీవితం
మార్చుఐఐఐటీ రాయచూర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలకోసం క్లబ్‌లు ఉన్నాయి. విద్యాపరమైన అభివృద్ధితోపాటు విద్యార్థులలో సాంస్కృతిక అభివృద్ధిని పెంచే లక్ష్యంతో వీటిని ఏర్పాటుచేశారు.
మూలాలు
మార్చు- ↑ "Parliament passes IIIT amendment bill, giving national importance tag to five new institutes". The Times of India. 2020-09-22. ISSN 0971-8257. Archived from the original on 2022-09-01. Retrieved 2023-02-04.
- ↑ "IIIT Laws (Amendment) Bill 2020 passed in Rajya Sabha; know about the bill". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2023-02-02.
- ↑ "Indian institute of information technology, (IIIT), Raichur - Courses, Fees, Placements & Apply".
- ↑ https://collegedunia.com/college/60079-indian-institute-of-information-technology-iiit-raichur
- ↑ "Indian Institute of Information Technology [IIIT], Raichur: Courses, Fees, Placements".
- ↑ "IIIT Raichur: Courses, Fees, Placements, Ranking 2022".