ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల

విశాఖపట్టణంలోని కంబాలకొండ రక్షిత అరణ్యంలోని జంతు ప్రదర్శనశాల

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల (ఆగ్లం: Indira Gandhi Zoological park) విశాఖపట్టణములోని కంబాలకొండ రక్షిత అరణ్యంలో గల ఒక చూడవలసిన ప్రదేశము.

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో హిప్పో
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలోని నిశాచర ప్రాణి కేంద్రంలో ముళ్ళపంది
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో ఎలుగుబంట్లు

ఇది మే 19, 1977.[1]లో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేత ప్రారంభింపబడినది. ఇందులో ఇంచుమించు 800 వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. ఇది విశాఖపట్టణం రైల్వేస్టేషను నుండి 10 కి.మీ. దూరంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నది.

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో ఘరియాల్ (మొసలి)

తూర్పు కనుమలలోని పక్షుల కోసం ప్రత్యేక విభాగాన్ని 1982లో ప్రముఖ శాస్త్రవేత్త సలీమ్ ఆలీ ప్రారంభించారు.

ఇందులోని జంతువులు, పక్షులు సవరించు

దీనిలోని 80 జాతులు చెందిన 800 జంతువులున్నాయి.

 
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో తెల్లపులి

కొత్త నేస్తాలు సవరించు

శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల, తిరుపతి నుంచి 2022 మార్చి 17న గ్రే జంగిల్‌ పౌల్‌, వైల్డ్‌ డాగ్‌, అడవి దున్న, చౌసింగ్‌ లను ఇక్కడకు తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్‌ నందినీ సలారియా తెలిపారు. ఇక్కడి నుంచి హైనా, అడవిదున్న, నక్కలను తిరుపతి జూకు తరలించామన్నారు.[2]

రవాణా సౌకర్యాలు సవరించు

విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను నుండి 11 కి.మీ దూరంలో జాతీయ రహదారి 16 మార్గంలో యందాడ సమీపంలో వుంది. ప్రవేశ ద్వారం, నిర్గమన ద్వారాలలో ఒకటి జాతీయ రహదారి వైపు, రెండవది బీచ్ రహదారివైపు సాగర నగర్ దగ్గర వున్నాయి. సోమవారం తప్ప ఇతర రోజులలో సందర్శకులను అనుమితిస్తారు.

మూలాలు సవరించు

  1. "APForest dept". Archived from the original on 2007-07-11. Retrieved 2007-11-18.
  2. "'జూ'లోకి కొత్త నేస్తాలు రాక". EENADU. Retrieved 2022-03-18.

ఇవి కూడా చూడండి సవరించు

బయటి లింకులు సవరించు