మొసలి లేదా మకరం (ఆంగ్లం: Crocodile) సరీసృపాల జాతికి చెందిన ఒక జంతువు. ఇది "క్రోకడైలిడే" అనబడే కుటుంబానికి చెందినది. స్థూలంగా దీనిని క్రోకడీలియా ("Crocodilia") అనే క్రమంలో వర్గీకరస్తారు. మొసళ్ళు, ఎలిగేటర్లు, కైమన్లు, ఘారియల్ అనే జంతువులు ఈ "క్రోకడీలియా" అనే క్రమంలోకే చెందుతాయి. ఒకోమారు పురాతన యుగపు మొసలి జాతి జంతువులను కూడా ఈ వర్గంలో కలిపి కూడా ఈ వర్గంలో కలిపి "క్రోకడైలోమర్ఫా" అనే క్రమం‌గా వ్యవహరిస్తారు.

మొసళ్ళు
Temporal range: Late Cretaceous - Recent
నైల్ మొసలి
Scientific classification
Kingdom:
Phylum:
(unranked):
Class:
Order:
Family:
క్రోకడైలిడే

ప్రజాతులు

మొసళ్ళు ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలో ఉష్ణమండలపు తేమ ప్రాంతాలలో ఉండే పెద్ద జలచరాలుగా జీవించే సరీసృపాలు. అధికంగా ఇవి సరస్సులు, నదులు వంటి మంచి నీటి స్థలాలలోను, అరుదుగా ఉప్పునీటి కయ్యలలోను ఉంటుంటాయి. చేపలు, ఇతర ప్రాకే జంతువులు, క్షీరదాలు వంటి వెన్నెముక ఉన్న జంతువులు వీటికి ముఖ్యమైన ఆహారం. కొన్ని జాతి మొసళ్ళు వెన్నెముక లేని మొలస్కా జీవులను కూడా తింటాయి.

Distrubition of crocodiles

మొసలి భూమిమీద చాలా పురాయుగంనుండి, అనగా డైనోసార్‌ల కాలం నుండి ఉన్నాయి. మొసళ్ళు భూమిమీద 200 మిలియన్ సంవత్సరాల క్రితంనుండి ఉన్నాయని అంచనా. డైనోసార్‌లు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించాయి. అప్పటినుండి కూడా మొసళ్ళ శరీరనిర్మాణంలో పెద్దగా మార్పులు ఏవీ వచ్చినట్లు లేదు. భూమి మీద మరెన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది.[1]

వర్ణన

మార్చు
 
డైనోసార్‌లకు లాగానే మొసళ్ళకు కూడా ఉదరంలోని పక్కటెముకలు gastraliaగా రూపాతరం చెందాయి.

మొసళ్ళు చాలా పురాయుగానికి చెందిన జంతువు లయినప్పటికీ వాటి శరీర నిర్మాణంలో చాలా క్లిష్టత ఉంది. అవి నీటిలో కదలేందుకు వాడే కండరాలను శ్వాసపీల్చడానికి కూడా వాడుతాయి.(ఉదా. ఉదరవితానం మాదిరిగా),[2] వీటికి మెదడులో కార్టెక్స్, నాలుగు గదులున్న గుండె ఉన్నాయి. వాటి శరీర నిర్మాణం నీటిలో వేగంగా కదలడానికీ, ఇతర జంతువులను సులువుగా వేటాడడానికీ అనుకూలంగా ఉంది. ఈదేప్పుడు అవి తమ కాళ్ళను ప్రక్కభాగంలో ముడుచుకోవడం ద్వారా నీటి అవరోధాన్నితగ్గించి వేగంగా ఈద గలుగుతాయి. పాదాలను వెడల్పుగా విస్తరించడం ద్వారా నీటిలో మలుపులు తిరగడం సాధ్యమవుతుంది. అవే పాదాలు నీరు తక్కువ ఉన్నచోట్ల నడవడానికి ఉపయోగపడుతాయి.

మొసళ్ళ నోటి వెనుక భాగంలో ఉన్న గట్టి కణాల తెర నీటిని నోటిలోపలికి వెళ్ళకుండా ఆపుతుంది. ముక్కు రంధ్రాల నుండి నోటి ప్రక్కగా శ్వాసావయవాలకు మార్గం ఉంది. నీటిలో మునిగినపుడు వీటి ముక్కు రంద్రాలు మూసుకుంటాయి. Like other archosaurs, crocodilians are diapsid, although their post-temporal fenestrae are reduced. The walls of the braincase are bony but they lack supratemporal and postfrontal bones.[1] మొసళ్ళ శరీరంపైనున్న పొలుసులలో సూక్ష్మమైన రంధ్రాలున్నాయి. ఈ సూక్ష్మరంధ్రాల ద్వారా వాటికి ప్పర్శజ్ఞానం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి పొలుసులు వాటి పై, క్రింది దవడలపైన ఉన్నాయి. అక్కడి రంధ్రాల ద్వారా మట్టిని వదిలించే రసాలు ఉత్పాదన అవుతాయని కూడా ఒక అభిప్రాయం ఉంది.[1]

 
మెక్సికోలో "లా మజనిల్లా"లో అమెరికన్ మొసళ్ళు

కొద్ది దూరాల ప్రయాణంలో మొసళ్ళు వేగంగానే కదలగలవు. వాటి దవడలు చాలా శక్తివంతమైనవి. వాటి నోటికి అందిన జంతువులను పటపట విరిచేసే శక్తి ఈ దవడల ద్వారా వాటికి లభిస్తుంది. అన్ని జంతువుల కంటే మొసళ్ళ దవడల బలం చాలా ఎక్కువ. దాని నోటిపట్టు చదరపు అంగుళానికి 5,000 పౌండుల బలాన్ని కలిగిస్తుంది. [3] దీనితో పోలిస్తే షార్క్ నోటి పట్టులో 400 psi, హైనా నోటిపట్టులో 800 నుండి 1,000 psi బలం ఉంటాయి. మొసళ్ళ పళ్ళు చాలా పదునైన రంపాలలాగా ఉంటాయి. చేపలను ముక్కలు ముక్కలుగా చేయడానికి వీలైనవి. పరిణామ క్రమంలో వేటను ఇంత బలంగా పట్టుకోవడానికి రూపొందిన మొసళ్ళ దవడ కండరాలకు నోటిని తెరిచేప్పుడు లభించే శక్తి మాత్రం చాలా తక్కువ. వాటి నోరు గట్టిగా మూసి పట్టుకొంటే అవి నోరు తెరువలేవు. ఈ లక్షణం అవకాశంగా తీసుకొని మొసళ్ళను రవాణా చేసేటప్పుడు ఒక టేప్‌తో లేదా రబ్బరు ట్యూబ్ ముక్కతో వాటి నోటిని మూసేస్తారు. మొసళ్ళ కాలి గోరులు కూడా చాలా పదునైనవి, బలమైనవి. వాటి మెడ కొద్దిగా మాత్రమే అటూ ఇటూ తిరగ గలదు.

 
ఆస్ట్రేలియాలో కట్టడిలో పెంచబడుతున్న ఒక ఉప్పునీటి మొసలి
 
మొసలిపై ఎక్కినట్లున్న Theodore of Amasea విగ్రహం - వెనిస్, ఇటలీ)
జీవితకాలం

మొసళ్ళు ఎంత కాలం జీవిస్తాయనే విషయంపై నిర్దిష్టమైన అధ్యయనం కష్టం. సంవత్సరానికి ఒకమారు వాటి పళ్ళు, ఎముకలపై ఏర్పడే రింగు గుర్తుల ద్వారా కొన్ని అంచనాలు వేయబడ్డాయి.[4] పెద్ద జాతికి చెందిన C. porosus అనే మొసళ్ళు షుమారు 70 సంవత్సరాలు బ్రతుకుతాయని అంచనా వేశారు. కొన్ని మొసళ్ళు బహుశా 100 సంవత్సరాలు దాకా బ్రతుకగలిగి ఉండవచ్చును. రష్యాలో ఒక జంతు ప్రదర్శనశాలలో ఒక మొసలి 100 సంవత్సరాలు పైన బ్రతికింది. ఆస్ట్రేలియాలో ఒక జంతు ప్రదర్శన శాలలోని మొసలి వయస్సు 130 సంవత్సరాలని అంచనా. దానిని "Mr. Freshy" అని పిలుస్తారు. వేటగాళ్ళ బారినుండి తప్పించడానికి దానిని పట్టుకొనేసరికే వేటగాళ్ళ కారణంగా దాని కుడికన్ను పోయింది. [5]

పరిమాణం

వివిధ జాతుల మొసళ్ళ సైజులు వివిధంగా ఉంటాయి. Palaeosuchus, Osteolaemus జాతికి చెందినవి 1 నుండి 1.5 మీటర్ల కంటే ఎక్కువ పెరగవు. పెద్ద జాతులు 4.85 మీటర్లు (16 అడుగులు) దాకా పెరుగుతాయి. వాటి బరువు 1200 కే.జి.లు (2,640 పౌండ్లు) పైబడి ఉంటుంది. ఇంత పెద్దవైన మొసళ్ళు పుట్టినపుడు షుమారు 20 సెంటీమీటర్లు (8 అంగుళాలు) మాత్రమే ఉంటాయి.

ఉత్తర ఆస్ట్రేలియా ఉప్పునీటి కయ్యలలోని మొసళ్ళు అన్నింటికంటే పెద్ద సైజు ఉంటాయి. ఇప్పటికి నమోదైన అతి పెద్ద మొసలి పొడవు 8.6 మీటర్లు (28.2 అడుగులు). బరువు 1352 కిలోగ్రాములు. ఇది 1957లో వేటలో చంపబడింది. దీని నమూనా ఒకటి పర్యాటక ఆకర్షణగా పెట్టారు.[6]. బ్రతికి ఉన్న మొసళ్ళలో అతి పెద్దది ఒరిస్సాలో "భైతర్కనికా వన్యప్రాణి సంరక్షణావనం ("Bhitarkanika Wildlife Sanctuary")లో ఉంది. దీని పొడవు 7.1 మిటర్లు (25.3 అడుగులు). ఇది జూన్ 2006లో గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది.[7]

ఆఫ్రికాలో రుజిజీ నదిలో ఉన్న గుస్టావే అని పిలువబడే మొసలి కూడా చాలా పెద్దది. ఇది 20 - 30 అడుగుల పొడవు ఉండవచ్చును. ఇది 300 పైగా మనుషుల మరణానికి కారణం. ఒక హిప్పోపోటమస్‌ను పూర్తిగా తినేసిందట. కొందరు వన్యప్రాణి నిపుణుల అభిప్రాయంలో ఇంతవరకు అతి పెద్ద మొసలి ఒరిస్సాలోని భైతర్కనికా (Bhitarkanika) లో జీవించింది. దీని పొడవు షుమారు 25 అడుగులు (7.62 మీటర్లు). కనికా రాజ కుటుంబం వారు (Kanika Royal Family) దీని తల భాగాన్ని భద్ర పరచారు. దాని ఆధారంగా మొత్తం మొసలి పరిమాణాన్ని అంచనా వేశారు. ఇది ధమారా (Dhamara) వద్ద 1926లో చంపబడింది.

మొసళ్ళు, ఎలిగేటర్లు, కెయ్‌మన్, ఘరియల్

మార్చు
 
బాంగ్‌కాక్‌లో ఒక మొసళ్ళ పెంపకం ఫార్మ్‌వద్ద లభిస్తున్న మొసలి చర్మం పర్సులు

మొసళ్ళు (Crocodiles), ఎలిగేటర్లు (alligators), కెయ్‌మన్ (caiman) - ఈ జాతులలో కొన్ని పోలికలు ఉన్నాయి. అంతే కాకుండా ఘరియల్ (gharial) కూడా మొసలి జాతికి చెందదిందే. (వివరాల కోసం ఆంగ్ల వికీ వ్యాసం Crocodilia చూడండి.)

జీవ లక్షణం, ప్రవర్తన

మార్చు
 
నోరు తెరచికొని విశ్రమిస్తున్నసయామీస్ మొసలి (sleeping with its mouth open to pant).

మొసలి గంటకు 11 మైళ్ళ వేగంతో పాకగలదు. ఇవి పొంచి ఉండి వేటాడుతాయి. ఇవి చల్లని రక్తం కలిగిన వేటజవులు (cold-blooded predators) గనుక వీటిలో చురుకుదనం తక్కువ (lethargic). అందువలన శక్తిని ఖర్చు చేయవు గనుక ఇవి చాలా కాలం ఆహారం లేకుండా ఉండగలవు. అలాగని ఇవి ఒకమూల పడి ఉండే రకాలు కాదు. భయంకరంగా వేటాడుతాయి. సొర చేపలను కూడా ఎదుర్కొని చంపిన ఘటనలు ఉన్నాయి.[6]

అయితే "Egyptian Plover అనే జాతి మొసలి చాలా బద్ధకస్తువు. ఇది దాని నోటిలోకి వచ్చిన పరాన్న జీవులను తింటుంది. దాని నోరు వెడల్పుగా తెరిచిపెట్టి ఉంచి, పక్షులు దాని నోటిని శుభ్రం చేసే అవకాశం కలిగిస్తుంది.(Richford and Mead 2003).

చాలా పెద్ద మొసళ్ళు చిన్న రాళ్ళను మింగుతాయి. ఈ రాళ్ళు వాటికి నీటిలో మునగినప్పుడు శరీరం బాలన్స్ చేసే ballast గా ఉపయోగపడవచ్చును. మరొక అభిప్రాయం ప్రకారం పక్షులలో ఆహారం నూరడానికి రాళ్ళు ఉపయోగపడినట్లే వీటికీ ఉపయోగపడవచ్చును. బాధగా ఉన్నపుడు, లేదా శత్రువును ఎదుర్కొంటున్నపుడు మొసళ్ళు కొన్ని శబ్దాలు చేస్తాయి. వాటి వినికిడి శక్తి కూడా బాగా ఎక్కువ[1]. మొసళ్ళు చేపలను, పక్షులను, ఇతర క్షీరదాలను తింటాయి. అరుదుగా ఇతర మొసళ్ళను తింటాయి.

ప్రపంచంలో చాలా చోట్ల మొసళ్ళు రక్షిత జంతువులు. కొద్దిచోట్ల మాత్రం వీటిని వాణిజ్యపరంగా పెంచుతున్నారు. వీటి చర్మంతో చేతి బ్యాగ్‌లు వంటివి చేస్తారు. మొసలి మాంసానికి కూడా గిరాకీ ఉంది.

మొసళ్ళు ఇతర సరీసృపాలకంటే కూడా పక్షులు, డైనోసార్‌ల జాతులతో ఎక్కువ పోలికలు కలిగి ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి Archosauria ('ruling reptiles') అనే వర్గంగా పరిగణిస్తారు. మొసలి గర్భస్త పిండానికి లింగ వ్యత్యాసం లేదు. కనుక ఆడ, మగ అనే తేడా జన్యుపరంగా సంభవించదు. అవి పుట్టిన ఉష్ణోగ్రతను బట్టి ఆడ, మగగా వెలువడుతాయి. షుమారు 31.6 °C వద్ద పుట్టినవి మగవిగాను, అంతకు కాస్త ఎక్కువ లేదా తక్కువ ఉష్ణగ్రతలో పుట్టినవి ఆడవిగాను అవుతాయి.[8]

భూమిమీద మొసలి వేగం గంటకు 17 కిలోమీటర్లు (11 మైళ్ళు)గా కొలువబడింది. [9] అయితే ఇది జాతినిబట్టి మారుతుంటుంది.

మనుషులకు ప్రమాదం

మార్చు
 
ఎండలో విశ్రమించిన మొసళ్ళు

పెద్ద జాతి మొసళ్ళు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి. వాటి "నడక" వేగం కంటే మెరుపులా మీదపడే లక్షణం వల్ల మనుషులకు తప్పించుకొనే అవకాశం చాలా తక్కువ. వీటిలో ఉప్పు నీటి మొసలి, నైల్ మొసలి యేటా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో వందలాది మనుషుల మరణాలకు కారణమవుతున్నాయి. మగ్గర్ మొసలి, నల్ల కెయ్‌మన్ కూడా చాలా ప్రమాదకరమైనవి. అమెరికన్ ఎలిగేటర్ అంత ప్రమాదకరమైనది కాదు. రెచ్చగొడితే తప్ప తనంత తనుగా ఇది మనుషులపై దాడి చేయదు.

మొసళ్ళవలన అత్యధిక మరణాలు రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో బర్మాలో రామ్‌రీ దీవి యుద్ధం సమయంలో జరిగాయి. 1945 ఫిబ్రవి 19న 900 మంది జపాన్ సైనికులు 10 మైళ్ళ ఉప్పునీటి కయ్యలగుండా ప్రయాణించారు. అక్కడ ఉప్పునీటి మొసళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. రామ్‌రీ నుండి తప్పించుకొన్న 500 మంది సైనికులలో 20 మంది మాత్రమే బ్రిటిష్ సేనకు దొరికారు. తక్కిన వారిలో చాలామంది మొసళ్ళకు బలి అయ్యి ఉండవచ్చును.

క్రోకడైలిడే వర్గీకరణ

మార్చు

చాలా వరకు మొసళ్ళు క్రోకడైలస్ ప్రజాతి క్రిందకి వస్తాయి. రెండవ ప్రజాతిఆస్టియోలేమస్ లో ఒకటే జాతి మొసలి ఉన్నది.

మొసలి నుండి ఉత్పాదనలు

మార్చు

మొసలి చర్మంతో పర్సులు, బ్రీఫ్ కేసులు, చేతి బ్యాగులు, బెల్టులు, టోపీలు, బూట్లు చేస్తారు. ఆస్ట్రేలియా, ఇథియోపియా, థాయిలాండ్, దక్షిణ ఆఫ్రికా, క్యూబా వంటి కొన్ని చోట్ల మొసలి మాంసం ఊరగాయగా పెడతారు. కొన్ని ప్రత్యేక రెస్టారెంట్లలో మొసలి మాంసం లభిస్తుంది. మొసలి నూనె కూడా చాలా కాలంగా చర్మానికి పూసుకోవడానికి వాడుతున్నారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Grigg, Gordon and Gans, Carl (1993) Morphology And Physiology Of The Crocodylia, in Fauna of Australia Vol 2A Amphibia and Reptilia, chapter 40, pages 326-336. Australian Government Publishing Service, Canberra. PDF Archived 2005-07-20 at the Wayback Machine
  2. Uriona TJ, Farmer CG. 2008. Recruitment of the diaphragmaticus, ischiopubis and other respiratory muscles to control pitch and roll in the American alligator (Alligator mississippiensis). Journal of Experimental Biology 211: 1141-1147.
  3. National Geographic documentary; "Bite Force", Brady Barr.
  4. Britton Adam. Crocodilian Biology Database, FAQ. "How long do crocodiles live for?". Retrieved 9/11/2006.
  5. profile of Mr Freshy at Australia Zoo website Archived 2014-02-27 at the Wayback Machine, accessed 1 February 2007
  6. 6.0 6.1 Saltwater Crocodile, Saltwater Crocodile Profile, Facts, Information, Photos, Pictures, Sounds, Habitats, Reports, News - National Geographic
  7. "Orissa crocodile recognised as world's largest". Reuters. 2006-06-16. Retrieved 2006-06-18.[permanent dead link][permanent dead link]
  8. Britton, Adam. Estuarine Crocodile: Crocodylus porosus Archived 2008-06-07 at the Wayback Machine. Crocodilians: Natural History Conservation: Crocodiles, Caimans, Alligators, Gharials. Retrieved 4 January 2007.
  9. Britton, Adam. "Crocodilian Biology Database FAQ, "How fast can a crocodile run?"". Retrieved 2008-02-02.
కొన్ని ఉపయోగకరమైన రచనలు
  • Iskandar, DT (2000). Turtles and Crocodiles of Insular Southeast Asia and New Guinea. ITB, Bandung.
  • Crocodilian Biology Database, FAQ. "How long do crocodiles live for?" Adam Britton. [1]
  • Crocodilian Biology Database, FAQ. "How fast can a crocodile run?" Adam Britton. [2]
  • Richford, Andrew S.; Christopher J. Mead (2003). "Pratincoles and Coursers". In Christopher Perrins (Ed.) (ed.). Firefly Encyclopedia of Birds. Firefly Books. pp. 252–253. ISBN 1-55297-777-3.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మొసలి&oldid=3898252" నుండి వెలికితీశారు