ఇద్దరు మిత్రులు (1961 సినిమా)
ఇద్దరు మిత్రులు,1961 డిసెంబర్ 29 విడుదల. అన్నపూర్ణ వారి ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు డ్యూయల్ రోల్ పోషించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రాజసులోచన, ఇ.వి.సరోజ, గుమ్మడి, శారద, పద్మనాభంముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
ఇద్దరు మిత్రులు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు (సహాయకుడు: కె. విశ్వనాధ్) |
---|---|
నిర్మాణం | డి. మధుసూదనరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు (అజయ్ బాబు, విజయ్), రాజసులోచన (సరళ), ఇ.వి.సరోజ, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం, శారద, జి.వరలక్ష్మి, రేలంగి , అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, సూర్యకాంతం |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నేపథ్య గానం | పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, ఘంటసాల, పి. సుశీల |
గీతరచన | శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి |
ఛాయాగ్రహణం | పి.ఎన్. సెల్వరాజ్ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఈ ముసి ముసినవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
ఒహో ఒహో నిన్నే కోరగా, కుహూ కుహూ అనీ కోయిల | శ్రీశ్రీ | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా | దాశరథి కృష్ణమాచార్య | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
పాడవేల రాధికా ప్రణయసుధా గీతికా | శ్రీశ్రీ | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
- ఓహో ఫేషన్‌ల సీతాకోక చిలకా - సుశీల బృందం, రచన: ఆరుద్ర
- చక్కని చుక్కా సరసకు రావే - పి.బి. శ్రీనివాస్, సుశీల, రచన: ఆరుద్ర
- నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే - సుశీల బృందం, రచన: దాశరథి
- శ్రీరామ నీనామమెంతో రుచిరా - మాధవపెద్ది బృందం, రచన:కొసరాజు.
- రాతినే ఇల నాతిగా మార్చి కోతికే శ్రీరామ నీ నామ,మాధవపెద్ది బృందం , రచన:కొసరాజు
- భవమాన సుతుడు బట్టు పాదార (బిట్), మాధవపెద్ది బృందం .
మూలాలు
మార్చు- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా) . పాడవేల రాధికా..ప్రణయ సుధాగీతికా పాట లిరిక్స్ విశ్లేషణ - కొన్ని అరుదైన , అపురూపమైన పాటల్ని లోతైన విశ్లేషణలతో ఈ వేదిక … పాటను యధాతధంగా కాదు అందులోని లోతైన అర్థాన్నీ , అంతరార్థాన్ని , అంతకన్నా మించి పాట లోలోతుల్లో కదలాడుతున్న, కవితాత్మక , తాత్విక రసగుళికల్ని, మీ హృదయంలోకి ఒంపుతుంది. పాట విశ్లేషణ కొరకు https://www.teluguoldsongs.net/2021/01/blog-post_70.html#.YsgznEf6GUE.whatsapp తెలుగు పాత పాటల విశ్లేషణ బ్లాగ్